మలయాళంలో హిట్ అయిన ‘అయ్యప్పనుమ్ కోశియుమ్’ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్-రానా హీరోలుగా నటిస్తున్నారు. సాగర్ చంద్ర డైరెక్టర్. అయితే ఈ సినిమాకి స్క్రీన్ ప్లే-మాటలు త్రివిక్రమ్ అందిస్తున్నారు. ఒకరకంగా సినిమాకి ఆయనే ఘోస్ట్ డైరెక్టర్ అనే ప్రచారం జరుగుతోంది. పవన్ బాడీ లాంగ్వేజ్ ప్రకారం కథలో కొన్ని మార్పులు చేశారని.. ఒరిజినల్ వెర్షన్ కంటే ఈ రీమేక్ వెర్షన్ ఇంకా బెటర్ గా ఉండబోతుందంటూ ప్రచారం జరుగుతోంది.
త్రివిక్రమ్ ఇన్వాల్వ్ అవ్వడంతో కథలో భారీ మార్పులు ఉంటాయని అభిమానులు ఆశించారు. కానీ త్రివిక్రమ్ కొత్తగా ఎలాంటి మార్పులు చేయలేదట. కానీ కాస్త స్టైలిష్ గా తీస్తున్నారట. ఒరిజినల్ వెర్షన్ ను యాజిటీజ్ దించేసినట్లుగానే ఉంటుందట. కొన్ని ఎపిసోడ్లు మాత్రమే త్రివిక్రమ్ జోడించాడని.. అది కూడా కేవలం ఎంటర్టైన్మెంట్ కోసమని తెలుస్తోంది. ఒరిజినల్ వెర్షన్ లో ఉన్న సోల్ మిస్ అవ్వకుండా ఉండాలనే ఉద్దేశంతోనే త్రివిక్రమ్ పెద్దగా మార్పులు చేయలేదట.
మెయిన్ స్టోరీను, అందులో క్యారెక్టరైజేషన్లను త్రివిక్రమ్ టచ్ చేయలేదట. దీని ప్రకారం సినిమాలో ఒకట్రెండు కొత్త ఎపిసోడ్లు మాత్రమే కనిపిస్తాయని.. అవి తప్ప మిగిలిన సినిమా మొత్తం కట్ కాపీ పేస్ట్ లా ఉంటుందని సమాచారం. నిత్యామీనన్, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటిస్తోన్న ఈ సినిమాను జనవరి 12న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు.
This post was last modified on August 6, 2021 7:54 pm
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…