Movie News

మ్యాస్ట్రో అలా ఫిక్సయ్యాడు

టాలీవుడ్లో ఇప్పుడు కొత్త సినిమాల రిలీజ్ డేట్ల విషయంలో చాలా గందరగోళం నడుస్తోంది. ముందు ఒక డేట్ ఇవ్వడం.. తర్వాత మార్చడం.. మళ్లీ కొత్త డేట్ ఇవ్వడం కామన్ అయిపోతోంది. మొన్నటిదాకా ‘లవ్ స్టోరి’ మూవీ సెప్టెంబరు 10కి ఫిక్స్ అనుకుంటూ వచ్చారు. కానీ నిన్న కథ మారిపోయింది.

ఆంధ్రప్రదేశ్‌లో టికెట్ల రేట్ల విషయంలో నెలకొన్న అయోమయం వల్ల ఈ చిత్రాన్ని వాయిదా వేసినట్లు తెలుస్తోంది. సెప్టెంబరు 3న రావాల్సిన ‘సీటీమార్’ చిత్రాన్ని 10వ తేదికి మార్చడంతో ‘లవ్ స్టోరి’ వాయిదా విషయం ఖరారైపోయింది.

మరోవైపు సెప్టెంబరు 10న ‘లవ్ స్టోరి’ ఖాయమైతే నాని సినిమా ‘టక్ జగదీష్’ను కొన్ని రోజులు ఆలస్యంగా విడుదల చేద్దామనుకున్నారు కానీ.. ‘లవ్ స్టోరి’ వాయిదాతో ఆ చిత్రాన్ని 10కే ఫిక్స్ చేశారు. ఇక ముందేమో నితిన్ మూవీ ‘మ్యాస్ట్రో’ను సెప్టెంబరు 9కే అనుకున్నారు కానీ.. ఇప్పుడా చిత్రాన్ని ఎనిమిది రోజులు ఆలస్యంగా విడుదల చేయాలని నిర్ణయించారు.

సెప్టెంబరు 17న శుక్రవారం ఈ చిత్రం హాట్ స్టార్‌లో రిలీజ్ కాబోతోంది. ఈ మేరకు హాట్ స్టార్ వాళ్లే అధికారిక ప్రకటన చేశారు. బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ ‘అంధాదున్’కు ఇది రీమేక్ అన్న సంగతి తెలిసిందే. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్, ఎక్స్‌ప్రెస్ రాజా చిత్రాల దర్శకుడు మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించాడు. ఇటీవలే రిలీజ్ చేసిన ‘మ్యాస్ట్రో’ ట్రైలర్ మంచి స్పందన తెచ్చుకుంది. హిందీలో మాదిరే ఉత్కంఠభరితంగా సినిమాను తీర్చిదిద్దినట్లున్నారు.

జీవనోపాధి కోసం అంధుడిగా నటించే ఓ కుర్రాడు.. అనుకోకుండా ఓ హత్యను చూస్తే ఎలా స్పందిస్తాడనే నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది. నితిన్ సరసన నభా నటేష్ నటించిన ఈ చిత్రంలో తమన్నా కీలక పాత్ర పోషించింది. ఒరిజినల్లో టబు చేసిన ఈ పాత్రే సినిమాలో హైలైట్‌గా ఉంటుంది. మణిశర్మ తనయుడు మహతి స్వర సాగర్ ఈ చిత్రానికి సంగీతం అందించాడు. నితిన్ సొంత నిర్మాణ సంస్థ ‘శ్రేష్ఠ్ మూవీస్’లో మాస్ట్రో తెరకెక్కింది.

This post was last modified on August 29, 2021 11:21 am

Share

Recent Posts

మంచి ఆలోచన చేసిన రణబాలి

దసరా పండగ సందర్భంగా విడుదల కాబోతున్న సినిమాల్లో రణబాలి మీద భారీ అంచనాలున్న సంగతి తెలిసిందే. విజయ్ దేవరకొండ, రష్మిక…

35 minutes ago

అమరావతిలో 300 కోట్లతో కేటీఆర్ 5 స్టార్ హోటల్?

ఏపీ రాజధాని అమరావతిలో తెలంగాణా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు కేటీఆర్ అంతర్జాతీయ ప్రమాణాలతో హోటల్ నిర్మిస్తున్నట్లు పుకార్లు షికార్లు…

8 hours ago

ఆదర్శం వెనుకడుగు వేయడం అవసరమే

ఆదర్శ కుటుంబం ఏకె 47 విడుదల అక్టోబర్ 9 నుంచి మళ్ళీ వాయిదా పడిందనే వార్త సోషల్ మీడియాలో గుప్పుమని…

8 hours ago

స‌ల్మాన్ సినిమాకు ఎట్ట‌కేల‌కు మోక్షం?

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఓ పెద్ద హిట్టు కొట్టి చాలా ఏళ్ల‌యిపోయింది. అస‌లే ఫ్లాపుల్లో ఉన్న అత‌డికి…

9 hours ago

జ్ఞానేష్ పై కేసులు తవ్వుతున్న కాంగ్రెస్

భారత ఎన్నికల సంఘంలో అత్యంత వివాదాస్పద కమిషనర్ గా పేరొందిన జ్ఞానేష్ కుమార్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటుంది. కేంద్రంలోని బీజేపీ…

9 hours ago

55 శాతం తెలంగాణ యువతకు జుట్టు సమస్యలు

యువత జీవితంలో కెరీర్, ఉద్యోగం, ఆర్థిక బాధ్యతలు కీలక దశను నిర్ణయిస్తాయి. అయితే ఇదే సమయంలో పెరుగుతున్న మానసిక ఒత్తిడి…

10 hours ago