ప్లాప్ హీరోయిన్ల సుడి తిరిగిందోచ్!

ప్రస్తుత పరిస్థితులలో సినిమా బడ్జెట్లు ఎంత తగ్గితే అంత మంచిదని నిర్మాతలు ఏకగ్రీవంగా తీర్మానించుకున్నారు. ఆ దిశగా సంస్కరణలు, సవరణలు కూడా జరగబోతున్నాయి. ఇందులో భాగంగా నటీనటుల పారితోషికాలపై కోత విధించాలని అందరు డిసైడ్ అయ్యారు. అయితే ఫామ్ లో ఉన్న హీరోయిన్లు అంతగా పారితోషికం తగ్గించుకునే అవకాశం లేదు.

హీరోలతో పోలిస్తే తమకి ఇచ్చేదే తక్కువ కాబట్టి వాళ్ళు ఎక్కువ రిబేట్ ఇవ్వరు. అందుకే ఫ్లాప్స్ లో ఉండి ప్రస్తుతం అవకాశాలు లేని హీరోయిన్లపై నిర్మాతలు ఆసక్తిగా ఉన్నారు. వాళ్లయితే ఎక్కువ డిమాండ్ చేయకుండా సినిమా చేసేస్తారు కనుక వాళ్ళ మేనేజర్స్ కి కాల్స్ వెళుతున్నాయట.

ఫలానా టైం నుంచి డేట్స్ ఫ్రీ పెట్టుకోమని చెబుతున్నారట. లాక్ డౌన్ వల్ల అందరికీ నష్టం రాలేదని, కొందరి జాతకాలూ మారుతున్నాయని ఇది చెబుతోంది. ఇలా ఫ్లాప్ హీరోయిన్లు పోటీలోకి వస్తే ఫామ్ లో ఉన్న హీరోయిన్లు కూడా దిగిరాక తప్పదు మరి.