ఏ రంగంలో అయినా సరే.. కాలానికి తగ్గట్లు మారకపోతే మనుగడ కష్టం. సినీ పరిశ్రమకు మరింత ఈ మాట వర్తిస్తుంది. ఇక్కడ ‘ట్రెండ్’ అనేది చాలా కీలకమైన విషయం. సినిమా తీయడంలో అయినా, ప్రమోట్ చేయడంలో అయినా ట్రెండుకు తగ్గట్లు మారాల్సిందే. కరోనా పుణ్యమా అని సినిమాను ప్రమోట్ చేసే తీరే మారిపోయింది. బయట ఈవెంట్లు చేసి జనాల ఆకర్షించే అవకాశం ఉండట్లేదు. ఆడియో వేడుకలు, ప్రి రిలీజ్ ఈవెంట్లు చేయడంలో దేశం మొత్తంలో టాలీవుడ్ స్టైలే వేరు. కానీ ఇప్పుడందుకు అవకాశం లేదు. డిజిటల్ మార్గంలోనే ప్రమోషన్లను హోరెత్తించాలి.
సోషల్ మీడియాలో సినిమా చర్చనీయాంశం అయ్యేలా చేయాలి. అందుకే చిన్నా పెద్దా అని తేడా లేకుండా అన్ని సినిమాల మేకర్స్ కూడా.. ప్రేక్షకులకు అడక్కుండానే అప్‌డేట్స్ ఇస్తున్నారు. చిత్ర విశేషాలను పంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే మేకింగ్ వీడియోలు, ప్రమోషనల్ సాంగ్స్ ఊపు పెరుగుతోంది టాలీవుడ్లో. మామూలుగా బాలీవుడ్లో ఈ సంస్కృతి ఎక్కువ. ఇప్పుడు టాలీవుడ్ కూడా ఈ మోడల్‌ను బాగా అందిపుచ్చుకుంటోంది.
ఈ మధ్యే ‘ఆర్ఆర్ఆర్’ టీం రిలీజ్ చేసిన మేకింగ్ వీడియో ఎంత సంచలనం రేపిందో తెలిసిందే. ఒక ట్రైలర్ లాంచ్ అయినపుడు వచ్చే బజ్‌ను క్రియేట్ చేసిందీ వీడియో. దీంతో ఇప్పుడు మరింత ఉత్సాహంగా ప్రమోషనల్ సాంగ్ ఒకటి ప్లాన్ చేస్తోంది చిత్ర బృందం. మరోవైపు నితిన్ సినిమా ‘మాస్ట్రో’ కోసమని రూ.50 లక్షలు ఖర్చు చేసి మరీ ప్రమోషనల్ సాంగ్ చేస్తున్నారు. ఇటీవలే ‘తిమ్మరసు’ అనే చిన్న సినిమా నుంచి ప్రమోషనల్ సాంగ్ రిలీజ్ చేస్తే మంచి స్పందన వచ్చింది. ఈ తరహా మేకింగ్ వీడియోలు, ప్రమోషనల్ సాంగ్స్ మరిన్ని రూపొందుతున్నాయి టాలీవుడ్లో.
This post was last modified on July 27, 2021 6:20 pm
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…
ప్రపంచం మెచ్చిన సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ తన భార్య సైరా భానుతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించడం ఫ్యాన్స్ ను…