థియేటర్స్ వెర్సస్ ఓటీటీ గొడవ చాలా పెద్దదైపోతోంది టాలీవుడ్లో. మంచి క్రేజున్న కొత్త చిత్రాలను ఓటీటీలో రిలీజ్ చేసి థియేటర్ ఇండస్ట్రీని దెబ్బ తీయొద్దంటున్న ఎగ్జిబిటర్లు తరచుగా నిర్మాతలకు హెచ్చరికలు జారీ చేస్తుండటం తెలిసిందే. తాజాగా ఒక ప్రెస్ మీట్ పెట్టిన ఎగ్జిబిటర్లు ఓటీటీ బాట పట్టిన ‘టక్ జగదీష్’ విషయంలో హీరో నానీని టార్గెట్ చేయడం.. భవిష్యత్తులో రాబోయే నాని చిత్రాలను థియేటర్లలో రిలీజ్ కానివ్వం అన్నట్లుగా వార్నింగ్ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. నిజానికి ఈ సినిమా రిలీజ్ విషయంలో నాని ప్రమేయం ఏమీ లేదన్నది అందరికీ తెలిసిన విషయమే. ఓటీటీలో కాకుండా థియేటర్లలోనే తన సినిమాను రిలీజ్ చేయించాలని నాని గట్టిగా ప్రయత్నించాడు. ఇందుకోసం అవసరమైతే తన పారితోషకంలో కొంత వెనక్కి ఇవ్వడానికి కూడా సిద్ధపడ్డాడు.
అసలు ఏ స్టార్ అయినా కూడా తన చిత్రం థియేటర్లలో రిలీజై మంచి వసూళ్లు రాబట్టి అభిమానుల్లో జోష్ నింపాలని, తన ఇమేజ్ ఇంకా పెరగాలనే కోరుకుంటారు. అందుకు నాని కూడా మినహాయింపు కాదు. ఐతే థియేటర్ల పరిస్థితి ఏమంత ఆశాజనకంగా లేకపోవడంతో ‘టక్ జగదీష్’ విషయంలో నిర్మాతలు ఓటీటీ బాట పడితే తనేం చేయలేకపోయాడు. ఐతే ఎగ్జిబిటర్లు మాత్రం నిర్మాతలను కాకుండా నానిని టార్గెట్ చేసి అతడి తర్వాతి చిత్రాల సంగతి చూస్తామంటూ హెచ్చరికలు చేయడం ఎంతమాత్రం సమంజసం కాదు. అసలు కరోనా టైంలో ఎగ్జిబిటర్లే కాదు.. నిర్మాతలూ నష్టపోయారు. ఒక సినిమాను నిర్మించిన ప్రొడ్యూసర్‌కు దాని మీద పూర్తి హక్కుంటుంది. తనకు ఎలా ఎక్కువ ప్రయోజనం ఉంటుందనిపిస్తే ఆ మార్గంలో తన చిత్రాన్ని రిలీజ్ చేసుకునే హక్కు ఆయనకు ఉంటుంది.
ఐతే అదే సమయంలో కరోనా కారణంగా కుదేలైన థియేటర్ ఇండస్ట్రీని ఆదుకోవాల్సిన అవసరమూ ఉన్న మాట వాస్తవమే. కానీ స్వయంగా చెప్పుకోదగ్గ థియేటర్లను చేతిలో ఉంచుకున్న సురేష్ బాబే ఇప్పుడు సినిమాలకు థియేటర్లలో ఆశించిన వసూళ్లు రావట్లేదని అంచనా వేసి, అలాగే ఏపీలో టికెట్ల రేట్ల సమస్యను కూడా దృష్టిలో ఉంచుకుని ‘నారప్ప’ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేశారు. సురేష్ బాబు ఇండస్ట్రీలో బిగ్ షాట్ కాబట్టి ఎగ్జిబిటర్లు ఆయన్ని ఒక్క మాటా అనలేకపోయారని.. నానీని మాత్రం టార్గెట్ చేశారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఇంకోవైపు నాని నటించిన ‘వి’ చిత్రాన్ని మరో అగ్ర నిర్మాత దిల్ రాజు గత ఏడాది ఓటీటీలో రిలీజ్ చేయడమూ గుర్తుండే ఉంటుంది. ఆయన చేతిలోనూ బోలెడన్ని థియేటర్లున్నాయి. మరి ఎగ్జిబిటర్ల వ్యవస్థలో భాగమైన ఈ ఇద్దరూ తమ చిత్రాలను ఓటీటీలో రిలీజ్ చేసినపుడు.. ‘టక్ జగదీష్’ విషయంలోనూ ఇంత వివాదం చేయడం చిత్రంగా అనిపిస్తోంది. నిజంగా రేప్పొద్దున నాని కొత్త చిత్రాలను థియేటర్లలో రిలీజ్ కానివ్వకపోతే అది పెద్ద గొడవగా మారే అవకాశముంది. కాబట్టి ఇండస్ట్రీ పెద్దలు రంగంలోకి దిగి ఈ వివాదానికి సాధ్యమైనంత త్వరగా ముగింపు పలకాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
This post was last modified on August 21, 2021 3:52 pm
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…