కంటెంట్ కత్తిలా వుంటే కుమ్మేసుకోవచ్చు!

మిగిలి భాషల చిత్ర పరిశ్రమలకు చెందిన నిర్మాతలు ఎలాంటి భయం లేకుండా ఓటిటీ వేదికను వాడుకుంటున్నారు.కానీ తెలుగు సినిమా నిర్మాతలు మాత్రం మీన మేషాలు లెక్కపెడుతున్నారు. ఎందుకంటే సినిమా థియేటర్ల నుంచి వచ్చే ఆదాయం ఓటిటీ నుంచి రాదు. ఓటిటీ వాళ్ళు కూడా ఆకర్షణీయమైన ఆఫర్స్ ఇస్తున్నారు. మాములుగా ఇచ్చే రేట్ కంటే ఎక్కువే ఆఫర్ చేసి స్ట్రీమ్ అయిన నిమిషాలకు అనుగుణంగా నిర్మాతకు వాటా ఇస్తామంటున్నారు. అయితే ఇది లాభదాయకం కావాలంటే సదరు సినిమాను బాగా చూడాలి.

మన వాళ్లే కాకుండా వేరే భాషల వాళ్ళు కూడా చూడాలి. అలా చూడాలంటే కంటెంట్ చాలా బాగుండాలి. అయితే మన సినిమాలలో అలాంటివి చాలా అరుదు. అందుకే థియేటర్స్ ఉత్తమం అని నిర్మాతలు ఫిక్స్ అవుతున్నారు. అలా అని థియేటర్ల నుంచి అన్ని సినిమాలకు గొప్ప కలెక్షన్స్ రావు. కాకపోతే అది గ్యాంబ్లింగ్ లాంటిది కాబట్టి ఓటిటీ కంటే అదే బెస్ట్ అని ఇప్పుడు ఫీలవుతున్నారు.