టాలీవుడ్ మరో నిరాశాజనక వారాంతాన్ని దాటుకుని ముందుకొచ్చేసింది. గత శుక్రవారం మంచి అంచనాల మధ్య విడుదలైన శ్రీదేవి సోడా సెంటర్, ఇచ్చట వాహనములు నిలుపరాదు చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమయ్యాయి. సుశాంత్ సినిమా పూర్తి నెగెటివ్ టాక్ తెచ్చుకుని వీకెండ్లోనే నిలవలేకపోయింది. ఆ సినిమా దాదాపు వాషౌట్ అని చెప్పొచ్చు.
మిక్స్‌డ్ టాక్ తెచ్చుకున్న సుధీర్ బాబు చిత్రం ‘శ్రీదేవి సోడా సెంటర్’ కూడా ఆశించిన వసూళ్లు రాబట్టలేకపోయింది. తొలి రోజు నుంచి స్ట్రగులవుతూ వస్తున్న ఈ చిత్రం వీకెండ్ తర్వాత పూర్తిగా తేలిపోయింది. సోమవారం షేర్ నామమాత్రంగా రావడంతో ఈ సినిమా బాక్సాఫీస్ రన్ దాదాపు క్లోజ్ అయినట్లే కనిపిస్తోంది. గత వీకెండ్లో మరో రిలీజ్ ‘హౌస్ అరెస్ట్’ గురించి చెప్పడానికేమీ లేదు. ఇక ఫోకస్ ఈ వారం సినిమాల మీదికి మళ్లింది. అందులో ‘డియర్ మేఘా’కు ఏమంత బజ్ లేదు.
ఐతే అవసరాల శ్రీనివాస్ సినిమా ‘నూటొక్క జిల్లాల అందగాడు’కు మాత్రం మంచి క్రేజే కనిపిస్తోంది. మంచి ఎంటర్టైనింగ్ టీజర్.. ట్రైలర్ల ద్వారా ఈ సినిమా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. బట్టతల ఉన్న కుర్రాడి కష్టాల నేపథ్యంలో చాలా సరదాగా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దినట్లున్నారు. హిందీలో ఈ కాన్సెప్ట్‌తో రెండు సినిమాలు రిలీజై మంచి ఫలితాన్నందుకున్నాయి. తెలుగు ప్రేక్షకులకు ఇది కొత్త. అవసరాల శ్రీనివాస్ ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణ అనడంలో సందేహం లేదు.
గత వారం సినిమాల పనైపోవడం.. ఈ వారానికి షెడ్యూల్ అయిన సీటీమార్, గల్లీ రౌడీ చిత్రాలు వాయిదా పడటం ‘నూటొక్క జిల్లాల అందగాడు’కు బాగా కలిసొచ్చే విషయాలే. అందుకే ప్రమోషన్లు కూడా గట్టిగా చేస్తున్నారు. ఫన్నీ ప్రోమోలతో టీవీల్లో, సోషల్ మీడియాలో హోరెత్తిస్తున్నారు. ఈ సినిమాకు మంచి ఓపెనింగ్స్ కూడా వస్తాయని అంచనా వేస్తున్నారు. పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే అవసరాలకు హీరోగా పెద్ద సక్సెస్ రాబోతున్నట్లే.
This post was last modified on August 31, 2021 6:32 pm
అవును.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్త పోలీస్ బాస్ రానున్నారు. ఈ అంశంపై ఎవరు వస్తారన్న దానిపై ఇప్పటివరకున్న కన్ఫ్యూజన్ ఒక…
ఎంత తలలు పండిన దర్శకులైనా రెండు మూడు హిట్లు పడ్డాక ఫ్లాపులు చూడటం సహజం. కెవి రెడ్డి, మణిరత్నం దగ్గర…
గత కొన్నేళ్లలో అర్ధ శతదినోత్సవం, హండ్రెడ్ డేస్ పదాలు అరుదైపోయాయి. ఏ సినిమా అయినా ఎన్ని వందల కోట్లు వసూలు…
ఎక్కడో ఢిల్లీలో రెండేళ్ల కిందట ప్రియురాలిని చంపి.. ముక్కలు చేసి ఫ్రిజ్లో పెట్టి.. విడతల వారీగా వాటిని అడవిలో విసిరేసిన…
యావత్ ప్రపంచం ఆసక్తిగా మాట్లాడుకుంటున్న మహా కుంభమేళాలో.. అతి సాదాసీదాగా పూసలు అమ్ముకునేందుకు వచ్చిన పదహారేళ్ల అమ్మాయి ఇప్పుడు ప్రపంచానికి…
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ కు నేటితో 41 ఏళ్లు నిండాయి.…