‘పుష్ప’ సినిమాపై ఉన్న అంచనాల గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. నాన్-బాహుబలి హిట్ ‘రంగస్థలం’ తర్వాత సుకుమార్ నుంచి వస్తున్న చిత్రమిది. అలాగే ‘రంగస్థలం’ను అధిగమిస్తూ ‘అల వైకుంఠపురములో’తో నాన్-బాహుబలి హిట్ కొట్టిన తర్వాత అల్లు అర్జున్ చేస్తున్న చిత్రం కూడా ఇదే. ఈ చిత్రంలో సుక్కు, బన్నీ తమ కెరీర్లలో పీక్స్‌ను అందుకుంటారనే అంచనాలున్నాయి.
ఈ చిత్రంపై వాళ్లకు కాన్ఫిడెన్స్ అలా ఇలా లేదన్నది చిత్ర వర్గాల సమాచారం. అందుకేనేమో ఈ చిత్రానికి బన్నీ ‘స్టైలిష్ స్టార్’ అన్న ట్యాగ్ తీసేసి ‘ఐకాన్ స్టార్’ అని తన పేరు ముందు వేసుకున్నాడు. ఆ మధ్య ఈ సినిమాకు సంబంధించి జరిగిన ఓ వేడుకలో సుకుమారే బన్నీకి ఈ ట్యాగ్ ఇచ్చాడు. అప్పట్నుంచి బన్నీ పీఆర్వోలు, అభిమానులు ‘స్టైలిష్ స్టార్’ పక్కన పెట్టేసి ‘ఐకాన్ స్టార్’ అనే అంటున్నారు అల్లు హీరోని. ఐతే హీరోలు ఇలా తమకు తాము ట్యాగ్‌లైన్స్ ఇచ్చుకోవడం, మార్చుకోవడం మామూలే.
ఐతే ‘పుష్ప’ సినిమాతో సుకుమార్, దేవిశ్రీ ప్రసాద్ సైతం తమకు కొత్తగా ట్యాగ్స్ ఇచ్చుకోవడం విశేషం. ఇందులో వాళ్ల ప్రమేయం ఎంత ఉందో ఏమో కానీ.. తాజాగా రిలీజ్ చేసిన ‘పుష్ప’ ఫస్ట్ సింగిల్ లిరికల్ వీడియోలో సుకుమార్ పేరు ముందు.. ‘మాస్టర్ ఆఫ్ సిల్వర్ స్క్రీన్’ అన్న ట్యాగ్ పడింది. అలాగే దేవిశ్రీ ప్రసాద్ పేరు ముందు కూడా కొత్త ట్యాగ్ వచ్చింది. మామూలుగా దేవిని రాక్ స్టార్ అని సంబోధిస్తుంటారు అభిమానులు. ఐతే ‘పుష్ప’ తొలి పాటలో మాత్రం ‘సామ్రాట్ ఆఫ్ మ్యూజిక్’ అంటూ కొత్త ట్యాగ్ వేశారు. ఇక నుంచి ఇలాగే పిలుస్తారేమో దేవిని.
ఇలా ఒక సినిమాతో హీరో, దర్శకుడు, సంగీత దర్శకుడు ముగ్గురూ కొత్త ట్యాగ్‌లు వేసుకోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే. సినిమా మీద ఉన్న కాన్ఫిడెన్సే వారిని ఈ దిశగా నడిపించి ఉండొచ్చేమో. ఈ చిత్రంతో బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు నమోదు చేయబోతున్నామనే ‘పుష్ప’ టీం ధీమా ఏ మేర నిజమవుతుందో చూడాలి.
This post was last modified on August 13, 2021 2:22 pm
ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర…
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు అయిన నేపథ్యంలో, అన్ని వర్గాల ప్రజల సంతృప్తిపై మరోసారి ప్రభుత్వం ఐవీఆర్ఎస్…
ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణ రాజు గారు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ ఆరోగ్య సూత్రాలు…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు వరుసగా లభిస్తున్న గౌరవాలు ఆయన వ్యక్తిత్వానికి మరో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. భారతీయ సంస్కృతి,…
మెగాస్టార్ చిరంజీవి.. పోస్టర్ మీద ఈ పేరు చూస్తే చాలు.. కళ్లు మూసుకుని థియేటర్లకు వెళ్లిపోయేవాళ్లు ఒకప్పుడు. ఆయన ఫ్లాప్…
తెలంగాణలో ఓ మహిళా ఐఏఎస్ అధికారిపై నల్గొండ జిల్లాకు చెందిన ఓ సీనియర్ మంత్రి మనసు పారేసుకున్నారని, లేటు వయసులో…