తెలుగు సినిమా మరో ఉత్కంఠభరిత సందర్భం ముంగిట నిలిచింది. గత ఏడాది చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కరోనా కారణంగా తెలుగు రాష్ట్రాల్లో దాదాపు తొమ్మిది నెలల పాటు థియేటర్లు మూతపడి.. చివరికి డిసెంబర్లో పున:ప్రారంభం కావడం, చాలా వేగంగా పుంజుకుని వైభవాన్ని సంతరించుకోవడం తెలిసిందే. కానీ కరోనా సెకండ్ వేవ్ పుణ్యమా అని ఈ ఏడాది కూడా వేసవి మొదలవ్వగానే థియేటర్లు మూతపడ్డాయి.
మూడున్నర నెలల విరామం తర్వాత ఇప్పుడు పున:ప్రారంభం అవుతున్నాయి. ఈ శుక్రవారం నుంచే వెండితెరల్లో వెలుగులు కనిపించనున్నాయి. రీస్టార్ట్ మూవీస్‌గా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి తిమ్మరసు, ఇష్క్. లాక్ డౌన్ రావడానికి ముందే ఫస్ట్ కాపీలతో రెడీ అయిన ఈ చిత్రాలను.. థియేటర్లు పున:ప్రారంభం అయ్యే వరకు ఎదురు చూసి ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు తెస్తున్నారు. ఇవి సెకండ్ బ్రేక్ తర్వాత టాలీవుడ్‌కు ఇవి ఎలాంటి ఆరంభాన్నిస్తాయో అని అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.
ఐతే కొత్త చిత్రాలకు అడ్వాన్స్ బుకింగ్స్ అయితే అంత ఆశాజనకంగా లేవు. ముందు థియేటర్లు తెరుచుకోనీ.. సినిమాలు రిలీజై టాక్ ఏంటో బయటికి రానీ అని ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారో ఏమో కానీ.. అడ్వాన్స్ బుకింగ్స్ పట్ల ఆసక్తి ప్రదర్శించడం లేదు. గత ఏడాది రీస్టార్ట్ మూవీ ‘సోలో బ్రతుకే సో బెటర్’ విషయంలో ఇలా లేదు. ఆ సినిమా చూడ్డానికి ఎగబడ్డారు.
దానికి చాలా షోలు సోల్డ్ ఔట్ అయిపోయాయి. ఐతే ఈసారి వస్తున్న చిత్రాల్లో స్టార్లు లేకపోవడానికి తోడు.. కరోనా సెకండ్ వేవ్‌తో జనాల్లో కలిగిన భయం కూడా ఇప్పుడు అడ్వాన్స్ బుకింగ్స్ ఆశాజనకంగా లేకపోవడానికి కారణం కావచ్చు. సెకండ్ వేవ్ తర్వాత మిగతా వ్యాపారాలు కూడా డల్లుగానే ఉన్నాయి. అందులోనూ ఈ మధ్య ఓటీటీలకు ఇంకా ఎక్కువగా అలవాటు పడిపోయారు జనం.
ఈ నేపథ్యంలో కొత్త చిత్రాలకు చాలా మంచి టాక్ వస్తేనే అవి బాక్సాఫీస్ దగ్గర ప్రభావం చూపే అవకాశాలున్నాయి. టాక్ బాగుంటే జనాలు ఆటోమేటిగ్గా వీకెండ్లో థియేటర్లకు వస్తారని అంచనా వేస్తున్నారు. మరి శుక్రవారం మధ్యాహ్నం ఈ రెండు సినిమాల గురించి ఏం మాట్లాడుకుంటారో చూడాలి.
This post was last modified on July 29, 2021 2:10 pm
డైరెక్ట్ చేసినవి మూడే మూడు చిత్రాలు. కానీ నాగ్ అశ్విన్ రేంజే వేరు ఇప్పుడు. ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ లాంటి చిన్న…
ఎన్టీఆర్ జిల్లాలోని మూలపాడు సమీపంగా భారీ క్రీడా నగరాన్ని ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందడుగు వేసింది. కృష్ణా నది…
అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ విధించిన ప్రతీకార సుంకాల ప్రభావం నుంచి భారత స్టాక్ మార్కెట్ బయటపడిన మొదటి మార్కెట్‌గా…
హాస్య నటులు హీరోలు కావొచ్చేమో కానీ యాంకర్లు కథానాయకులుగా వెలుగొందటం అంత సులభం కాదు. నాలుగేళ్ల క్రితం ప్రదీప్ మాచిరాజు…
ప్రముఖ అమెరికన్ గాయని కేటీ పెర్రీ ఇప్పుడు ఒక అరుదైన ఘనతను సాధించారు. ఆమె మరో ఐదుగురు మహిళలతో కలిసి…
మ్యాన్హోల్లోకి దిగుతూ ప్రాణాలు కోల్పోయే పారిశుద్ధ్య కార్మికుల ఘటనలు ఈ మధ్య కాలంలో మరింత ఎక్కువయ్యాయి. అత్యంత ప్రమాదకరమైన ఈ…