ప్రి రిలీజ్ ఈవెంట్లు, ఆడియో వేడుకల్లో తమ సినిమాల గురించి టీంలోని ముఖ్యులు ఆహా ఓహో అని చెప్పుకోవడం మామూలే. ఈ క్రమంలో కొన్ని సంచలన స్టేట్మెంట్లు కూడా ఇస్తుంటారు. శనివారం విడుదలైన పాగల్ మూవీ గురించి విశ్వక్సేన్ ఎంతెంత స్టేట్మెంట్లు ఇచ్చాడో తెలిసిందే. మూసుకున్న థియేటర్లు కూడా తెరిపించేస్తా ఈ సినిమాతో అని అతనన్నాడు. తీరా చూస్తే ఆ సినిమాలో అంతగా విషయం లేకపోవడంతో నెటిజన్లు విశ్వక్‌ను ఓ రేంజిలో ట్రోల్ చేస్తున్నారు.
ఇదంతా చూస్తూ కూడా ఈ గురువారం విడుదల కాబోతున్న తన కొత్త చిత్రం రాజ రాజ చోర గురించి ఓ రేంజిలో ఎలివేషన్ ఇచ్చాడు హీరో శ్రీ విష్ణు. ఈ సినిమా ఇండియాలో ఉన్న అన్ని ప్రధాన భాషల్లోనూ రీమేక్ అవుతుందని.. ఇది రాసి పెట్టుకోవాలని శ్రీ విష్ణు అన్నాడు. ఇది తెలుగు సినిమా అని మన వాళ్లు గొప్పగా చెప్పుకునేలా ఈ చిత్రం ఉంటుందని కూడా అతనన్నాడు.
రాజ రాజ చోర సినిమా కథ మరీ కొత్తదేమీ కాదని.. కానీ స్టోరీ టెల్లింగ్ చాలా కొత్తగా ఉంటుందని.. అది అన్ని భాషల ఫిలిం మేకర్లనూ ఆకర్షిస్తుందని శ్రీవిష్ణు చెప్పాడు. ఈ సినిమాకు వెళ్లే వాళ్లు ఆరు మాస్కులు తీసుకెళ్లాలని విష్ణు అన్నాడు. ప్రథమార్ధంలో నవ్వి నవ్వి ఒక్కో మాస్కు ఊడిపోతుందని.. సినిమా సగం అయ్యేసరికే మూడు మాస్కులు కావాలని.. ఇక రెండో సగంలో ఎమోషన్ వల్ల ఏడ్చి ఏడ్చి మాస్కులు తడిచిపోతాయని.. కాబట్టి మరో మూడు మాస్కులు అవసరమని విష్ణు అన్నాడు.
తాను సినిమా గురించి మరీ ఎక్కువేమీ చెప్పట్లేదని.. కావాలంటే తన గత సినిమాలకు సంబంధించిన ఈవెంట్లలో తన స్పీచ్‌లు చూసుకోవచ్చని.. సినిమా గురించి ఏమనిపిస్తే అదే చెబుతానని.. అవి తర్వాత నిజమే అయ్యాయని శ్రీవిష్ణు అన్నాడు. తాను వెంకటేష్‌కు వీరాభిమానినని.. ఆయన చిత్రం నారప్ప ఓటీటీలో వచ్చందని చాలా బాధపడ్డానని.. ఇప్పుడు తమ లాంటి చిన్న హీరోల సినిమాలు థియేటర్లలో బాగా ఆడి పెద్ద స్టార్ల సినిమాలన్నీ థియేటర్లలోనే వచ్చేలా ప్రేక్షకులు ఆశీర్వదించాలని విష్ణు కోరాడు.
This post was last modified on August 16, 2021 7:11 am
భారత పారిశ్రామిక రంగంలో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న టాటా గ్రూప్‌లో ఇప్పుడు పాలనా వ్యవహారాలు చర్చనీయాంశంగా మారాయి. సంస్థను ఎవరు…
విశ్వంభర థియేటర్ హక్కులు మైత్రి సంస్థ కొన్నదని నిన్నంతా ప్రచారం జరిగింది. రెండు రోజుల క్రితం ఆర్టిస్టు ప్రవీణ్ తాను…
ఇటీవలే విడుదలైన ఇట్లు అర్జున కి పర్లేదనే టాక్ వచ్చింది. టాలీవుడ్ టాప్ సెలబ్రిటీలు భారీ ఎత్తున మద్దతిచ్చారు. జూనియర్…
మిగతా అగ్ర కథానాయకులతో పోలిస్తే ప్రభాస్ కొంచెం వేగంగానే సినిమాలు చేస్తుంటాడు కానీ.. బయట అభిమానులకు కనిపించడం తక్కువ. సినిమా…
నగరాల్లో ప్రయాణ సమయాన్ని తగ్గించి, ట్రాఫిక్ కష్టాల నుంచి ప్రజలకు ఉపశమనం కల్పించేందుకు ప్రభుత్వాలు వేల కోట్ల రూపాయలు వెచ్చించి…
ఇండియాలో హాలీవుడ్ సూపర్ హీరోల సినిమాలకు ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రాంతీయ భాషల్లో డబ్బింగ్ చేయడం మొదలుపెట్టాక…