ఓటిటీ వేదికగా సినిమాలు విడుదల చేసే యోచనలో కొందరు నిర్మాతలు ఉన్నారు కానీ, పిల్లి మేడలో ముందుగా గంట కట్టేది ఎవరన్నట్టు ఎదురు చూస్తున్నారు. అయితే ఎవరైనా బిగ్ ప్లేయర్ దిగితే మిగతా వాళ్ళు తప్పకుండా వచ్చేస్తారని ఓటిటీ ప్లాటుఫామ్స్ వాళ్ళకి ఎరుకే. అందుకే ఏకంగా దిల్ రోజునే దించాలని చూసారు.
వి సినిమా హక్కుల కోసం అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్ పోటీ పడ్డాయి. అయితే ఈ చిత్రం బడ్జెట్ ముప్పై కోట్లు పై చిలుకు కాగా డైరెక్ట్ ఓటిటీ రిలీజ్ కి 16 నుంచి 18 కోట్లు మాత్రమే ఆఫర్ చేసారు. మిగతాది స్ట్రీమ్స్ లో షేర్ ఇస్తామని చెప్పారు. అయితే పెట్టుబడిలో సగం కూడా రానప్పుడు ఇది అసలు రిలీజ్ మార్గమే కాదని దిల్ రాజు మిన్నకున్నారు.
అంతే కాకుండా తనలాంటి బడా నిర్మాత ఒత్తిడికి గురైతే చిన్న నిర్మాతలు ఇంకా ఆందోళన పడతారని, అలాగే సీనియర్ పంపిణీదారుడిగా పంపిణీ రంగానికి చేటు చేసే దాంట్లో మొదటి అడుగు తానూ వేయలేనని దిల్ రాజు సన్నిహితులతో చెప్పారట.
This post was last modified on May 29, 2020 2:13 am
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…