కరోనా మహమ్మారి ధాటికి గత ఏడాదిన్నర కాలంలో ఎంతోమంది ప్రముఖులు ప్రాణాలు కోల్పోయారు. సినిమా వాళ్ల విషయానికి వస్తే ఈ వైరస్ కారణంగా గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ప్రాణాలు కోల్పోవడం కోట్లాది మంది అభిమానులను ఎంత వేదనకు గురి చేసిందో తెలిసిందే. కొందరు ప్రముఖులు ప్రాణాల మీదికి తెచ్చుకుని త్రుటిలో బయటపడ్డారు. టాలీవుడ్లో సీనియర్ హీరో రాజశేఖర్.. నటుడు, నిర్మాత బండ్ల గణేష్‌ల పరిస్థితి కూడా ఒక దశలో విషమంగా మారింది.
బండ్ల అయితే రెండుసార్లు కరోనా బారిన పడగా.. రెండో పర్యాయం తన పరిస్థితి విషమించినట్లు తాజాగా ఒక ఇంటర్వ్యూలో అతను తెలిపాడు. చికిత్స విషయంలో ఒక్క రోజు ఆలస్యం జరిగినా తన ప్రాణాలు పోయి ఉండేవని… ఆ స్థితిలో మెగాస్టార్ చిరంజీవే తన ప్రాణాలు కాపాడాడని.. ఒకప్పుడు తనను నిర్మాతగా నిలబెట్టి పవన్ కళ్యాణ్ జీవితాన్ని ఇస్తే.. ఇప్పుడు చిరంజీవి తనకు ప్రాణం పోశాడని మెగా బ్రదర్స్ మీద తాజాగా ఓ ఇంటర్వ్యూలో ప్రశంసలు కురిపించాడు బండ్ల.
కరోనా ఫస్ట్ వేవ్‌లో తాను వైరస్ బారిన పడినపుడు సులువుగానే కోలుకున్నానని.. కానీ సెకండ్ వేవ్ టైంలో కరోనా సోకినపుడు తన పరిస్థితి ఇబ్బందికరంగా తయారైందని బండ్ల తెలిపాడు. ఆ సమయంలో తన భార్య, పిల్లలకు కూడా కరోనా సోకిందని.. ఊపిరి తీసుకోవడం కూడా కష్టమై, మాట్లాడలేని స్థితికి తాను చేరుకున్నానని బండ్ల వెల్లడించాడు. ఐతే ఆసుపత్రిలో చేరదామనుకుంటే హైదరాబాద్‌లో ఏ ఆసుపత్రిలోనూ బెడ్స్ ఖాళీ లేవని.. అపోలో ఆసుపత్రికి ఫోన్ చేస్తే పెద్ద పెద్ద వాళ్లకు కూడా బెడ్స్ ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నట్లు సమాధానం వచ్చిందని చెప్పాడు.
పవన్ కళ్యాణ్‌కు ఫోన్ చేద్దామంటే ఆయనకు కూడా కరోనా బారిన పడ్డారని.. ఆ స్థితిలో చిరంజీవికి ఫోన్ చేస్తే రెండు రింగులకే కాల్ తీసి మాట్లాడారని.. తన పరిస్థితి చెబితే ఆయనే బెడ్ ఏర్పాటు చేయించి తన ప్రాణాలు నిలబెట్టారని బండ్ల తెలిపాడు. తాను ఆసుపత్రిలో చేరినప్పటికి ఊపిరితిత్తులు 80 శాతం పాడైపోయినట్లు వైద్యులు తెలిపారని.. ఒక్క రోజు ఆలస్యం అయి ఉంటే తన ప్రాణాలు పోయేవని.. కాబట్టి చిరంజీవి వల్లే తనే ప్రాణాలు నిలిచాయని బండ్ల తెలిపాడు.
This post was last modified on August 25, 2021 12:21 pm
ఉత్సాహం మంచిదే కానీ సమయం.. సందర్భం చూసుకోవాలి. అదేమీ లేకుండా కూటమి సర్కారుకు ఉన్న సున్నిత అంశాల్ని పరిగణలోకి తీసుకోకుండా…
టాలీవుడ్ బడా నిర్మాత దిల్ రాజు టార్గెట్ గా మంగళవారం తెల్లవారుజామున ఆదాయపన్ను శాఖ సోదాలు మొదలయ్యాయి. బడా నిర్మాతగానే…
అమెరికాలో అధ్యక్ష మార్పును ఆ దేశ ప్రముఖ పారిశ్రామికవేత్త ఎలాన్ మస్క్ తనకు అనుకూలంగా మార్చుకునే దిశగా తెలివిగా అడుగులు…
2024 ఎన్నికలకు రంగం సిద్ధమవుతున్న నాటి నుంచి ఎందుకనో గానీ… వైసీపీలో మార్పులు చేర్పులు జరుగుతూనే ఉన్నాయి. సరిగ్గా ఎన్నికల…
అగ్ర రాజ్యం అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ జే. ట్రంప్ పదవీ ప్రమాణం చేశారు. అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో ఏర్పాటు…
స్విట్జర్లాండ్లోని దావోస్లో సోమవారం నుంచి ప్రారంభమైన ప్రపంచ పెట్టుబడుల సదస్సుకోసం వెళ్లిన.. ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రులు నారా లోకేష్,…