Movie News

సందీప్ కిషన్ వెర్సస్ విజయ్ సేతుపతి

విజయ్ సేతుపతి.. ఇప్పుడు సౌత్ ఇండియాలో అత్యంత డిమాండ్ ఉన్న నటుల్లో ఒకడు. తమిళంలో అతడి మేనియా గురించి కొత్తగా చెప్పేదేమీ లేదు కానీ.. గత కొన్నేళ్లలో వేరే భాషల్లోకి కూడా అతడి క్రేజ్ విస్తరించింది. సేతుపతిని దృష్టిలో ఉంచుకుని పాత్రలు రాయడం.. లేదా తాము రాసిన పాత్రలకు సేతుపతే న్యాయం చేయగలడని అతడి కోసం ప్రయత్నించడం చేస్తున్నారు తెలుగు, ఇతర భాషల ఫిలిం మేకర్స్.

తెలుగులో ఇప్పటికే సైరా, ఉప్పెన చిత్రాల్లో నటించిన సేతుపతిని ‘పుష్ప’లో కూడా నటింపజేయాలని చూశారు కానీ.. అప్పటికి డేట్లు సర్దుబాటు కాక ఈ చిత్రాన్ని ఒప్పుకోలేదు సేతుపతి. ఐతే తెలుగులో మరిందరు డైరెక్టర్లు సేతుపతి కోసం ట్రై చేస్తూనే ఉన్నారు. తాజా సమాచారం ప్రకారం ఓ తెలుగు చిత్రానికి సేతుపతి ఓకే అనేశాడట. అందులో యువ కథానాయకుడు సందీప్ కిషన్ హీరో అని అంటున్నారు.

సందీప్‌తో మంచి అనుబంధం ఉన్న బాలీవుడ్ ఫిలిం మేకర్స్ రాజ్-డీకే.. తెలుగులో ఓ సినిమాకు సమర్పకులుగా వ్యవహరించనున్నారట. ఇంతకుముందు సందీప్‌తోనే ‘డి ఫర్ దోపిడీ’ అనే సినిమాను నిర్మించారు రాజ్-డీకే. అది సరిగా ఆడలేదు. హిందీలో వీళ్లిద్దరూ రూపొందించిన ‘షోర్ ఇన్ ద సిటీ’.. అలాగే ‘ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్‌లో సందీప్ నటించాడు.

ఇప్పుడు సందీప్ హీరోగా వేరే నిర్మాతతో కలిసి తెలుగులో సినిమా తీయబోతున్నారట రాజ్-డీకే. భరత్ చౌదరి అనే కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందించనున్నాడు. ఈ చిత్రంలో సందీప్‌కు విలన్‌గా విజయ్ సేతుపతి నటించనున్నాడట.

సినిమాలో హీరోను మించి హైలైట్ అయ్యేలా విలన్ పాత్ర ఉంటుందని.. దానికి సేతుపతి అయితేనే న్యాయం చేయగలడని అతణ్ని సంప్రదించారని.. తన పాత్ర నచ్చడంతో పాటు మంచి టీం కలిసి చేస్తున్న సినిమా కావడంతో అతను ఓకే అన్నాడని.. త్వరలోనే ఈ సినిమా గురించి ప్రకటన వస్తుందని సమాచారం.

This post was last modified on August 4, 2021 5:30 pm

Share

Recent Posts

ఆ పరిస్థితిలో హనుమాన్ చాలీసాను పఠించిన కెప్టెన్

హీరో అయ్యేందుకు ఏళ్ల పాటు శ్ర‌మించేవారు కొంద‌రైతే.. తాము చేసిన ప‌నుల కార‌ణంగా చూపిన ధైర్య సాహ‌సాల కార‌ణంగా రాత్రికి…

47 minutes ago

చిన్న సినిమా సృష్టిస్తున్న సంచలనం పెద్దదే

కంటెంట్ కన్నా ముఖ్యం ఏది కాదనేది ఎప్పటికప్పుడు బాక్సాఫీస్ నిరూపిస్తునే ఉంటుంది. కాకపోతే కొందరు దర్శకులు తెలుసుకుంటారు, మరికొందరు తెలుసుకునేలోపే…

2 hours ago

మల్టీస్టారర్ మూవీకి మర్చిపోలేని అవమానం

కాంబినేషన్ మత్తులో ఇప్పటికీ చాలా మంది ప్రొడ్యూసర్లు, దర్శకులున్నారు. ప్రాక్టికల్ గా క్షేత్ర స్థాయిలో ప్రేక్షకులు ఎలా అప్డేట్ అయ్యారో…

3 hours ago

ఆంధ్రా ముద్దుబిడ్డ అనంత్ అంబానీ

నన్ను ఆంధ్రా బిడ్డగా భావించండి. ఈ అందమైన రాష్ట్రాభివృద్ధికి నావంతుగా ఏం చేయాలో... ఎలా సేవ చేయాలో గైడెన్స్ ఇవ్వండని…

4 hours ago

చాక్లెట్లు తీసుకొని టిక్కెట్లు ఇచ్చిన సీఎం

తమిళనాడు సీఎం విజయ్ రీల్ లైఫ్ సీఎం మాదిరి చేస్తున్న కొన్ని పనులు ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. తన డ్రైవర్…

4 hours ago

వివేకా కేసులో అవినాష్ రెడ్డి చుట్టూ ఉచ్చు

వైఎస్ వివేకా మర్డర్ కేసు విచారణ వైసీపీ హయాంలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నరీతిలో సాగిందని వివేకా తనయురాలు…

5 hours ago