సోషల్ మీడియానా మజాకానా? అన్నట్లుగా మారింది. గతంలో ఎంతో కష్టపడి.. లక్ తోడైతే తప్పించి స్టార్ స్టేటస్ వచ్చేది కాదు. ఇప్పుడు అందుకు భిన్నం. టాలెంట్ ఉండాలే కానీ.. అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. తాజాగా అలాంటిదే చోటు చేసుకుంది. దాదాపు నాలుగైదు నెలల క్రితం రిలీజ్ చేసిన బుల్లెట్ బండి పాటకు ఒక మోస్తరు రెస్పాన్స్ వస్తే.. అదే పాటను తన బరాత్ రోజున నడి రోడ్డు మీద కాబోయే భర్త ఎదుట పాడిన పాటకు వచ్చిన రెస్పాన్స్ అంతా ఇంతా కాదు. ఆ దెబ్బకు ఈ పాట ఒక్కసారిగా పాపులర్ కావటమే కాదు.. ఆ వధువు సోషల్ మీడియాలోనూ.. మీడియాలోనూ ప్రత్యేక ఆకర్షణగా మారారు. ఆమెకొచ్చిన క్రేజ్ ఎంత ఎక్కువన్నది చూస్తే.. తాజాగా ఆమెకు అనుకోని బంఫర్ ఛాన్స్ దక్కించుకుంది.
మంచిర్యాల జిల్లా జిన్నారానికి చెందిన అటవీ ఉద్యోగి కుమార్తె సాయి శ్రీయకు రామకృష్ణాపూర్‌కు చెందిన ఆకుల అశోక్ తో పెళ్లి ఖాయం కావటం తెలిసిందే. ఈ నెల 14న జరిగిన పెళ్లి వేళ.. జానపద గీతమైన బుల్లెట్ బండి పాటకు ఆమె వేసిన డ్యాన్స్ భారీగా వైరల్ కావటమే కాదు.. ఒరిజినల్ పాటకు మరింత ప్రచారాన్ని తెచ్చిపెట్టింది. పెళ్లైన తర్వాత భర్తతో కలిసి వేములవాడకు వెళ్లిన ఈ జంటను చూసి అక్కడి వారంతా విపరీతంగా ఎగబడటం.. వారిలో ఫోటోలు తీసుకునేందుకు పడిన ప్రయత్నం అంతా ఇంతా కాదు. అంతలా వారి ఇమేజ్ పెరిగిందన్న విషయం ఇట్టే అర్థమవుతుంది.
ఇదిలా ఉంటే.. ఈ బుల్లెట్ పాటను నిర్మించిన సంస్థ పేరు బ్లూ రాబిట్ ఎంటర్ టైన్ మెంట్. దీనికి నిర్వాహకురాలు నిరూప. తాజాగా బుల్లెట్ బండి పాటకు డ్యాన్సు వేసిన వధువుకు ఆమె నేరుగా ఫోన్ చేశారు. తమ సంస్థలో తదుపరి షూట్ చేసే పాటకు నటించాలన్న ఆఫర్ ను ఇచ్చారు. దీంతో.. ఊహించని రీతిలో వచ్చిన ఈ బంఫర్ ఆఫర్ కు కొత్త పెళ్లి కుమార్తె ఓకే చెప్పేసింది. దీంతో.. సాయిశ్రీ ప్రధాన పాత్రగా మరో పాట రానుంది. అనుకోని అవకాశాన్ని తెచ్చిన పెట్టిన సోషల్ మీడియా ఇప్పుడెంత పవర్ ఫుల్ అన్నది అర్థమవుతుందా?
This post was last modified on August 25, 2021 10:04 am
బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావుకు సంక్రాంతి వేళ భారీ ఎదురు దెబ్బ తగిలింది.…
క్వీన్, మణికర్ణిక లాంటి లేడీ ఓరియెంటెడ్ మూవీస్తో ఒక టైంలో బాలీవుడ్లో తిరుగులేని స్థాయిని అందుకుంది కంగనా. అప్పట్లో ఆమెకు…
సంక్రాంతి పండుగ అంటేనే అందరికీ వేడుక. కలవారు.. లేనివారు అనే తేడా లేకుండా చేసుకునే పండుగ ఇది. కనీసంలో కనీసం..…
రెండున్నర గంటలు అండర్ కవర్ ఆపరేషన్ చేసి సినిమా చివర్లో ట్విస్ట్ ఇచ్చే హీరోలాగా పండగ బరిలో లాస్ట్ వచ్చిన…
దేశ రాజధాని ఢిల్లీలో ప్రస్తుతం ఎన్నికల హీట్ ఉడికిస్తోంది. అదే సమయంలో అధికార పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)…
క్రియేటివిటీకి కాదేది అనర్హం అని పెద్దలు ఊరికే అనలేదు. కొత్త తరం దర్శకుల ఆలోచనలు చూస్తే అదే అనిపిస్తుంది. గత…