Movie News

తెలుగు వెబ్ సిరీస్.. ఇంకోటి క్లిక్


ఇండియాలో వెబ్ సిరీస్‌ల సంస్కృతిని ముందుగా అందిపుచ్చుకున్నది బాలీవుడ్ వాళ్లే. అక్కడ పేరున్న తారలతో పెద్ద ఎత్తున వెబ్ సిరీస్‌లు తయారయ్యాయి. మిగతా ఇండస్ట్రీలో అంత వేగంగా వెబ్ సిరీస్‌లకు అలవాటు పడలేకపోయాయి. ఐతే కరోనా రాకతో కథ మారిపోయింది. ఓటీటీల జోరు బాగా పెరగడంతో ప్రాంతీయ భాషల్లో పెద్ద ఎత్తున ఒరిజినల్స్ మొదలయ్యాయి. తెలుగులో ఆహా ఓటీటీ.. గత ఏడాది కాలంలో చెప్పుకోదగ్గ సంఖ్యలోనే వెబ్ సిరీస్‌లను రూపొందించింది.

ఐతే ఇటీవలే వచ్చిన ‘కుడి ఎడమైతే’ మాత్రమే ప్రేక్షకులను ఎక్కువగా మెప్పించింది. లాక్డ్, సిన్ లాంటి సిరీస్‌లు పర్వాలేదు. ఐతే ఈ సిరీస్‌లను పరిశీలిస్తే ఎక్కువగా హాలీవుడ్, హిందీ వెబ్ సిరీస్‌లకు అనుకరణలా కనిపిస్తాయి. వాటిలో మన నేటివిటీ కనిపించదు. కాగా చాయ్ బిస్కెట్ వాళ్లు రూపొందించిన ‘30 వెర్సస్ 21’ అచ్చమైన తెలుగు వెబ్ సిరీస్‌ లాగా కనిపించింది. అది అంచనాల్ని మించిపోయి అద్భుతమైన రెస్పాన్స్ తెచ్చుకుంది.

ఈ కోవలో ఇప్పుడు మరో తెలుగు వెబ్ సిరీస్‌.. తెలుగు ప్రేక్షకుల మనసు దోస్తోంది. అదే.. తరగతి గది దాటి. ఆహా కోసం దర్శకుడు మల్లిక్ రామ్ రూపొందించిన సిరీస్ ఇది. ‘కలర్ ఫోటో’లో పాపులర్ అయిన తరగతి గది దాటి అనే పాట పల్లవి నుంచి ఈ టైటిల్ తీసుకోవడంతో ఏదో క్యాష్ చేసుకునే ప్రయత్నంలా కనిపించింది కానీ.. ట్రైలర్ చూస్తే ఇందులో ఏదో ప్రత్యేకత ఉందనిపించింది. ఈ శుక్రవారమే ‘తరగతి గది దాటి’ రిలీజైంది.

ఐదు ఎపిసోడ్లతో షార్ట్ అండ్ స్వీట్‌గా ఉన్న వెబ్ సిరీస్ చూసిన ప్రేక్షకులందరూ చాలా పాజిటివ్‌గా మాట్లాడుతున్నారు. ల్యాగ్ లేకుండా తక్కువ నిడివితో.. మంచి ఫ్లోతో.. ఈ ఐదు ఎపిసోడ్లు సాగిపోవడం.. మంచి ఫీల్ ఉండటం.. ఎంటర్టైన్మెంట్‌కు తోడు ఎమోషన్లు కూడా సరిగా పండటంతో యూత్‌కు ఈ సిరీస్ బాగా నచ్చేస్తోంది. అన్ని పాత్రలకూ సరైన ఆర్టిస్టులను తీసుకోవడం.. అందరూ చక్కగా పెర్ఫామ్ చేయడం కూడా దీనికి ప్లస్ అయింది. హిందీలో వచ్చిన ‘ఫ్లేమ్స్’ ఆధారంగా ఈ సిరీస్‌ను తీర్చిదిద్దాడు దర్శకుడు మల్లిక్ రామ్. ఇంతకుముందు ‘విక్కీ డోనర్’ను ‘నరుడా డోనరుడా’గా రీమేక్ చేసి దెబ్బ తిన్న మల్లిక్‌.. ఈ సిరీస్‌లో బాగానే ప్రతిభ చూపించాడు.

This post was last modified on August 23, 2021 8:09 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

జగన్ ‘చిన్న చోరీ’ వ్యాఖ్యలపై సీఎం బాబు రియాక్షన్ ఏంటి?

తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…

2 hours ago

లేడీ డాన్లకు వార్నింగ్ ఇచ్చిన సీఎం

ఏపీలో లేడీ డాన్లు పెరిగిపోయారు.. వారి తోక కట్ చేస్తానంటూ సీఎం చంద్రబాబు నాయుడు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఈరోజు…

3 hours ago

మాయమైన నందమూరి హీరో రీ ఎంట్రీ

ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…

3 hours ago

దృశ్యం పాయింటుతో సిరీస్ తీశారు

శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…

4 hours ago

శివన్న డెడికేషనే వేరు

తెలంగాణ‌కు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…

4 hours ago

పర్ఫెక్షన్లో రాక్షసుడు జక్కన్న

బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్‌షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…

5 hours ago