ఆనంది అలియాస్ రక్షిత.. అచ్చ తెలుగు అమ్మాయి. గతంలో ఈ రోజుల్లో, బస్ స్టాప్ లాంటి చిత్రాల్లో సహాయ పాత్రలు చేసిందీ అమ్మాయి. వాటితో రావాల్సినంత పేరు రాలేదు. అదే సమయంలో తమిళంలోకి వెళ్లింది. అక్కడ ‘కయల్’ అనే మంచి సిినిమా చేసి తమిళ ప్రేక్షకుల మనసులు కొల్లగొట్టేసింది. తర్వాత అవకాశాలు వరుస కట్టాయి. మీడియం రేంజ్ హీరోయిన్‌గా బాగానే సెటిలైంది. రెండంకెల సంఖ్యలో సినిమాలు చేసింది.
జాతీయ అవార్డు సాధించిన ‘పరియేరుం పెరుమాళ్’ సినిమాలో ఆనంది పెర్ఫామెన్స్‌కు గొప్ప ప్రశంసలు దక్కాయి. ఎందరో ప్రముఖులు ఆమె నటనను కొనియాడారు. ఆమెకు చాలా భవిష్యత్ ఉందన్నారు. వయసు తక్కువే కావడంతో ఆనంది చాలా కాలం ఇండస్ట్రీలో కథానాయికగా కొనసాగుతుందని అంచనా వేశారు. ఐతే సడెన్‌గా ఆమె ఓ అసిస్టెంట్ డైరెక్టర్‌ను పెళ్లాడేసింది. ఆనంది స్వస్థలం అయిన వరంగల్లో సింపుల్‌గా వీరి పెళ్లి జరిగిపోయింది.
పెళ్లి చేసుకున్నప్పటికీ కథానాయికగా కొనసాగుతుందని.. తన శైలిలో ట్రెడిషనల్ క్యారెక్టర్లతో సాగిపోతుందని అనుకున్నారంతా. కానీ ఆనంది అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తూ ప్రెగ్నెంట్ అయింది. కళ్ల ముందు మంచి కెరీర్ కనిపిస్తుంటే పెళ్లయిన వెంటనే ఆనంది తల్లిగా మారడం చాలామందికి మింగుడు పడటం లేదు. అందులోనూ తన మాతృ భాషలో కథానాయికగా నిలదొక్కుకోవడాలన్న ఆమె కోరిక ఇప్పుడే నెరవేరే పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే ‘జాంబి రెడ్డి’తో హిట్టు కొట్టిన ఆనంది.. తాజాగా ‘శ్రీదేవి సోడా సెంటర్’తో ఆకట్టుకుంది.
ఈ సినిమా ఫలితం సంగతలా ఉంచితే.. ఆనంది పెర్ఫామెన్స్‌కు ప్రశంసలు దక్కుతున్నాయి. ఈ సినిమా తర్వాత కచ్చితంగా ఆమెకు అవకాశాలు పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. కానీ ఈలోపే ఆనంది ఆరు నెలల గర్భవతి అనే వార్త బయటికి వచ్చింది. కెరీర్ మరో స్థాయికి వెళ్తుందనుకుంటున్న సమయంలో ఆమె ప్రెగ్నెంట్ కావడమేంటి అని చాలామంది ఆశ్చర్యపోతున్నారు. తల్లి కావాలనుకోవడం ఆమె వ్యక్తిగత విషయమే అయినప్పటికీ.. ఇలా చేసి సినిమాలకు దూరం కావడం ఆమె అభిమానులకు రుచించడం లేదు. ఇందుకోసం రెండు మూడేళ్ల గ్యాప్ ఖాయం కాబట్టి తిరిగి సినిమాల్లోకి రావాలనుకున్నా ఆమెకు అప్పుడు అవకాశాలు వస్తాయా అన్నది డౌటే.
This post was last modified on August 31, 2021 3:55 pm
2024 సార్వత్రిక ఎన్నికల ముందు ఏపీలో కూటమి పార్టీలకు చెందిన శ్రేణుల నుంచి ఓ వినూత్న నినాదం వినిపించింది. సైకో…
బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్న హిట్ 3 ది థర్డ్ కేస్ మీద జరిగిన రివ్యూలు, ఆన్ లైన్ విశ్లేషణలు, సోషల్…
మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కబోయే ఎంటర్ టైనర్ కోసం హీరోయిన్ వేట కొనసాగుతోంది. ఏవేవో పేర్లు అనుకుని…
"తెలంగాణ పోలీసులు ట్రాఫిక్ విషయంలో కఠినంగా ఉంటారు. ఖచ్చితంగా ఉంటారు."- ఇదీ.. కొన్నిరోజుల కిందట పోలీసు బాస్ చేసిన కామెంట్లు.…
ఎదురు చూసి చూసి అభిమానులే అంచనాలు తగ్గించేసుకున్న హరిహర వీరమల్లు గేరు మార్చబోతోందని తాజా సమాచారం. ఈ రోజు నుంచి…
నిన్న జరిగిన లార్వెన్ ఏఐ స్టూడియో ప్రారంభోత్సవంలో దర్శకులను ఉద్దేశించి నిర్మాత దిల్ రాజు అన్న మాటలు ఆలోచింపజేసేలా ఉన్నాయి.…