ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే గ్రేటెస్ట్ డైరెక్టర్లలో ఒకడిగా సంజయ్ లీలా బన్సాలీ పేరు చెప్పుకోవాలి. దర్శకుడిగా తొలి చిత్రం ‘హమ్ దిల్ కే చుకే సనమ్’తో మొదలుపెడితే.. దేవదాస్, రామ్ లీలా, బాజీరావు మస్తానీ, పద్మావత్.. ఇలా ఆయన తీసిన మెజారిటీ సినిమాలు క్లాసిక్సే. బాక్సాఫీస్ ఫలితంతో సంబంధం లేకుండా ఆయన సినిమాలకు క్లాసిక్ స్టేటస్ వస్తుంటుంది. పాతికేళ్ల కెరీర్లో ఆయన చేసిన సినిమాలు మాత్రం చాలా తక్కువ. ఒక్కో సినిమాకు మూణ్నాలుగేళ్లు సమయం తీసుకుని వాటిని అద్భుతంగా తీర్చిదిద్దుతాడు.
‘పద్మావత్’ తర్వాత ఆయన సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో ఓ సినిమా తీయాలనుకున్నారు. కానీ అదెందుకో ముందుకు కదల్లేదు. తర్వాత ఆలియా భట్ ప్రధాన పాత్రలో ‘గంగూబాయి కతియావాడీ’ అనే గ్యాంగ్‌స్టర్ మూవీ తీశారు. అది విడుదలకు సిద్ధమైంది. బన్సాలీ కొత్త చిత్రం ఏదా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
‘హీరా మండి’ పేరుతో బన్సాలీ ఓ భారీ చిత్రాన్ని తీయడానికి సన్నాహాలు చేసుకున్నారు. ఇందులో బాలీవుడ్ ప్రముఖ తారలు నటిస్తారని వార్తలొచ్చాయి. కానీ ఈ చిత్రం ఇప్పుడు కొత్త మలుపు తిరిగింది. దీన్ని సినిమాగా కాకుండా వెబ్ సిరీస్‌గా తీయాలని నిర్ణయించారు. నెట్ ఫ్లిక్స్ భాగస్వామ్యంతో వందల కోట్ల బడ్జెట్లో భారీగా ఈ సిరీస్ తీయడానికి అంగీకారం కుదిరింది.
భారత్‌కు స్వాతంత్ర్యం రావడానికి ముందు ప్రస్తుతం పాకిస్థాన్‌లో ఉన్న లాహోర్‌లో ‘హీరామండి’ అనే ప్రాంతం చాలా ఫేమస్. దాని నేపథ్యంలో ఇప్పుడు బన్సాలీ సినిమా తీయబోతున్నారు. అంటే మనల్ని ఏడెనిమిది దశాబ్దాలు వెనక్కి తీసుకెళ్లబోతున్నాడన్నమాట. తన సినిమాలతో ఉండే రిస్క్‌ను మామూలుగా బన్సాలీ తనే భరిస్తుంటాడు. భారీ బడ్జెట్లో సొంత నిర్మాణ సంస్థలో సినిమాలు తీస్తుంటాడు. అయినా రాజీ అనేదే ఉండదు. ఐతే ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ లాంటి స్ట్రీమింగ్ జెయింట్ తోడవుతుండటంతో ఇంకా భారీగా, రాజీ లేకుండా ఈ సిరీస్ తీయడానికి అవకాశం లభించింది. ఇదొక ఎపిక్ సిరీస్ అవుతుందన్న అంచనాలు కలుగుతున్నాయి.
This post was last modified on August 11, 2021 10:31 am
టాలీవుడ్ సీనియర్ హీరోల్లో అనేక రికార్డు మెగాస్టార్ చిరంజీవి పేరు మీదే ఉన్నాయి. ఒకప్పుడు ఆయన చూసిన వైభవమే వేరు.…
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్టానానికి చెడిందా? ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు మైలేజీ పొందలేక, పదేళ్ల పాటు అధికారానికి…
సీనియర్ నటుడు నరేష్ వ్యక్తిగత జీవితం గురించి కొన్నేళ్ల ముందు ఎంత గొడవ జరిగిందో తెలిసిందే. తెలుగు సినిమాల్లో బిజీ…
గౌతమ్ మీనన్.. గత పాతికేళ్లలో సౌత్ ఇండియా నుంచి వచ్చిన గ్రేట్ డైరెక్టర్లలో ఒకడు. కాక్క కాక్క, ఏమాయ చేసావె,…
ప్రభుత్వం తరఫున పనులు పూర్తి కావాలంటే రోజులు వారాలే కాదు.. నెలలు సంవత్సరాల సమయం కూడా పడుతుంది. అనేక మంది…
దేశీయ పారిశ్రామిక వర్గాల్లో ఇప్పుడో పెద్ద చర్చ నడుస్తోంది హెలికాఫ్టర్ల తయారీలో దిగ్గజ కంపెనీగా కొనసాగుతున్న ఎయిర్ బస్ తన కొత్త…