నటుడిగా తొలి సినిమా ‘అష్టాచెమ్మా’తోనే గొప్ప పేరు సంపాదించి.. ఆ తర్వాత దర్శకుడిగా, రచయితగానూ బహుముఖ ప్రజ్ఞ చాటుకుని టాలీవుడ్లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు అవసరాల శ్రీనివాస్. నటుడిగా, రచయితగా, దర్శకుడిగా అతడి శైలి కొంచెం భిన్నంగా ఉంటుంది. ఏదో కొత్తగా చేయాలని చూస్తుంటాడు. వ్యక్తిగత జీవితం విషయంలోనూ అతడిది అదే శైలి అని తాజాగా ఒక ఇంటర్వ్యూలో వెల్లడైంది. అవసరాలకు పెళ్లి చేసుకునే ఉద్దేశమే లేదట.
తన జీవితంలో పెళ్లి అనే చాప్టర్ క్లోజ్ అయిపోయిందని అతను తేల్చేశాడు. దీనికి కారణాలేంటో మాత్రం వెల్లడించలేదు. తాను ఎప్పటికీ పెళ్లి చేసుకోనని మాత్రం చెప్పేశాడు. అంత కఠిన నిర్ణయం ఎందుకు తీసుకున్నారు అని అడిగితే.. పెళ్లి చేసుకోవాలనుకోవడమే అత్యంత కఠిన నిర్ణయం అన్నాడు అవసరాల. సోలోగా మన జీవితమేదో మనం బతుకుతూ హ్యాపీగా ఉన్నపుడు.. వేరే వ్యక్తిని మన జీవితంలోకి తీసుకొచ్చి వాళ్లతో అడ్జస్ట్ కావడానికి ప్రయత్నించడం అంత తేలికైన విషయం కాదని.. కాబట్టి పెళ్లి చేసుకోవాలనుకోవడమే కఠిన నిర్ణయమని అతను తనదైన శైలిలో వ్యాఖ్యానించాడు.
ఇక సినిమా కెరీర్ గురించి మాట్లాడుతూ.. తన స్నేహితులు భావించినట్లుగా తానేమీ సినిమా రంగంలోకి తెగ కష్టాలు పడిపోలేదని అతనన్నాడు. తనకు సినిమాలంటే ఇష్టం కాబట్టి ఎం.ఎస్ చేశాక కూడా ఇటు వైపు వచ్చానని.. చూసేవాళ్లకు తాను సినీ రంగంలో చాలా కష్టపడిపోయానని అనిపిస్తే అనిపించి ఉండొచ్చని.. కానీ తాను ఏం చేసినా ఇష్టంతో చేశాను కాబట్టి అది కష్టంగా అనిపించలేదని అవసరాల చెప్పాడు. తన దర్శకత్వంలో తొలి సినిమాను నిర్మించే ప్రొడ్యూసర్ కోసం తాను మూడేళ్లు ఎదురు చూశానని.. ఐతే కళ్యాణి మాలిక్ ద్వారా సాయి కొర్రపాటి పరిచయం అయ్యాక 45 నిమిషాల్లోనే సినిమా ఓకే చేయించుకున్నానని ఈ ఇంటర్వ్యూలో అవసరాల వెల్లడించాడు.
This post was last modified on September 1, 2021 11:38 am
దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్‌ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…
వచ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్రజల మధ్యకు వస్తున్నానని.. తనతో పాటు 175 నియోజకవర్గాల్లో నాయకులు కూడా ప్రజలను కలుసుకోవాలని…
రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు. ప్రతివిమర్శలు కూడా ఎదుర్కొనచ్చు. కానీ, ప్రతి విషయంలోనూ కొన్ని హద్దులు ఉంటాయి. ఎంత రాజకీయ పార్టీకి…
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…