మిమి.. ఇప్పుడు బాలీవుడ్లో చర్చనీయాంశంగా మారిన చిత్రం. తెలుగులో ‘1 నేనొక్కడే’, ‘దోచేయ్’ సినిమాల్లో నటించి ఆ తర్వాత బాలీవుడ్లో సెటిలైపోయిన కృతి సనన్ ప్రధాన పాత్రలో నటించిన క్రేజీ మూవీ ఇది. సరోగసీ ద్వారా ఓ విదేశీ జంట కోసం బిడ్డను కనడానికి కాంట్రాక్ట్ కుదుర్చుకుని.. వాళ్లు మధ్యలో డీల్ క్యాన్సిల్ చేసుకోవడంతో ఆ బిడ్డను ఏం చేయాలో తెలియక సతమతం అయ్యే మధ్య తరగతి అమ్మాయి కథ ఇది. దీని ట్రైలర్ భలే ఎంటర్టైనింగ్‌గా ఉండి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది.
ఇక నాలుగు రోజుల్లో రిలీజ్ అనగా సినిమా మొత్తం ఆన్ లైన్లో లీక్ అయిపోవడం సంచలనం రేపింది. ఐతే ఆలస్యం చేయకుండా నెట్ ఫ్లిక్స్ వాళ్లు సినిమా లీక్ అయిన సోమవారం నాడే దీన్ని స్ట్రీమింగ్ మొదలుపెట్టేశారు. సినిమా చాలా మంచి రివ్యూలు వచ్చాయి. ఈ ఏడాది వచ్చిన బెస్ట్ ఎంటర్టైనర్లలో ఒకటిగా ‘మిమి’ని చెబుతున్నారు. కృతికి ఈ సినిమా పెద్ద బ్రేక్ అని అంటున్నారు.
ఐతే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ‘మిమి’ కాన్సెప్ట్‌తో ఎనిమిదేళ్ల కిందటే తెలుగులో ఓ సినిమా వచ్చింది. ఆ సినిమాను రూపొందించింది లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు కావడం విశేషం. ఆ చిత్రం పేరు.. వెల్కమ్ ఒబామా. అందరూ కొత్త వాళ్లు నటించారు ఆ సినిమాలో. ఐతే అదేమీ ఒరిజినల్ మూవీ కాదు. దానికి ‘మల ఆయ్ వచాయ్’ అనే మరాఠీ చిత్రం ఆధారం. ఐతే ఈ మరాఠా మూవీ, అలాగే ‘వెల్కమ్ ఒబామా’ చాలా సీరియస్‌గా, ఎమోషనల్‌గా సాగుతాయి.
కానీ ‘మిమి’ని ఎక్కువ ఎంటర్టైనింగ్‌గా తీర్చిదిద్దారు. ఒరిజినల్‌ను ఉన్నదున్నట్లు దించేయకుండా దానికి వినోదపు పూత పూశారు. ఇంకా గ్రాండ్‌గా తీర్చిదిద్దారు. అది ప్రేక్షకులకు బాగానే నచ్చుతున్నట్లుంది. ‘వెల్కమ్ ఒబామా’ విషయానికి వస్తే.. ఆ సినిమా వచ్చింది వెళ్లింది కూడా జనాలకు పెద్దగా తెలియదు. సింగీతం చాలా ఏళ్ల ముందే ఫామ్ కోల్పోవడం, ఇందులోని ఆర్టిస్లులు జనాలకు పెద్దగా తెలియకపోవడంతో సినిమా జనాలకు తెలియకుండానే కనుమరుగైపోయింది.
This post was last modified on July 28, 2021 3:13 pm
టార్గెట్ కేటీఆర్.. లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్ నాయకుడు, మాజీ మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న…
ఈ మధ్య కాలంలో రెండు అతి పెద్ద హిట్ సినిమాలు ఏవయ్యా అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు మండాడి, బెత్లెహాం…
విజయవాడలో నిర్వహించిన ‘పేదల పట్టాల పండుగ’ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అయితే, చంద్రబాబు ప్రసంగిస్తుండగా సభా ప్రాంగణం సమీపంలో…
వైసీపీ నుంచి ఆ మాటకొస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించిన రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయ సాయిరెడ్డి కొద్ది…
ఒక పెద్ద బ్లాక్ బస్టర్ సీక్వెల్ అంటే ఏ స్థాయిలో అంచనాలు ఉంటాయో వేరే చెప్పనక్కర్లేదు. బాహుబలి, పుష్ప, కెజిఎఫ్,…
ప్యాన్ ఇండియా జానర్ వల్ల భాషల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. దర్శకులు ఒక వుడ్డుకే అంకితం కాకుండా ఇతర పరిశ్రమలకు…