పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త సినిమాకు వకీల్ సాబ్ అంటూ ఆకర్షణీయమైన టైటిల్ పెట్టింది చిత్ర బృందం. ముందు ఈ సినిమాకు ఈ పేరు ప్రచారంలోకి వచ్చినపుడు.. మహిళల సమస్యల చుట్టూ తిరిగే సినిమాకు ఇలాంటి హీరోయిక్ టైటిల్ పెడతారా అని సందేహాలు నెలకొన్నాయి. కానీ తెలుగు నేటివిటీకి తగ్గట్లు, పవన్ అభిమానుల్ని మెప్పించేందుకు కథలో మార్పులు చేర్పులు చేసిన చిత్ర బృందం.. హీరో పాత్ర మీదే టైటిల్ కూడా పెట్టింది. ఈ పేరు సూపర్ అని అంటున్నారు సీనియర్ రచయిత పరుచూరి గోపాల కృష్ణ. పరుచూరి పలుకులు పేరిట యూట్యూబ్ ఛానెల్ పెట్టి సినిమాల విశ్లేషణ అందిస్తున్న ఆయన.. తాజాగా వకీల్ సాబ్ మీద టాపిక్ తీసుకున్నారు.
పవన్ కళ్యాణ్ హీరో పేరు మీద టైటిళ్లు ఉండాలని పట్టుబట్టే హీరో కాదని.. ఇందుకు అతడి కెరీర్లో ఎన్నో ఉదాహరణలున్నాయని.. ఇది మంచి లక్షణం అని పరుచూరి అన్నారు. గతంలో హీరోలు లాయర్ పాత్రలు పోషిస్తే.. వారి లాయర్ పదానికి వారి పేరు కూడా జోడించి టైటిళ్లు పెట్టేవాళ్లని.. లాయర్ విశ్వనాథం లాంటి సినిమాలు అందుకు ఉదాహరణ అని.. కానీ పవన్ మాత్రం తన పేరు రానివ్వకుండా లాయర్ సాబ్ అని పేరుకు ఒప్పుకోవడం మంచి విషయమని, సాబ్ అని చేర్చడం ద్వారా టైటిల్‌కు ఆకర్షణ తెచ్చారని.. ఇలాంటి టైటిల్ పెట్టాలని సూచించిన వాళ్లను అభినందించాలని పరుచూరి అన్నారు. ఇక పింక్ మహిళల సమస్యల మీద నడిచే కథ అయినా.. దానికి కమర్షియల్ హంగులు జోడిస్తే బాగానే ఉంటుందని.. పవన్ సరసన హీరోయిన్ని పెట్టి మంచి ప్లేస్మెంట్ పాటలు పెట్టినా ఇబ్బంది లేదని.. ఆ పాత్రకు శ్రుతి హాసన్‌ను తీసుకోవాలనుకోవడం కూడా మంచి నిర్ణయమని అన్నారు పరుచూరి.
This post was last modified on May 27, 2020 2:14 am
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్‌కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…