ఎంగేజ్మెంట్ రింగ్ పై నయన్ కామెంట్స్!

సౌత్ సినిమా ఇండస్ట్రీలో టాప్ రేసులో దూసుకుపోతుంది నయనతార. ఆమెతో సినిమాలు చేయాలని దర్శకనిర్మాతలు వెంటపడుతుంటారు. భారీ రెమ్యునరేషన్ ఇచ్చి మరీ ఆమెని ఒప్పిస్తుంటారు. అంత క్రేజ్ సంపాదించుకుంది నయన్. ఈ మధ్యకాలంలో ఎక్కువగా లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లోనే నటిస్తోంది ఈ బ్యూటీ. తాజాగా ఆమె నటించిన ‘నెట్రికన్’ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నయనతార ఓ టీవీ షోలో కనిపించింది.

ఈ క్రమంలో ఆమె తన రిలేషన్షిప్ గురించి తొలిసారి మాట్లాడింది. చాలా కాలంగా నయనతార.. దర్శకుడు విఘ్నేష్ శివన్ ప్రేమించుకుంటున్న సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ జంట పెళ్లి చేసుకోబోతుందని సమాచారం. కానీ నయనతార ఎప్పుడూ ఈ విషయంపై స్పందించింది లేదు. కానీ తొలిసారి తమిళ టీవీ షోలో తన ఎంగేజ్మెంట్ రింగ్ చూపించింది. ‘ఇదే నా ఎంగేజ్మెంట్ రింగ్’ అంటూ ఆమె సిగ్గుపడుతూ చెప్పింది.

ప్రస్తుతం ఈ షోకి సంబంధించిన ప్రోమో తెగ వైరల్ అవుతోంది. పబ్లిక్ గా నయనతార తన రిలేషన్ గురించి చెప్పడంతో ఫ్యాన్స్ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. విఘ్నేష్ శివన్ ను ఎంగేజ్మెంట్ చేసుకున్న నయనతార చాలా కాలంగా అతడితో సహజీవనం చేస్తుంది. ఇద్దరూ కలిసి ట్రిప్ లకు వెళ్తూ.. అక్కడి ఫోటోలను షేర్ సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. నయనతార తెలుగులో చివరిగా ‘సై రా’ సినిమాలో కనిపించింది. ఇప్పుడు ‘లూసిఫర్’ రీమేక్ లో ఆమె నటిస్తుందని సమాచారం.