ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో పూజాహెగ్డే అందరికీ హాట్ ఫేవరెట్ గా మారింది. స్టార్ హీరోలు తమ సినిమాల్లో పూజాను హీరోయిన్ గా తీసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. కొందరు హీరోలైతే ఆమెని రిపీట్ చేస్తున్నారు కూడా. ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ మరోసారి పూజాతో కలిసి రొమాన్స్ చేయడానికి రెడీ అవుతున్నాడని సమాచారం. ఇప్పటివరకు వీరిద్దరూ కలిసి ‘దువ్వాడ జగన్నాథం’, ‘అల.. వైకుంఠపురములో’ వంటి సినిమాల్లో నటించారు.
ఈ రెండు సినిమాలు భారీ విజయాలను అందుకున్నాయి. ‘అల.. వైకుంఠపురములో’ సినిమా ఇండస్ట్రీ రికార్డులను బద్దలు కొట్టింది. నిజానికి అల్లు అర్జున్ తన సినిమాల్లో హీరోయిన్లను రిపీట్ చేయడానికి ఇష్టపడరు. కానీ పూజాహెగ్డేతో మాత్రం రెండు సార్లు కలిసి పని చేశారు. ఇప్పుడు ఈ జంట మరోసారి వెండితెరపై అలరించబోతుందని టాక్. బన్నీ హీరోగా దర్శకుడు వేణు శ్రీరామ్ ‘ఐకాన్’ సినిమాను రూపొందించనున్న సంగతి తెలిసిందే.
ఈ సినిమాలో పూజాహెగ్డేను హీరోయిన్ గా తీసుకోవాలని వేణుశ్రీరామ్ భావిస్తున్నారు. కానీ ఈ విషయంలో అల్లు అర్జున్ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. ప్రస్తుతం పూజాహెగ్డే చాలా బిజీగా ఉంది. తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లో సినిమాలు ఒప్పుకుంది. రీసెంట్ గా మహేష్-త్రివిక్రమ్ సినిమా కూడా సైన్ చేసింది. ఇలాంటి సమయంలో బన్నీకి డేట్స్ కేటాయించగలదో లేదో మరి..!
This post was last modified on August 23, 2021 3:31 pm
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…