టాలీవుడ్లో యువ కథానాయకులు కలిసి తెరను పంచుకోవడం కొత్తేమీ కాదు. ఒకప్పుడైతే మల్టీస్టారర్లు చేయడానికి తటపటాయించేవాళ్లు కానీ.. గత దశాబ్ద కాలంలో ఎన్నోసార్లు స్టార్లు కలిసి సినిమాలు చేశారు. పెద్ద స్టార్లే బేషజాలు పక్కన పెట్టి మల్టీస్టారర్లు చేస్తుంటే.. ఇక యువ కథానాయకులకు అభ్యంతరం ఏముంటుంది? టాలీవుడ్లో వినిపిస్తున్న తాజా కబురేంటంటే.. మంచు మనోజ్ సినిమాలో అల్లరి నరేష్ ఓ కీలక పాత్ర చేస్తున్నాడట.
కెరీర్ ఆరంభం నుంచి ఎప్పుడూ విరామం తీసుకోకుండా వరుసగా సినిమాలు చేస్తూ వచ్చిన మంచు మనోజ్.. దాదాపు నాలుగేళ్ల నుంచి ఏ చిత్రాన్ని రిలీజ్ చేయని సంగతి తెలిసిందే. చివరగా 2017లో ‘ఒక్కడు మిగిలాడు’ అనే డిజాస్టర్ మూవీతో పలకరించిన మనోజ్.. ఆ తర్వాత మూడేళ్లకు పైగా కెమెరానే ఫేస్ చేయలేదు. ఎట్టకేలకు గత ఏడాది ‘అహం బ్రహ్మాస్మి’ అనే సినిమాను మొదలుపెట్టాడు మనోజ్.
సినిమా మొదలవడమే తెలుసు కానీ.. ఇప్పటిదాకా ‘అహం బ్రహ్మాస్మి’ గురించి కొత్త సమాచారం ఏమీ లేదు. అప్‌డేట్లు లేవు. ఐతే ఇందులో అల్లరి నరేష్ కీలక పాత్ర చేస్తున్నట్లుగా ఇప్పుడు ప్రచారం సాగుతోంది. కథను మలుపు తిప్పే కీలక పాత్రనే అతను చేస్తున్నట్లు తెలుస్తోంది. మనోజ్‌కు, నరేష్‌కు మంచి అనుబంధమే ఉంది. దాదాపు ఒకే టైంలో ఇద్దరూ హీరోలయ్యారు. మొదట్నుంచి ఎంతో సన్నిహితంగా మెలుగుతున్నారు.
మనోజ్, నరేష్ ఇద్దరూ కూడా గతంలో వేరే హీరోల సినిమాల్లో నటించిన వాళ్లే. కొన్నేళ్ల కిందటే నరేష్.. మహేష్ బాబు చిత్రం ‘మహర్షి’లో కీలక పాత్ర పోషించడం తెలిసిందే. ఈ ఏడాదే అతను హీరోగా ‘నాంది’తో మంచి విజయాన్నందుకున్నాడు. ఇటీవలే ‘సభకు నమస్కారం’ అనే సినిమాను కూడా మొదలుపెట్టాడు. ‘వేదం’లో అల్లు అర్జున్‌తో స్క్రీన్ షేర్ చేసుకున్న మనోజ్.. కొన్ని చిత్రాల్లో క్యామియోలు చేశాడు. అతడి కెరీర్‌కు ఎంతో కీలకమైన ‘అహం బ్రహ్మస్మి’ చిత్రాన్ని శ్రీకాంత్ రెడ్డి అనే కొత్త దర్శకుడు రూపొందిస్తున్నాడు. మంచు మనోజ్ సంస్థ ఎంఎం ఆర్ట్స్‌లో ఈ చిత్రం తెరకెక్కుతోంది.
This post was last modified on August 5, 2021 11:25 am
అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…
హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…
మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి జరుగుతున్న గొడవంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి పరిస్తితి ఎదురవుతోందో తెలిసిందే. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి…