తమ సినిమాల ప్రి రిలీజ్, ఆడియో వేడుకల్లో దాని మేకర్స్.. టీంలో ముఖ్యులు ఆహా ఓహో అని పొగిడేసుకోవడం మామూలే. కొన్నిసార్లు ఈ స్వోత్కర్షలు మరీ శ్రుతి మించి పోతుంటాయి. ఆ సమయానికి ఎలివేషన్ల లాగా అనిపించినా.. సినిమా రిలీజై తేడా కొట్టాక ఆ మాటలు ట్రోల్ మెటీరియల్స్ అయిపోతుంటాయి.
ఈ మధ్య ఏప్రిల్ ఫస్ట్ రోజు ఫూల్స్ డే సందర్భంగా తెలుగులో డిజాస్టర్లయిన సినిమాలకు సంబంధించిన వేడుకల్లో వాటి దర్శకులు చెప్పిన గొప్పల్ని తీసుకుని ‘ఫూల్స్ డే’ని సెలబ్రేట్ చేశారు నెటిజన్లు. ‘శక్తి’ గురించి మెహర్ రమేష్.. ‘అజ్ఞాతవాసి’ గురించి త్రివిక్రమ్.. ‘వినయ విధేయ రామ’ గురించి బోయపాటి చెప్పిన మాటలే ఇప్పుడు ట్రోల్ కంటెంట్‌గా మారిపోవడం గమనార్హం.
కాబట్టి తమ చిత్రాలపై ఎంత ధీమా ఉన్నప్పటికీ కొన్ని స్టేట్మెంట్లు ఇచ్చే ముందు కాస్త ముందు, వెనుక చూసుకోవాలి. కానీ ఈ శనివారం రిలీజ్ కానున్న కొత్త చిత్రం ‘పాగల్’ గురించి దాని హీరో విశ్వక్సేన్ చేసిన కామెంట్లు జనాలు ముక్కున వేలేసుకునేలా చేశాయి. “సర్కస్‌లో సింహంతో అందరూ ఆడుకుంటారు. కానీ నేను అడవిలోకెళ్లి సింహంతో ఆడుకునే టైపు.. మూసుకున్న థియేటర్లను కూడా తెరిపిస్తా ఈ సినిమాతో. నా పేరు విశ్వక్సేన్. అలా కాకుంటే పేరు మార్చుకుంటా” అంటూ ఘనమైన ప్రకటనలు చేశాడు విశ్వక్సేన్.
సంబంధిత వీడియోను పట్టుకుని నెటిజన్లు విశ్వక్సేన్‌ను ఇప్పటికే ఆడేసుకుంటున్నారు. మరీ ఇంత అతినా.. ఈ స్టేట్మెంట్లేటి అంటూ కామెంట్లు చేస్తున్నారు. సినిమా తేడా కొడితే ఉంటుంది నీకు అంటూ విశ్వక్‌కు వార్నింగ్‌లు ఇచ్చేస్తున్నారు. అలాగే ఈ సినిమా ప్రమోషన్లలో తన గురించి తాను ఇచ్చుకున్న ఎలివేషన్లకు సంబంధించిన వీడియోలు కూడా నెట్లో వైరల్ అవుతున్నాయి. చూస్తుంటే విశ్వక్ ఓవర్ ద బోర్డ్ వెళ్లిపోయినట్లే ఉంది. సినిమా బాగుంటే ఓకే కానీ.. ఏమాత్రం అటు ఇటు అయినా నెటిజన్లకు అతను మామూలుగా టార్గెట్ అవ్వడు.
This post was last modified on August 13, 2021 4:15 pm
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…
ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…
గల్లా జయదేవ్.. టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు సొంతూరు చంద్రగిరికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్తగానే కాకుండా… గుంటూరు…
దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సమావేశం ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాల్లోని పాలకులు, వ్యాపారవర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్న సంగతి…
తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపై జరుగుతున్న విచారణలో రాష్ట్ర జలవనరుల అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ వి.ప్రకాశ్ కీలక సమాచారాన్ని…