సెలబ్రెటీలు చాలా మంది ఇన్ స్టాగ్రామ్ పోస్టులతో ఆదాయం పెంచుకుంటున్నారంటూ గతంలో చాలాసార్లు వార్తలు వచ్చాయి. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రాలు.. ఇన్ స్టా ఆదాయంలో ముందున్నారని కూడా విన్నాం. అయితే.. వీరికి తాను కూడా ఏమీ తీసిపోనని నిరూపిస్తోంది అక్కినేని కోడలు.
ఏమాయ చేశావే సినిమాతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చిన సమంత దాదాపు పదేళ్ల పాటు దక్షిణాదిన అగ్ర కథనాయికగా వెలుగొందారు. పెళ్లి తర్వాత కూడా అదే క్రేజ్‌ను కొనసాగిస్తున్నారు సామ్. ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే, మరోవైపు వ్యాపారవేత్తగానూ సక్సెస్‌ఫుల్‌గా దూసుకెళ్తున్నారామె. ఇక సోషల్ మీడియాలోనూ సమంత యాక్టివ్‌గా వుంటారు. సినిమాలతో పాటు తన వ్యక్తిగత విషయాలపైనే ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ వుంటారు. ఫాలోయింగ్ విషయంలోనూ సౌత్‌లో మిగతా హీరోయిన్ల కంటే సమంతదే పైచేయి . ప్రస్తుతం సమంతకు ఒక్క ఇన్‌స్టాగ్రామ్‌లోనే 18 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారంటే ఆమెకున్న క్రేజ్‌ను అర్థం చేసుకోవచ్చు.
దీంతో పలు కంపెనీలు సైతం తమ బ్రాండ్లకు ప్రచారం చేయాల్సిందిగా క్యూ కడుతున్నాయి. ఇందుకు తగ్గట్లుగానే భారీ రెమ్యునరేషన్ అందుకుంటున్నారు సమంత. ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక్కో పోస్ట్‌కి గాను సమంత దాదాపు 25 లక్షల నుంచి 30 లక్షల వరకు వసూలు చేస్తుందట. కాగా ప్రస్తుతం సమంత శాకుంతలం సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. గుణశేఖర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ‘దిల్’ రాజు, నీలిమా గుణ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
This post was last modified on August 13, 2021 12:44 pm
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…