గత దశాబ్ద కాలంలో తెలుగు సినిమా నుంచి వచ్చిన ఉత్తమ నటుల్లో సత్యదేవ్ ఒకడు. చిన్న చిన్న సహాయ పాత్రలతో మొదలుపెట్టి.. ఆ తర్వాత లీడ్ రోల్స్ దక్కించుకుని.. అందులోనూ చిన్న స్థాయిలోనే సినిమాలు చేసి కష్టపడి ఒక స్థాయిని అందుకున్నాడు సత్యదేవ్. ఇటీవలే విడుదలైన ‘తిమ్మరసు’ సినిమాతో సత్యదేవ్ ప్రతిభ ఏంటో మరోసారి ప్రేక్షకులకు తెలిసింది. అందులో నటనతో ఆకట్టుకోవడమే కాదు.. అదిరిపోయే లుక్స్‌తోనూ మెప్పించాడు.
అతడి లుక్స్, యాక్టింగ్ టాలెంట్‌కు తగ్గట్లు సరైన సినిమా పడితే రేంజే వేరుంటుందనే అభిప్రాయాలు ప్రేక్షకుల్లో వ్యక్తమయ్యాయి. గతంతో పోలిస్తే సత్య ఇప్పుడు కొంచెం రేంజ్ ఉన్న సినిమాలే చేస్తున్నాడు. అగ్ర కథానాయిక తమన్నాతో కలిసి ‘గుర్తుందా శీతాకాలం’.. అలాగే కొరటాల శివ సమర్పణలో ఓ థ్రిల్లర్ మూవీ.. ఇంకా నిత్యామీనన్‌తో కలిసి ‘స్కై లాబ్’ అనే ప్రయోగాత్మక చిత్రం.. ఇంకా ‘గాడ్సే’ అనే మరో మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు సత్య.
ఐతే త్వరలో సత్య టాలెంట్ ఏంటో దేశం మొత్తానికి తెలియబోతోంది. బాలీవుడ్లో ఒకటికి రెండు క్రేజీ ప్రాజెక్టులను దక్కించుకున్నాడు సత్య. అందులో ఒకటి ‘రామ్ సేతు’. అక్షయ్ కుమార్ లీడ్ రోల్ చేస్తున్న ఈ సినిమాలో సత్యకు కీలకమైన పాత్రే దక్కింది. ఇది కాకుండా సత్యదేవ్ లీడ్ రోల్‌లో ‘హబీబ్’ అనే మరో సినిమా తెరకెక్కుతుండటం విశేషం. దీని గురించి ఇన్నాళ్లు బయట పెద్దగా సమాచారం లేదు. ఐతే స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా ‘హబీబ్’ నుంచి ఒక పాట రిలీజ్ చేసింది చిత్ర బృందం.
ఇది అఫ్గానిస్థాన్ నేపథ్యంలో నడిచే పాట. అఫ్గాన్ భాషలోనే ఈ పాటకు లిరిక్స్ రాశారు. తనకు అత్యంత సన్నిహితమైన వ్యక్తిని వెతుక్కుంటూ ఒక వ్యక్తి చేసే ప్రయాణం నేపథ్యంలో ఈ పాట సాగింది. పూర్తిగా అఫ్గానిస్థాన్‌లోనే తీసిన ఈ పాట చూస్తుంటే.. అంతర్జాతీయ సినిమాలు గుర్తుకొస్తున్నాయి. ఇందులో మానసిక వేదన అనుభవిస్తున్న వ్యక్తిగా సత్యదేవ్ హావభావాలు అద్భుతంగా పలికించాడు. పాటకు ప్రాణం పోశాడు. ఈ పాట చూస్తుంటే ‘హబీబ్’తో సత్య టాలెంట్ ఏంటో బాలీవుడ్‌కు, ఉత్తరాది ప్రేక్షకులకు బాగానే తెలిసేలా ఉంది. మున్ముందు అతను హిందీలో బిజీ అయినా ఆశ్చర్యం లేదు.
This post was last modified on August 15, 2021 6:30 pm
బాలీవుడ్ లో అత్యంత వేగంగా 600 కోట్ల గ్రాస్ దాటిన తొలి ఇండియన్ మూవీగా రికార్డు సృష్టించిన పుష్ప 2…
వైసీపీ మాజీ మంత్రి, ఫైర్ బ్రాండ్ నేత అంబటి రాంబాబు తన దూకుడు స్వభావంతో, వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు.…
పార్లమెంట్ లో అధికార, ప్రతిపక్ష కూటములకు చెందిన ఎంపీల మధ్య ఉద్రిక్తత తారస్థాయికి చేరింది. ఈ ఘటనలో బీజేపీ ఒడిశా…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీ మొదటి షెడ్యూల్ ని…
పార్లమెంటులో బీఆర్ అంబేద్కర్ పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతోన్న సంగతి…
దేశ చరిత్రలో.. ముఖ్యంగా ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా పరిఢవిల్లుతున్న భారత దేశంలో తొలిసారి ఎవరూ ఊహించని ఘటన..…