వచ్చే సంక్రాంతి సినిమాల విషయంలో ఆల్రెడీ బెర్తులు ఫుల్ అయిపోయాయనే అనుకుంటున్నారంతా. మహేష్ బాబు చిత్రం సర్కారు వారి పాటతో పవన్ కళ్యాణ్-రానాల కొత్త సినిమా సంక్రాంతి రిలీజ్ ఖరారు చేసుకున్న సంగతి తెలిసిందే. వీలును బట్టి ఎఫ్-3 సినిమాను కూడా అదే సీజన్లో రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఇవి మూడూ పెద్ద సినిమాలే కాబట్టి మరో చిత్రానికి ఖాళీ ఉండదనే భావిస్తున్నారు. కానీ వీటిని మించిన పెద్ద సినిమా ఒకటి సంక్రాంతి రేసులోకి రానున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.
ప్రభాస్ కొత్త చిత్రం రాధేశ్యామ్‌ను సంక్రాంతి బరిలో దించాలని నిర్మాతలు తాజాగా నిర్ణయం తీసుకున్నారట. ఈ మేరకు మరో మూడు రోజుల్లో ఒక కొత్త పోస్టర్ కూడా రిలీజ్ చేస్తారని.. అందులో సంక్రాంతి రిలీజ్ గురించి ప్రకటన ఉంటుందని ఇండస్ట్రీలో చర్చ నడుస్తోంది. ‘రాధేశ్యామ్’ అప్‌డేట్స్ గురించి అభిమానులు గొడవ చేస్తుంటే.. స్వయంగా ఆ చిత్ర దర్శకుడు రాధాకృష్ణ కుమారే మూడు రోజుల్లో అప్‌డేట్ రాబోతోందని చెప్పడం గమనార్హం.
రెండేళ్ల కిందట మొదలైన రాధేశ్యామ్ మూవీ చాలా సినిమాల్లాగే కరోనా కారణంగా ఆలస్యమవుతూ వచ్చింది. ముందు అనుకున్న ప్రకారం అయితే ఈ నెల 30న రాధేశ్యామ్ ప్రేక్షకుల ముందుకు రావాలి. కానీ కరోనా సెకండ్ వేవ్ దెబ్బకు వాయిదా తప్పలేదు. ఈ మధ్యే షూటింగ్ పునఃప్రారంభించారు. షూటింగ్ దాదాపు పూర్తయినట్లే కనిపిస్తోంది. ఐతే పోస్ట్ ప్రొడక్షన్‌కు కాస్త ఎక్కువ సమయమే పట్టేలా ఉంది. పైగా ప్రభాస్ మూవీ అంటే పాన్ ఇండియా లెవెల్లో భారీగా రిలీజ్ ఉంటుంది. అన్ని చోట్లా అనుకూల పరిస్థితులు ఉండాలి. మంచి సీజన్ కుదరాలి.
దసరాకు ఆర్ఆర్ఆర్ బెర్తు బుక్ చేసుకుంది. దీపావళికి తమిళంలో రజినీ సినిమా అన్నాత్తె, హిందీలో వేరే చిత్రాలున్నాయి. దీంతో సంక్రాంతి సీజన్ బెస్ట్ అనుకుంటున్నారని సమాచారం. తెలుగులో పోటీ ఎక్కువ ఉన్నప్పటికీ సంక్రాంతి సీజన్ కాబట్టి నడిచిపోతుందని.. తమ సినిమా రేసులోకి వస్తే ఎఫ్-3 మేకర్స్ వెనక్కి తగ్గుతారనే అంచనాతో ఉన్నారట.
This post was last modified on July 29, 2021 11:52 am
సూళ్ళురుపేట లో ఈ నెల 18 నుండి 20 వరకు జరుగుతున్న ఫ్లెమింగో ఫెస్టివల్ 2025 వేడుకలు శనివారం ఉదయం…
ఏపీలోని కూటమి సర్కారులో కీలక పాత్ర పోషిస్తున్న టీడీపీలో సీనియర్ నాయకుల వ్యవహారం కొన్నాళ్లుగా చర్చకు వస్తోంది. సీనియర్లు సహకరించడం…
కీలక నిర్ణయాన్ని తీసుకుంది రేవంత్ సర్కారు. హైదరాబాద్ మహానగరి విస్త్రతిని పెంచేస్తూ అంచనాల్ని సిద్ధం చేసింది. ఇప్పటివరకు హెచ్ఎండీఏ (హైదరాబాద్…
ఏపీ పర్యటనకు వచ్చిన కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా వద్ద ఏపీ సీఎం చంద్రబాబు…
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందన్నది చెప్పలేం. రాజకీయాలు రాజకీయాలే. ఇప్పుడు ఇలాంటి పరిణామమే ఎన్టీఆర్ జిల్లాలోనూ జరుగుతోంది. టీడీపీ ఎమ్మెల్యే…
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా శనివారం రాత్రి ఏపీ పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు ఏపీ…