తెలుగు సినీ సంగీత చరిత్రలో కీరవాణిది ఒక ప్రత్యేక అధ్యాయం. ఏ రకమైన సినిమాకైనా సంగీతం అందించి మెప్పించగల అరుదైన మ్యూజిక్ డైరెక్టర్ ఆయన. అందరి లాగే ఆయన మాస్ సినిమాలకు మంచి ఊపున్న సంగీతం అందించగలరు. అదే సమయంలో ‘అన్నమయ్య’ లాంటి ఆధ్యాత్మిక చిత్రానికీ తనదైన శైలిలో సంగీతం అందించగలరు. ఈ కోవకు చెందిన సినిమాలకు మిగతా సంగీత దర్శకులు పని చేయలేరు.
చాలా ఏళ్ల నుంచి కీరవాణి సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తున్నారు. తన దగ్గరికి వచ్చిన ప్రతి సినిమానూ ఆయన అంగీకరించట్లేదు. ఎక్కువగా తన శక్తి సామర్థ్యాలన్నింటినీ తన సోదరుడు రాజమౌళి చిత్రాలకే ఉపయోగిస్తున్నారాయన. మధ్యలో ఒకటీ అరా అన్నట్లుగా వేరే చిత్రాలకు పని చేస్తున్నారు. డిమాండుంది కదా అని ఎక్కువ సినిమాలు చేసి డబ్బులు పోగేసుకోవాలనే ఆశ ఆయనలో కనిపించడం లేదు.
ఐతే రాజమౌళి సినిమాలతో కీరవాణికి ఆదాయం ఏమీ తక్కువ రావట్లేదు. సినిమాకు ఇంత అని పారితోషకం తీసుకోకుండా రాజమౌళి కుటుంబంలోని అందరూ కలిపి ఆయా చిత్రాలకు లాభాల్లో వాటా పొందుతున్న సంగతి తెలిసిందే. ప్రతి సినిమా విజయవంతం అవుతుండటంతో ఆదాయం కూడా బాగానే వస్తోంది. ప్రస్తుతం చేస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకు రాజమౌళి కుటుంబం రికార్డు స్థాయిలో ఆదాయం అందుకుంటున్నట్లు సమాచారం. కీరవాణి వాటా కింద ఏకంగా రూ.18 కోట్ల పారితోషకం అందుతోందట.
ఓ భారతీయ సంగీత దర్శకుడికి ఈ స్థాయి పారితోషకం అంటే అనూహ్యమే. ఇది ఇండియాలోనే రికార్డని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రస్తుతం తెలుగు టాప్ సంగీత దర్శకులుగా పేరున్న తమన్, దేవిశ్రీ ప్రసాద్ లాంటి వాళ్లు రూ.3 కోట్లకు అటు ఇటుగా తీసుకుంటున్నారు ఒక్కో చిత్రానికి. తమిళ లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ రూ.5 కోట్ల దాకా తీసుకుంటాడంటారు. బాలీవుడ్లో చాలామంది స్టార్ డైరెక్టర్లు ఈ రేంజ్‌లోనే పుచ్చుకుంటారు. అలాంటిది కీరవాణికి రూ.18 కోట్లంటే అదో సంచలనమే.
This post was last modified on August 4, 2021 3:14 pm
సోషల్ మీడియా ప్రపంచంలో నెగటివిటీ ఎంతగా పెరిగిపోయిందంటే గాలి కన్నా వేగంగా ఇదే ప్రయాణిస్తోంది. కొందరి ఆలోచనలను, వ్యక్తిత్వాలను తీవ్రంగా…
పన్నెండు సంవత్సరాలు ఒక సినిమా విడుదల కాకుండా ల్యాబ్ లో మగ్గితే దాని మీద ఎవరికీ పెద్దగా ఆశలు ఉండవు.…
ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకున్న అఖండ 2 తాండవం మీద ఏ స్థాయి అంచనాలున్నాయో చెప్పనక్కర్లేదు. బాలయ్యకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన…
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్‌తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…
ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…