టాలీవుడ్ సహా.. కోలీవుడ్, శ్యాండిల్ వుడ్‌లను కుదిపేస్తున్న డ్రగ్స్ కేసు విచారణ ప్రారంభమైంది. 2017-19 మధ్య తెలంగాణ కేంద్రంగా సినీ నటులను విచారించిన.. స్థానిక అధికారులు.. అప్పట్లో నిత్యం వార్తల్లో ఉన్నారు. అయితే.. ఈ కేసులో బాలీవుడ్‌కు కూడా సంబంధాలు ఉన్నాయని వార్తలు రావడం.. ముంబై కేంద్రంగా కొందరు డ్రగ్స్ వినియోగించి.. భారీ ఎత్తున మనీలాండరింగులకు పాల్పడిన నేపథ్యంలో నేరుగా ఈ కేసును.. ఈడీ అధికారులు చేపట్టారు. దీనిలో వారు మనీలాండరింగ్ కు సంబంధించిన మూలాలను రాబట్టనున్నారు.
ఈ క్రమంలో తాజాగా తెలుగు అగ్ర దర్శకుడు పూరీ జగన్నాథ్‌కు ఈడీ అధికారులు ఇటీవల నోటీసులు జారీ చేశారు. ఈక్రమంలో తాజాగా ఆయన ఈడీ అధికారుల ముందుకు వచ్చారు. అయితే.. ఈ క్రమంలో ఆయన ఏం చెబుతారు? అనేది ఆసక్తిగామారింది. ఇప్పటికే అగ్ర హీరో.. దగ్గుబాటి రాణా.. రవితేజ వంటివారి పేర్లు వినిపిస్తున్న నేపథ్యంలో ఈడీ విచారణ ఆసక్తిగా ఉత్కంఠగా మారింది. విషయంలోకి వెళ్తే.. టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈడీ విచారణ ప్రారంభమైంది. సినీ దర్శకుడు పూరి జగన్నాథ్ ఈడీ ఎదుట హాజరయ్యారు. మనీ లాండరింగ్ కింద కేసు నమోదు చేసిన ఈడీ అధికారులు… దానికి సంబంధించిన వివరాలు సేకరించేందుకు పూరి జగన్నాథ్ను ప్రశ్నించనున్నారు.
మొత్తం 12 మందిపై నజర్!
సినీ పరిశ్రమకు చెందిన 12 మందిని ఈడీ విచారించనుంది. నేటి నుంచి సెప్టెంబరు 22 వరకు విచారణ కొనసాగనుంది. డ్రగ్స్ కేసును దర్యాప్తు చేసిన సిట్ అధికారులను ఈడీ ప్రశ్నించనుంది. డ్రగ్స్ కేసులో 12 ఎఫ్ఐఆర్‌లు నమోదు చేసిన ఆబ్కారీశాఖ సిట్… 11 నేరాభియోగ పత్రాలు దాఖలు చేసింది. డ్రగ్స్ కేసులో మొత్తం 62 మందిని విచారించిన సిట్… ఆఫ్రికన్ దేశాలకు చెందిన 8 మందిని నిందితులుగా చూపింది. మరికొంత మందిని కూడా నిందితులుగా చూపింది. సినీ రంగానికి చెందిన 12 మందిని విచారించిన సిట్… నేరాభియోగ పత్రాల్లో మాత్రం 12 మంది గురించి ఎలాంటి ప్రస్తావన చేయలేదు. అయితే.. ఇప్పుడు వీరిని ఎందుకు పక్కకకు తప్పించారనే కోణంలోనూ దర్యాప్తు చేసే అవకాశం ఉంది.
విచారణ కాల్ షీట్లు ఇవే..
మనీ లాండరింగ్ చట్టం కింద 12మంది సినీ రంగానికి చెందిన వాళ్లకు ఈడీ నోటీసులు జారీ చేసింది. నేటి నుంచి సెప్టెంబర్ 22వ తేదీ వరకు నిర్దేశించిన తేదీల్లో హాజరు కావాలని సూచించింది. సినీ దర్శకుడు పూరి జగన్నాథ్ ఇవాళ ఈడీ ఎదుట హాజరుకానున్నారు.
సెప్టెంబర్ 2వ తేదీన ఛార్మి
6వ తేదీన రకుల్ ప్రీత్ సింగ్
8న రానా దగ్గుబాటి
9వ తేదీన రవితేజ, శ్రీనివాస్
13వ తేదీన నవదీప్తో పాటు ఎఫ్ క్లబ్ మేనేజర్
15న ముమైత్ ఖాన్
17న తనీష్
20న నందు, 22న తరుణ్ ఈడీ అధికారుల ఎదుట హాజరు కావాల్సి ఉంది.
This post was last modified on August 31, 2021 2:14 pm
టాలీవుడ్లో సక్సెస్ ఫార్ములా తెలిసిన దర్శకుల్లో అనిల్ రావిపూడి ఒకరు. కెరీర్ ప్రారంభం నుంచి ఆయన ఎంచుకుంటున్న పంథా చాలా…
తెలంగాణలో జనసేన టార్గెట్ ఫిక్స్ అయింది. జనసేన ప్రధాన లక్ష్యం 2028 అసెంబ్లీ ఎన్నికలేనని తెలంగాణ జనసేన ఇన్చార్జ్ శంకర్‌గౌడ్…
వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…
క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…
అప్పుడు మహ్మద్ గజని… ఇప్పుడు వైఎస్ జగన్ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…
సంక్రాంతి సీజన్ లో భారీ అంచనాల మధ్య వచ్చిన ది రాజా సాబ్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఒక రకమైన…