ఫిలిం ఇండస్ట్రీలో మిగతా వాళ్లతో పోలిస్తే హీరోయిన్ల కెరీర్ స్పాన్ తక్కువ. వాళ్లు ఫిజిక్ ఎంత బాగా మెయింటైన్ చేస్తారన్నదాన్ని బట్టి వాళ్ల కెరీర్ ఎంత కాలం ఉంటుందన్నది డిసైడ్ అవుతుంది. ఏమాత్రం షేప్ ఔట్ అయినా.. లుక్స్ తేడా వచ్చినా పక్కన పెట్టేస్తారు. అందుకే కథానాయికలు రోజూ జిమ్ చేస్తూ నాజూగ్గా ఉండే ప్రయత్నం చేస్తుంటారు.
కొందరు అవసరానికి మించి వర్కవుట్లు చేసి చిక్కిపోవడమూ చూస్తుంటాం. ఐతే కొన్నిసార్లు హీరోయిన్ల తప్పేమీ లేకుండా లావైపోయే పరిస్థితులూ ఎదురవుతుంటాయి. అందుకు థైరాయిడ్ లాంటి అనారోగ్య సమస్యలు కూడా కారణం కావచ్చు. కానీ చూసేవాళ్లకు అది కనిపించదు. లుక్ కొంచెం తేడా కాగానే కౌంటర్లు వేసేస్తుంటారు.
ట్యాక్సీవాలాతో పేరు తెచ్చుకున్న ప్రియాంక జవాల్కర్.. ఇటీవల తిమ్మరసు, ఎస్ఆర్ కళ్యాణమండపం సినిమాల్లో కనిపించిన తీరు అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆమె షేపవుట్ అయిందన్న కామెంట్లు వినిపించాయి. ఐతే ఇందుకు అసలు కారణమేంటో తాజాగా మీడియాను కలిసిన సందర్భంగా ప్రియాంక వెల్లడించింది.
‘‘తిమ్మరుసు సినిమాలో బొద్దుగా ఉన్నానంటూ చాలామంది కామెంట్లు చేశారు. ఫిజిక్, కెరీర్ గురించి జాగ్రత్తలు తీసుకోవడం లేదా అని ప్రశ్నించారు. నా కెరీర్ గురించి నాకంటే ఎక్కువ జాగ్రత్తలు ఎవరూ తీసుకోలేరు. నేనే కాదు ప్రతి ఒక్క మనిషి తన ఆరోగ్యం, భవిష్యత్తు గురించి తనే జాగ్రత్తలు తీసుకుంటాడు. అయితే.. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే.. నాలో మార్పులు వచ్చాయి.
వాటితో నాకు కూడా ఇబ్బందిగా అనిపించింది. డాక్టర్లను సంప్రదిస్తే థైరాయిడ్ అని చెప్పారు. ఆ కారణంగానే బరువు పెరిగాను. ఆ తర్వాత జిమ్‌లో వర్కౌట్‌లు చేసి మళ్లీ బరువు తగ్గాను. అయితే.. నా కెరీర్ విషయంలో అజాగ్రత్తగా లేనని చెప్పేందుకే మా సినిమాకు సంబంధించిన వేడుకలో నేను మోడల్‌ను కాదు.. నటిని అని మాట్లాడాల్సి వచ్చింది. ఇంకో విషయం ఏంటంటే.. నిజ జీవితంలో ఉన్నదాని కంటే మన శరీరం కెమెరాలో 30శాతం భారీగా కనిపిస్తుంది. ఉన్నదున్నట్టుగా కనిపించాలంటే మనం సన్నగా ఉండాలి అని ప్రియాంక పేర్కొంది.
This post was last modified on August 11, 2021 8:43 am
మాములుగా ఎంత పెద్ద స్టార్ హీరో సినిమా అయినా సరే రెండు వారాల తర్వాత బాగా నెమ్మదించిపోతుంది. మొదటి పది…
పెద్ద అంచనాలతో బాలీవుడ్ మూవీ బేబీ జాన్ రిలీజయ్యింది. విజయ్ బ్లాక్ బస్టర్ తెరీ రీమేక్ గా అట్లీ నిర్మాణంలో…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ అరెస్టు వ్యవహారంపై తెలంగాణలో రాజకీయ దుమారం రేగిన…
నవీన్ పొలిశెట్టిని స్క్రీన్ మీద చూసి ఏడాది దాటిపోయింది. తన చివరి చిత్రం ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ గత…
అతిలోక సుందరిగా పేరు తెచ్చుకుని కోట్లాది మంది కుర్రకారు గుండెల్ని కొల్లగొట్టిన శ్రీదేవి.. అప్పటికే పెళ్లయి పిల్లలున్న బోనీ కపూర్‌ను…
తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించిన కొన్ని విషయాలు ఇటీవల చర్చనీయాంశంగా మారాయి. ఓవైపు మంచు ఫ్యామిలీ గొడవ.. మరోవైపు సంధ్య…