పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు కౌంట్‌డౌన్ మొదలు పెట్టేశారు. వారికి పండుగ రోజైన సెప్టెంబరు 2కు ఇంకో 20 రోజులు కూడా సమయం లేదు. పవన్ జన్మదినమైన ఆ రోజు అభిమానులు సందడి ఎలా ఉంటుందో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఈసారి రాబోయే పుట్టిన రోజు వారికి చాలా స్పెషల్ అవుతుందనే ఆశలున్నాయి. ఎందుకంటే పవన్ నటిస్తున్న రెండు చిత్రాలు ప్రస్తుతం సెట్స్ మీద ఉన్నాయి. అలాగే ఇంకో రెండు చిత్రాలు ఆయన కమిటైనవి ఉన్నాయి. వీటన్నింటి నుంచి అప్డేట్స్ ఆశిస్తున్నారు ఫ్యాన్స్. ఆయా చిత్రాల మేకర్స్ కచ్చితంగా అభిమానులను మురిపించే అప్‌డేట్స్ ఇస్తారనే అంచనాలున్నాయి.
ఐతే ‘అయ్యప్పనుం కోషీయుం’ నుంచి ఒక పాటను పవన్ పుట్టిన రోజున రిలీజ్ చేయబోతున్నారనే అప్‌డేట్ ఇప్పటికే బయటికి వచ్చింది. ‘హరిహర వీరమల్లు’ నుంచి కూడా ఒక వీడియో అప్‌డేట్ అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఐతే వీటిని మించి పవన్ అభిమానులను ఎక్కువగా ఊరిస్తున్నది హరీష్ శంకర్ సినిమా అప్‌డేటే. ఈ సినిమా గురించి గత ఏడాది పవన్ పుట్టిన రోజుకే ప్రకటన వచ్చింది. ఒక ఇంట్రెస్టింగ్ ప్రి లుక్‌తో ఆసక్తి రేకెత్తించాడు హరీష్. ఏడాది తర్వాత కూడా సినిమా గురించి మరో విశేషాన్ని పంచుకోకుంటే అభిమానులు ఊరుకోరు. చిత్ర వర్గాల సమాచారం ఈ సినిమా టైటిల్‌ను ఆ రోజు ప్రకటించడంతో పాటు షూటింగ్ అప్‌డేట్ ఇవ్వబోతున్నారని సమాచారం.
ఇటీవలే ‘అయ్యప్పనుం కోషీయుం’ రీమేక్ షూటింగ్ సందర్భంగా పవన్‌ను హరీష్ కలిసి దీని గురించే మాట్లాడినట్లు తెలిసింది. సినిమా కాన్సెప్ట్‌ను ప్రతిబింబించేలా టైటిల్ లుక్ డిజైన్ ఉంటుందని కూడా అంటున్నారు. ఇదే నిజమైతే ఆ రోజుకు పవన్ అభిమానులకు ఇదే మోస్ట్ ఎగ్జైటింగ్ అప్‌డేట్ కావచ్చు. మరి సురేందర్ రెడ్డి దర్శకత్వంలో పవన్ చేయనున్న సినిమా గురించి కూడా ఏదైనా విశేషాన్ని పంచుకుంటారేమో చూడాలి. మరోవైపు పవన్‌తో ఓ సినిమాకు కమిట్మెంట్ తీసుకున్న సీనియర్ నిర్మాతలు భగవాన్-పుల్లారావు కూడా తాము పవన్‌తో చేయనున్న సినిమా గురించి ఏమైనా అప్డేట్ ఇచ్చినా ఆశ్చర్యం లేదు.
This post was last modified on August 13, 2021 11:39 am
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్‌కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…