Movie News

రంభగా బిగ్ బాస్ బ్యూటీ మోనాల్!

హీరోయిన్ గా రెండు, మూడు సినిమాలు చేసినా రాని క్రేజ్ ను ఒక్క బిగ్ బాస్ షోతో సంపాదించేసింది నటి మోనాల్ గజ్జర్. హౌస్ నుండి బయటకు వచ్చిన తరువాత వరుస అవకాశాలు అందుకుంటూ బిజీగా మారింది. టీవీ షోలు, వెబ్ సిరీస్ లు, సినిమాలంటూ తీరిక లేకుండా గడుపుతోంది. ఈ ఏడాది విడుదలైన ‘అల్లుడు అదుర్స్’ సినిమాలో ఐటెం సాంగ్ లో కనిపించిన మోనాల్.. ఇప్పుడు మరో స్పెషల్ సాంగ్ లో కనిపించబోతుందని సమాచారం.

కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో నాగార్జున హీరోగా తెరకెక్కిన ‘సోగ్గాడే చిన్ని నాయన’ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ గా ‘బంగార్రాజు’ రాబోతుంది. ఇందులో నాగార్జునతో పాటు నాగచైతన్య కూడా కనిపించబోతున్నాడు. నాగ్ కి జోడీగా రమ్యకృష్ణ, చైతూకి జంటగా కృతిశెట్టిలను తీసుకున్నారు. ఇప్పుడు సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ కోసం మోనాల్ గజ్జర్ ను సంప్రదించినట్లు తెలుస్తోంది.

కథ ప్రకారం సినిమాలో స్వర్గం ఎపిసోడ్ ఒకటి ఉంటుందట. ఈ ఫాంటసీ ఎపిసోడ్ లో కొన్ని కామెడీ సన్నివేశాలతో పాటు ఓ పాట కూడా ఉండేలా డిజైన్ చేస్తున్నారు. ‘యమగోల’, ‘యమలీల’ టైపులో ఈ ఎపిసోడ్ ను ప్లాన్ చేస్తున్నారు దర్శకుడు కళ్యాణ్ కృష్ణ. ఈ ఎపిసోడ్ లో మోనాల్ ఎంట్రీ ఇస్తుందట. స్వర్గంలో రంభగా ఆమె కనిపించబోతుందని సమాచారం. నాగార్జునతో కలిసి మోనాల్ వేసే స్టెప్పులు హైలైట్ గా నిలుస్తాయని చెబుతున్నారు. ఒక్క పాట మాత్రమే కాకుండా కొన్ని మోనాల్ పాత్రకు కొన్ని డైలాగ్స్ కూడా ఉంటాయట. ఆగస్టు 20 నుండి ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టాలని ప్లాన్ చేస్తున్నారు. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే ఈ సినిమా కూడా సంక్రాంతికి వచ్చే ఛాన్స్ ఉంది.

This post was last modified on August 3, 2021 11:36 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

మళ్లీ ‘రంగ్ దే’ కాంబో?

కొన్ని సినిమాలు ఫ్లాప్ అయినా సరే.. అందులో హీరో హీరోయిన్ల జంట అందరినీ ఆకట్టుకుంటుంది. వాళ్లను సక్సెస్ ఫుల్ పెయిర్‌గానే…

48 minutes ago

‘అనంత’లో జేసీ… ‘గోదారి’లో ఆర్ఆర్ఆర్

రాజకీయాల్లో కొందరు నేతల తీరు ఎప్పుడూ భిన్నంగానే ఉంటుంది. తాము ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతాలు అన్నింటా ముందుండాలని కోరుకోని నేత…

2 hours ago

చాప కింద నీరులా పాకుతున్న ఎంపురాన్

మోహన్ లాల్ ఎల్2 ఎంపురాన్ డబ్బింగ్ సినిమా కాబట్టి మన దగ్గర రాబిన్ హుడ్, మ్యాడ్ స్క్వేర్ పోటీని తట్టుకుని…

3 hours ago

జ‌గ‌న్ మాదిరిగా వ‌దిలేయ‌లేదు..

వైసీపీని, జ‌గ‌న్‌ను కూడా కాద‌నుకుని.. ఏపీ ప్ర‌జ‌లు కూట‌మికి ముఖ్యంగా చంద్ర‌బాబుకు భారీ మెజారిటీ ఇచ్చి ఎందుకు గెలిపిం చారో..…

3 hours ago

పక్కా దక్షిణాది మిక్స్చర్….భాయ్ సికందర్

టీజర్ నుంచి పాటల దాకా ప్రశంసల కన్నా ఎక్కువగా ట్రోలింగ్ కు గురవుతున్న సల్మాన్ ఖాన్ సికందర్ ట్రైలర్ ఇవాళ…

4 hours ago

దొంగల భరతం పట్టే క్రేజీ ‘రాబిన్ హుడ్’

https://www.youtube.com/watch?v=NfsTxYtBiWg ఛలో, భీష్మ బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు వెంకీ కుడుముల తన రెండో సినిమా హీరో నితిన్ తో…

4 hours ago