ప్రస్తుతం ఇండియాలో అత్యధిక అంచనాలున్న సినిమా అంటే ‘ఆర్ఆర్ఆర్’యే. ‘బాహుబలి’ తర్వాత రాజమౌళి రూపొందిస్తున్న సినిమా కావడం.. పైగా జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్‌ల క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కుతుండటంతో ముందు నుంచే అంచనాలు తార స్థాయిలో ఉన్నాయి. ఇక ఈ మధ్య రిలీజ్ చేసిన మేకింగ్ వీడియోతో అంచనాలు ఇంకా పెరిగిపోయాయి. ఇప్పుడిక ‘ఆర్ఆర్ఆర్’ మ్యూజికల్ బొనాంజాతో అంచనాలు ఇంకా పెంచడానికి సిద్ధమైంది కీరవాణి బృందం.
తాజాగా ‘ఆర్ఆర్ఆర్’ ఆడియో హక్కులను ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే అత్యధిక రేటుకు టీ సిరీస్-లహరి వాళ్లకు అమ్మడం తెలిసిందే. సినిమా నుంచి ఇక ఒక్కో పాట రిలీజ్ చేయడానికి కూడా సన్నాహాలు జరుతున్నాయి. తొలి పాటకు ముహూర్తం కూడా కుదిరింది. ఆగస్టు 1న ఉదయం 11 గంటలకు ‘ఆర్ఆర్ఆర్’ ఫస్ట్ సాంగ్ లాంచ్ చేయబోతున్నారు.
ఈ పాట గురించి అప్‌డేట్ ఇస్తూ ఇంట్రెస్టింగ్ పోస్టర్ రిలీజ్ చేసింది ‘ఆర్ఆర్ఆర్’ టీం. ఆ ఫొటోలో ‘ఆర్ఆర్ఆర్’ సంగీత దర్శకుడు కీరవాణితో పాటు తమిళ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్, ప్రముఖ బాలీవుడ్ మ్యుజీషియన్ అమిత్ త్రివేదిలతో పాటు గాయకులు హేమచంద్ర, విజయ్ ఏసుదాస్, యాజిన్ నజీర్ ఉన్నారు. ముగ్గురు టాప్ మ్యూజిక్ డైరెక్టర్లు, ముగ్గురు మంచి గాయకులు కలిసి ఈ పాట కోసం పని చేశారంటే ఇది మామూలుగా ఉండదనే అంచనాలు కలుగుతున్నాయి.
మరి కొన్ని రోజులుగా చర్చనీయాంశం అవుతున్న ‘ఆర్ఆర్ఆర్’ ప్రమోషనల్ సాంగే ఇదా.. లేక వేరే పాటనా అన్నది తెలియాల్సి ఉంది. ‘ఆర్ఆర్ఆర్’కు సంబంధించి ఇప్పటిదాకా రిలీజ్ చేసే ప్రోమో వీడియోల్లో కీరవాణి బ్యాగ్రౌండ్ స్కోర్ వారెవా అనిపించింది. మరి పాటల్లో ఆయన పనితనం ఎలా ఉంటుందో చూడాలి. ప్రస్తుత అంచనాల ప్రకారం అయితే ‘ఆర్ఆర్ఆర్’ అక్టోబరు 13న విడుదలయ్యే అవకాశముంది.
This post was last modified on July 27, 2021 11:59 am
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…