‘కేజీఎఫ్’ అనే ఒకే ఒక్క సినిమాతో దేశవ్యాప్తంగా తన పేరు మార్మోగిపోయేలా చేసుకున్నాడు ప్రశాంత్ నీల్. ఈ సినిమా నిజానికి రెగ్యులర్ మాస్ మసాలా ఎంటర్టైనరే. కాకపోతే దాన్ని ప్రశాంత్ ఒక డిఫరెంట్ స్టయిల్లో ప్రెజెంట్ చేసిన తీరు.. హీరోయిజాన్ని, మాస్ అంశాలను ఎలివేట్ చేసిన వైనం ప్రేక్షకులకు విపరీతంగా నచ్చేశాయి. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ నేపథ్యాన్ని ఎంచుకోవడం కూడా ఈ చిత్రానికి ప్రత్యేకతను చేకూర్చింది. ఈ చిత్రంలో విలన్ పాత్రధారుల లుక్స్, స్క్రీన్ ప్రెజెన్స్ విషయంలో ప్రశాంత్ పెట్టిన ఎఫర్ట్ అందరికీ తెగ నచ్చేసింది.
‘కేజీఎఫ్-చాప్టర్ 1’లో గరుడ పాత్ర చేసిన రామ్ లుక్ ప్రేక్షకులను ఒక రకమైన అలజడికి గురి చేపగా.. ‘చాప్టర్-2’లో సంజయ్ దత్ లుక్ వామ్మో అనిపించేసింది. ఇప్పుడు ప్రభాస్ హీరోగా ప్రశాంత్ రూపొందిస్తున్న ‘సలార్’ చిత్రంలో హీరో ప్రభాస్ లుక్ ఆకట్టుకుంది.
తాజాగా ఇందులో రాజమనార్ పాత్రలో జగపతి బాబు లుక్‌ను రివీల్ చేశారు. ఇందులోనూ ప్రశాంత్ స్టయిల్ కనిపించింది. ఐతే ఈ లుక్ చూశాక సోషల్ మీడియాలో ఫన్నీగా పంచులు కూడా వేస్తున్నారు నెటిజన్లు. ప్రశాంత్ సినిమా అంటే హీరో అయినా.. విలన్ అయినా ముందు నల్లగా మారిపోతారని.. తన చిత్రంలో ఎవరు నటించినా వాళ్లకు ముందు అతను బొగ్గు పూయించేస్తాడని.. విలన్లనగానే గడ్డం పెంచి ముక్కుకు, చెవులకు రింగులు తొడిగించేస్తారని.. ఇది అతడి టెంప్లేట్ స్టయిల్ అని వ్యాఖ్యానాలు చేస్తున్నారు నెటిజన్లు. ముఖ్యంగా జగపతి బాబు లుక్ మీద ఇలాంటి కౌంటర్లు చాలానే పడుతున్నాయి.
‘అరవింద సమేత’లో బసిరెడ్డి లుక్‌లోనే జగపతి బాబు కనిపిస్తున్నాడని.. అందుకు మించి అందులో కొత్తదనం ఏమీ లేదని.. కేవలం ముఖానికి ప్రశాంత్ తన స్టయిల్లో బొగ్గు మాత్రమే పూశాడని.. మిగతాదంతా సేమ్ టు సేమ్ అంటూ మీమ్స్ వేస్తున్నారు.
This post was last modified on %s = human-readable time difference 6:03 pm
నాలుగేళ్ల క్రితం 2021లో అల్లుడు అదుర్స్ తర్వాత బెల్లంకొండ సాయిశ్రీనివాస్ మళ్ళీ తెలుగు సినిమాలో కనిపించలేదు. అనవసరంగా బాలీవుడ్ మార్కెట్…
అత్త మీద కోపం దుత్త మీద చూపిస్తే పనయ్యే రోజులు కావివి. అలా చేయొచ్చనుకోవడమే అసలు కామెడీ. ఇటీవలే కన్నడ,…
హీరోయిన్లకు ఒక్కోసారి కెరీర్ లో స్పీడ్ బ్రేకర్ లాంటి దశ వస్తుంది. అప్పుడు ఎంత బ్లాక్ బస్టర్ సాధించినా అవకాశాలు…
పిఠాపురంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్న సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆడపిల్లలను అవమానిస్తుంటే చర్యలు తీసుకోరా?…
తమిళ స్టార్ విజయ్ తేరి తెలుగులో పోలీసోడుగా డబ్బింగ్ చేసినప్పుడు మన ప్రేక్షకులు అంతగా పట్టించుకోలేదు. మొదటిసారి థియేటర్లో చూసిన…
గంభీర్ కోచ్ గా KKK జట్టుకు అందించిన విజయాలు అందరిని ఎంతగానో ఎట్రాక్ట్ చేశాయి. అతను ఏది చెబితే అది…