సౌత్ లో స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతుంది కీర్తి సురేష్. కెరీర్ మొదలుపెట్టినప్పటి నుండి ఈ బ్యూటీ కాస్త బొద్దుగానే కనిపించేది. ‘మహానటి’ సినిమా కోసం మరింత బరువు పెరిగి చబ్బీగా తయారైంది. ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో అమ్మడుకి మంచి పేరొచ్చింది. ఈ సినిమా తరువాత కీర్తి జీరో సైజ్ లోకి మారిపోయింది. అప్పటివరకు క్యూట్ గా కనిపించిన కీర్తి బక్కగా తయారవ్వడం అభిమానులకు నచ్చలేదు. ఈ లుక్ విషయంలో ఆమెని బాగా ట్రోల్ చేశారు.
అయితే ఇప్పుడు మరోసారి అమ్మడు బరువు పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. అసలు విషయంలోకి వస్తే.. కృతిసనన్ ప్రధాన పాత్రలో బాలీవుడ్ లో ‘మిమీ’ అనే సినిమా తెరకెక్కింది. దీనికి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఫ్యామిలీ ఆడియన్స్ ఎమోషనల్ గా ఈ సినిమాకి బాగా కనెక్ట్ అయ్యారు. ఇప్పుడు ఈ సినిమాను తెలుగు, తమిళ భాషల్లో రీమేక్ చేయడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. ప్రముఖ నిర్మాణ సంస్థ ఈ సినిమా రీమేక్ హక్కుల కోసం చర్చలు జరుపుతోంది.
ఈ రీమేక్ లో కీర్తి సురేష్ ను మెయిన్ లీడ్ గా తీసుకోవాలని భావిస్తున్నారు. ఇప్పటికే ఆమెతో సంప్రదింపులు మొదలుపెట్టారని టాక్. ఓ విదేశీ జంటకు బిడ్డను కనివ్వడం కోసం సరోగసీ ద్వారా గర్భం దాల్చిన ఓ పెళ్లి కాని అమ్మాయి కథే ‘మిమీ’. ఈ సినిమాలో గర్భవతిగా కనిపించడం కోసం కృతిసనన్ దాదాపు కేజీల బరువు పెరిగింది. ఇప్పుడు ఈ పాత్రకు కీర్తి సురేష్ ఓకే చెబితే మాత్రం ఆమె కూడా కచ్చితంగా బరువు పెరగాల్సి ఉంటుంది. మరి కీర్తి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి!
This post was last modified on August 30, 2021 1:38 pm
ఏపీలో విపక్షం వైసీపీలో ఫైర్ బ్రాండ్ నేతలుగా మాజీ మంత్రి, నగరి మాజీ ఎమ్మెల్యే ఆర్కే రోజా, నంద్యాల జిల్లాకు…
నిర్మాతగా నాని విపరీతమైన నమ్మకం పెట్టుకున్న కోర్ట్ ఇంకో మూడు రోజుల్లో విడుదల కానుంది. ఇంతకు ముందు ప్రొడ్యూసర్ గా…
వైసీపీ హయాంలో ఇష్టారాజ్యంగా వ్యవహరించిన ఆ పార్టీ నేతలు ఒక్కొక్కరుగానే బుక్ అయిపోతున్నారు. వైసీపీ జమానాలో ఆయా నేతలు సాగించిన…
ఏపీ రాజధాని అమరావతి విషయంలో ప్రతిపక్షం వైసీపీ నాయకులు సృష్టిస్తున్న విషప్రచారాన్ని ప్రజలు నమ్మరాదని ఏపీ మంత్రులు కోరారు. రాజధాని…
సాధారణంగా ఒక రాజకీయ పార్టీ విఫలమైతే.. ఆ పార్టీ నష్టపోవడమే కాదు.. ప్రత్యర్థి పార్టీలు కూడా బలోపేతం అవుతాయి. ఇప్పుడు…
హార్రర్ సినిమాల్లో దయ్యాల పాత్రలు పోషించిన కథానాయికలు చాలామందే ఉన్నారు. ఒకప్పుడంటే దయ్యాల పాత్రలు చేయడానికి స్టార్ హీరోయిన్లు వెనుకంజ…