Movie News

బాలీవుడ్లోకి బ్యాంగ్ బ్యాంగ్ ఎంట్రీ

తమిళ యువ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ అరంగేట్రమే ఒక సంచలనం. 17 ఏళ్ల వయసులో ధనుష్ లాంటి స్టార్ హీరో సినిమా ‘3’తో అతను ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమా కోసం అతను ట్యూన్ చేసిన ‘కొలవెరి’ పాట ఎంతటి సంచలనమో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఆ పాట ఫ్లూక్ అనుకోవడానికి వీల్లేకుండా అదే సినిమాలో మిగతా పాటలనూ అద్భుత రీతిలో కంపోజ్ చేశాడు అనిరుధ్. నేపథ్య సంగీతమూ ఆకట్టుకుంది. ఆ తర్వాత తమిళ సినీ పరిశ్రమలో అతను ఇంతింతై అన్నట్లుగా ఎదిగిపోయాడు.

విజయ్, అజిత్, రజినీకాంత్, కమల్ హాసన్.. ఇలా బడా బడా హీరోలతో అతను సినిమాలు చేశాడు. టాప్ డైరెక్టర్లతోనూ పని చేశాడు. అనిరుధ్ టాలీవుడ్ ఎంట్రీ పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ శ్రీనివాస్‌ల ‘అజ్ఞాతవాసి’తో జరగడం విశేషం. ఆ సినిమా డిజాస్టర్ కావడంతో అనిరుధ్‌కు ఇక్కడ ఆశించిన ఆరంభం దక్కలేదు. కానీ గ్యాంగ్ లీడర్, జెర్సీ సినిమాలతో తనేంటో చాటి చెప్పాడు. త్వరలో ఎన్టీఆర్-కొరటాల సినిమాకు అతను సంగీతం అందించనున్నట్లు వార్తలొస్తున్నాయి.

ఇదిలా ఉంటే అనిరుధ్ ఇప్పుడు బాలీవుడ్లోకి కూడా అడుగు పెట్టేస్తున్నట్లు తెలుస్తోంది. అక్కడ అతను ఒక మెగా మూవీతోనే అరంగేట్రం చేయబోతున్నాడు. కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ హీరోగా తమిళ దర్శకుడు అట్లీ తీయబోయే సినిమాకు అనిరుధే సంగీత దర్శకుడట. ఈ చిత్రానికి స్క్రిప్టు లాక్ అయింది. ప్రి ప్రొడక్షన్ పనులు జోరుగా జరుగుతున్నాయి. కాస్ట్ అండ్ క్రూ ఎంపికలో అట్లీ బిజీగా ఉన్నాడు.

ఈ సినిమాలో నయనతార కథానాయికగా నటిస్తుందని ఇప్పటికే వార్తలు రావడం తెలిసిందే. ఇప్పుడు సంగీత దర్శకుడిగా అనిరుధ్ అనే అప్‌డేట్ బయటికొచ్చింది. చూస్తుంటే షారుఖ్ సినిమాను సౌత్ ప్రేక్షకులకు కూడా చేరువ చేయడం కోసం ఇక్కడ అందరికీ కనెక్టయ్యేలా నయనతార, అనిరుధ్ లాంటి వాళ్లను ఈ ప్రాజెక్టులో భాగం చేస్తున్నట్లున్నాడు అట్లీ. అనిరుధ్ ప్రతిభేంటో అందరికీ తెలిసిందే కాబట్టి బాలీవుడ్లో కూడా అతను బ్యాంగ్ బ్యాంగ్ ఎంట్రీ ఇస్తాడనే అంచనా వేస్తున్నారు

This post was last modified on August 30, 2021 8:36 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

కేసీఆర్ హరీష్‌తో జాగ్రత్త!: మహేష్ కుమార్

తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్‌కు, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ ఎస్‌కు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. ఇలాంటి…

1 hour ago

మనసు మార్చుకుంటున్న దురంధర్ 2

రిలీజ్ ముందు బజ్ లేకుండా, విడుదలైన రోజు కొందరు క్రిటిక్స్ దారుణంగా విమర్శించిన దురంధర్ సృష్టిస్తున్న సంచలనాలు అన్ని ఇన్ని…

1 hour ago

ఎన్నికల్లో పోటీపై నాగబాబు సంచలన ప్రకటన

ఇక‌పై తాను ప్ర‌త్య‌క్ష ఎన్నిక‌ల‌కు దూరంగా ఉంటాన‌ని జ‌న‌సేన అధినేత‌, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ సోద‌రుడు, ఎమ్మెల్సీ నాగ‌బాబు…

3 hours ago

నిన్నటిదాకా తిట్లు… కానీ ఇప్పుడేమో

ప్రపంచ ఫుట్‌బాల్ చరిత్రలోనే అత్యంత మేటి ఆటగాళ్లలో ఒకడైన లియోనెల్ మెస్సి రెండోసారి ఇండియాకు వస్తున్నాడని గత రెండు వారాలుగా ఇండియన్…

4 hours ago

రవితేజ రూటులో అఖిల్ రిస్కు ?

బ్లాక్ బస్టర్ సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న అఖిల్ ప్రస్తుతం లెనిన్ చేస్తున్న సంగతి తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోస్, సితార…

4 hours ago

దురంధరుడి వేట ఇప్పట్లో ఆగేలా లేదు

పెద్ద బడ్జెట్లలో తీసిన పెద్ద హీరోల సినిమాలు రిలీజ్ ముంగిట మంచి హైప్ తెచ్చుకుంటాయి. ఆ హైప్‌కు తగ్గట్లు మంచి ఓపెనింగ్సూ…

5 hours ago