కొందరు హీరోలు పాత్రలకు తగ్గట్లుగా తమను తాము మలుచుకునే విధానం ఆశ్చర్యం గొలుపుతుంటుంది. అందుకోసం ఎంత బరువైనా పెరగడానికి, అలాగే ఎలా చిక్కిపోవడానికైనా వాళ్లు సిద్ధమే. ముఖ్యంగా ఈ విషయంలో తమిళ హీరోల కమిట్మెంటే వేరు. ఒకప్పుడు లోకనాయకుడు కమల్ హాసన్ పాత్రల కోసం ఎంత కష్టపడేవారో.. అద్భుతమైన మేకోవర్‌లతో ఎలా ఆశ్చర్యపడేవారో తెలిసిందే. ఆ తర్వాత విక్రమ్ ఆ స్థాయిలో కష్టపడి మంచి పేరు సంపాదించాడు. సేతు, పితామగన్, ఐ లాంటి చిత్రాల కోసం అతను పడ్డ కష్టం అంతా ఇంతా కాదు.
ఐతే ఇప్పుడు మరో కథానాయకుడు మేకోవర్ విషయంలో అందరికీ పెద్ద షాకిస్తున్నాడు. అతనే.. శింబు. ఈ పేరెత్తగానే చాలామందికి వివాదాలే గుర్తుకొస్తాయి. అసలు కమిట్మెంట్ లేని హీరోగా చాలామందితో విమర్శలు ఎదుర్కొన్న నటుడితను. క్రమశిక్షణా రాహిత్యానికి మారుపేరుగా అతణ్ని చెబుతుంటారు.
ఇలాంటి హీరో ఇప్పుడు గౌతమ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘వెందు తనిందద కాదు’ అనే సినిమా కోసం పడుతున్న కష్టం చూసి అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. ఈ సినిమా అనౌన్స్‌మెంట్ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్లో శింబును చూసి అందరూ షాకయ్యారు. కాటి కాపరి అవతారంలో అతను గుర్తు పట్టలేని విధంగా కనిపించాడు. ఐతే కొందరేమో గ్రాఫిక్ వర్క్ ద్వారా శింబును అలా చూపించారని కౌంటర్లు వేశారు. కానీ తాజాగా శింబు ఈ పాత్ర కోసం పడ్డ కష్టానికి నిదర్శనంగా ఒక ఫొటోను రిలీజ్ చేశాడు.
ఏకంగా 15 కిలోల బరువు తగ్గి బక్క చిక్కి గుర్తు పట్టలేని విధంగా కనిపిస్తున్నాడు శింబు అందులో. కొన్నేళ్ల ముందు ఓ సినిమా కోసం బరువు పెరిగిన శింబు ఫొటోను, దీన్ని పక్కన పెట్టి చూస్తే ఇద్దరూ ఒకరే అంటే నమ్మశక్యంగా అనిపించడం లేదు. కేవలం బరువు తగ్గడం కాదు.. ఒంట్లో ఎక్కడా ఫ్లెష్ అన్నదే లేకుండా ఎముకలు తేలినట్లు కనిపిస్తున్నాడు శింబు. అతడి ఈ మేకోవర్‌కు సంబంధించిన ఫొటోలు ఇంటర్నెట్లో సెన్సేషనే క్రియేట్ చేస్తున్నాయి.
This post was last modified on August 14, 2021 9:55 am
బాలీవుడ్ లో అత్యంత వేగంగా 600 కోట్ల గ్రాస్ దాటిన తొలి ఇండియన్ మూవీగా రికార్డు సృష్టించిన పుష్ప 2…
వైసీపీ మాజీ మంత్రి, ఫైర్ బ్రాండ్ నేత అంబటి రాంబాబు తన దూకుడు స్వభావంతో, వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు.…
పార్లమెంట్ లో అధికార, ప్రతిపక్ష కూటములకు చెందిన ఎంపీల మధ్య ఉద్రిక్తత తారస్థాయికి చేరింది. ఈ ఘటనలో బీజేపీ ఒడిశా…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీ మొదటి షెడ్యూల్ ని…
పార్లమెంటులో బీఆర్ అంబేద్కర్ పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతోన్న సంగతి…
దేశ చరిత్రలో.. ముఖ్యంగా ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా పరిఢవిల్లుతున్న భారత దేశంలో తొలిసారి ఎవరూ ఊహించని ఘటన..…