కరోనా సెకండ్ వేవ్ బ్రేక్ తర్వాత థియేటర్లు పునఃప్రారంభం అవుతున్నాయన్న సంకేతాలు రాగానే కొన్ని చిత్రాలు విడుదలకు రెడీ అయిపోయాయి. వాటి గురించి ముందే ప్రకటనలు ఇచ్చి ప్రమోషన్లు జోరుగా చేశారు. కానీ ఈ శనివారం విడుదల కానున్న పాగల్ మూవీ మాత్రం సడెన్ సర్ప్రైజ్ లాగా దిగుతోంది. రిలీజ్ డేట్‌కు వారం కూడా లేని టైంలో ప్రకటన వచ్చింది. హడావుడిగా ప్రమోషన్లు చేశారు. బుధవారం ప్రి రిలీజ్ ఈవెంట్ సైతం లాగించేశారు. ఇంకో రెండు మూడు రోజులు ప్రమోషన్లు కొనసాగించి సినిమాను థియేటర్లలోకి వదులుతున్నారు.
దిల్ రాజు లాంటి అగ్ర నిర్మాత సమర్పకుడిగా ఉన్న సినిమా విషయంలో ఇంత హడావుడి ఏంటి అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. నిజానికి రాజు.. ఈ సినిమాను ఇలా రిలీజ్ చేయడానికి ఇష్టపడలేదట. కానీ ఈ చిత్ర కథానాయకుడు విశ్వక్సేన్ పట్టుబట్టి ఈ వారం సినిమా రిలీజయ్యేలా చేశాడట. ఈ విషయాన్ని ప్రి రిలీజ్ ఈవెంట్లో దిల్ రాజే స్వయంగా వెల్లడించాడు.
పాగల్ సినిమా గురించి తన దగ్గర విశ్వక్సేన్ ఎప్పుడు మాట్లాడినా.. ఈ చిత్రం థియేటర్లలోనే కదా రిలీజయ్యేది అనే అడుగుతూ వచ్చాడని.. పరిస్థితిని బట్టి చూద్దామని తాను అన్నానని.. ఐతే ఈ మధ్యే థియేటర్లు తెరుచుకున్నాక కొత్త సినిమాలు బాగానే ఆడుతున్నాయని, గతవారం విడుదలైన ఓ సినిమాకు (ఎస్ఆర్ కళ్యాణమండపం) హౌస్ ఫుల్స్ పడుతున్నాయని చెబుతూ మన సినిమాను తన దగ్గర విశ్వక్ చెబుతూ మన సినిమాను కూడా రిలీజ్ చేసేద్దామని అన్నాడని.. కానీ తాను కుదరదని చెప్పానని రాజు తెలిపాడు.
అన్నీ చూసుకుని రిలీజ్ చేద్దామని అంటే.. విశ్వక్ ఆగలేదని.. పట్టుబట్టి ఈ వారమే సినిమా రిలీజయ్యేలా చూశాడని.. అందుకోసం వారం రోజులు ఎంత కష్టపడాలో అంతా పడ్డాడని.. మొత్తం తనే చూసుకున్నాడని.. మిక్సింగ్ సహా ఇత్తర పనులు, ప్రమోషన్లు అన్నీ తనే చూసుకున్నాడని.. సినిమా పట్ల అతడి కమిట్మెంట్ తనకు చాలా నచ్చిందని దిల్ రాజు చెప్పాడు. పాగల్ మూవీ ప్రేక్షకులను విపరీతంగా నవ్విస్తుందని.. అలాగే కొంచెం హార్ట్ టచింగ్ సీన్లు కూడా ఇందులో ఉంటాయని దిల్ రాజు తెలిపాడు.
This post was last modified on August 12, 2021 10:27 am
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు మారిపోయారంటూ ఆ పార్టీకి చెందిన నేతలు, కరడుగట్టిన అభిమానులే బలంగా చెబుతున్నారు.…
మనకు డాల్బీ సౌండ్ పరిచయమే కానీ డాల్బీ సినిమా ఎలా ఉంటుందో ఇంకా అనుభవం కాలేదు. ఇప్పటిదాకా విదేశాల థియేటర్లలో…
హనుమాన్ తర్వాత గ్యాప్ వస్తున్నా సరే తదేక దృష్టితో తేజ సజ్జ చేస్తున్న సినిమా మిరాయ్. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ…
క్రిస్టియన్ మత ప్రభోదకుడు పగడాల ప్రవీణ్ మృతి వ్యవహారం గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిన సంగతి…
నిన్న కన్నప్ప ప్రీమియర్ జరిగిందంటూ కొన్ని ఫోటో ఆధారాలతో వార్త బయటికి రావడంతో అభిమానులు నిజమే అనుకున్నారు. కానీ వాస్తవానికి…
వైసీపీ అధికారంలో ఉండగా…2019 నుంచి 2024 వరకు ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ అదికారంలో ఉంది. ఇప్పుడూ…