Movie News

‘సర్కారు వారి పాటలో’ మహేష్ ఏం చేస్తాడు?


సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టిన రోజు కానుకగా ఆయన కొత్త చిత్రం ‘సర్కారు వారి పాట’ నుంచి రిలీజైన టీజర్ ఎంతగా ప్రేక్షకులను ఆకట్టుకుంటోందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అభిమానులు కోరుకునే విధంగా మహేష్ ఇందులో కనిపించడం.. ఆద్యంతం ఎంటర్టైనింగ్‌గా ఉండటం.. కలర్ ఫుల్ విజువల్స్.. థమన్ బ్యాగ్రౌండ్ స్కోర్.. అన్నీ కూడా పర్ఫెక్ట్‌గా కుదరడంలో టీజర్ ఇన్ ‌స్టంట్ హిట్టయిపోయింది. మహేష్ అభిమానుల్లో ఇప్పటికే ఈ చిత్రంపై ఉన్న అంచనాలు ఇంకా పెరిగిపోయాయి.

ఐతే టీజర్ చూస్తే కథ మీద పెద్దగా ఐడియా రావట్లేదు. కేవలం కొన్ని మంచి మూమెంట్స్ మాత్రమే చూపించారు. ఐతే మహేష్ పాత్ర గురించి మాత్రం దర్శకుడు పరశురామ్ కాస్త హింట్ ఇచ్చాడు. అతను ఇందులో లోన్ రికవరీ ఆఫీసర్ పాత్ర పోషిస్తున్నట్లుగా అనిపిస్తోంది. విలన్ల దగ్గరికెళ్లి ఇంట్రెస్ట్ కట్టకపోతే బ్యాండే అని వార్నింగ్ ఇవ్వడం.. వాళ్లతో ఫైట్ చేయడం చూస్తే ఇదే సంకేతాలు కనిపిస్తున్నాయి. తర్వాత మహేష్ ఒక కార్పొరేట్ ఆఫీసులో పని చేస్తున్నట్లు కూడా చూపించారు. ఐతే లోన్ రికవరీ టీం అంటే మామూలుగా కొంచెం సాధారణ స్థాయిలోనే ఉంటుంది.

కానీ మహేష్ మాత్రం పోష్ లుక్స్‌లో కనిపిస్తున్నాడు. అతడి కారు, ఆఫీస్ అన్నీ కూడా హై రేంజిలో ఉన్నాయి. మరి ఈ పాత్రను ఎలా చూపిస్తారన్నది ఆసక్తికరం. ‘సర్కారు వారి పాట’ అని టైటిల్ పెట్టడం.. ఇందుమూలంగా అంటూ వేలం పాట సౌండ్ వినిపించడాన్ని బట్టి కథ అయితే బ్యాంకు-డబ్బు.. లాంటి వ్యవహారాల చుట్టూ తిరిగేలా ఉంది. ముందు అయితే బ్యాంకు లావాదేవీలకు సంబంధించి తండ్రిని మోసం చేసిన వ్యక్తుల మీద ప్రతీకారం తీర్చుకునే కొడుకు కథ ఇదన్నట్లు ప్రచారం జరిగింది. టీజర్లో అయితే అలాంటి సంకేతాలు కనిపించలేదు. సినిమా సీరియస్‌గా కాకుండా, పూర్తి ఎంటర్టైనింగ్‌గా ఉంటుందనిపిస్తోంది.

This post was last modified on August 9, 2021 5:03 pm

Share

Recent Posts

ఇంతకీ అలియాస్ రుక్మిణి ఎవరు?

ఒక యంగ్ హీరో ఇంకో ఇంకో యంగ్ హీరోను పెట్టి సినిమా ప్రొడ్యూస్ చేయడం అరుదు. నేచురల్ స్టార్ నాని…

7 minutes ago

కోన మీద కోపం తగ్గిందా?

కోన వెంకట్ ఒకప్పుడు తెలుగు ప్రేక్షకులు ఎంతో మెచ్చిన రైటర్. ఢీ, రెడీ, కింగ్, దూకుడు, అదుర్స్.. ఇలా ఎన్నో…

35 minutes ago

సామాజిక వ‌ర్గ రాజ‌కీయం క‌లిసొచ్చిందా జ‌గ‌న్‌… ?

రాజ‌కీయాల్లో ఉన్న‌వారు.. ఒక‌వైపే చూస్తామంటే కుదురుతుందా? ఒక వైపు ఆలోచ‌న చేస్తామంటే కుదురుతుందా? అంటే కాద‌న్న‌ది అంద‌రికీ తెలిసిందే. కానీ,…

40 minutes ago

చరణ్ కోసం అనిరుధ్ బెస్ట్ ఇవ్వాల్సిందే

పెద్ది తర్వాత మూడు నెలలకు పైగా రెస్ట్ మోడ్ లో ఉన్న రామ్ చరణ్ త్వరలో ఆర్సి 17 కోసం…

4 hours ago

ఇంకో వాయిదా అడగనున్న ఆదర్శం ?

అక్టోబర్ 9 నుంచి తప్పుకున్నాక ఆదర్శ కుటుంబం ఏకె 47 కొత్త విడుదల తేదీ కోసం దగ్గుబాటి అభిమానులు కళ్ళు…

4 hours ago

రణబాలికి కాంతార రంగు

ఒక కొత్త సినిమా ప్రోమో రాగానే దాన్ని గతంలో వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమాలతో పోల్చడం ఆడియన్స్ కు అలవాటే.…

5 hours ago