Movie News

ఆ సినిమా ఏమైంది పూరీ?

టాలీవుడ్లో ఎందరో హీరోలకు మంచి బ్రేక్ ఇచ్చిన దర్శకుడు పూరీ జగన్నాథ్. మామూలు హీరోలను స్టార్లను చేసినా.. స్టార్లను సూపర్ స్టార్లను చేసినా ఆయనకే చెల్లింది. రవితేజ, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్‌ లాంటి స్టార్లకు వారి వారి కెరీర్లలో ఆయా సమయాల్లో బిగ్గెస్ట్ మూవీస్‌ను అందించిన ఘనత పూరీది. రామ్ చరణ్‌ను గ్రాండ్‌గా లాంచ్ చేసింది కూడా పూరీనే.

ఐతే ఇంతమంది స్టార్లకు బ్రేక్ ఇచ్చిన పూరీ తన కొడుకు పూరి ఆకాశ్‌ కెరీర్‌ను మాత్రం సెట్ చేయలేకపోయాడు. టీనేజీలో ‘ఆంధ్రా పోరి’ అనే అనవసర సినిమా చేసి దెబ్బ తిన్న ఆకాశ్‌ను.. ఆ తర్వాత పూరీనే ‘మెహబూబా’ చిత్రంతో పూర్తి స్థాయి హీరోగా లాంచ్ చేశాడు. కానీ ఆ చిత్రం డిజాస్టర్ అయింది. ఐతే తాను సరైన ఫాంలో లేననో.. లేక బిజీగా ఉండటం వల్లో ఆకాశ్ తర్వాతి సినిమా దర్శకత్వ బాధ్యతలు తన శిష్యుడు అనిల్ పాడూరికి అప్పగించాడు.

పూరీ కథతోనే తెరకెక్కిన ఆ చిత్రమే.. రొమాంటిక్. ఆకాశ్ సరసన కేతిక శర్మ అనే కొత్తమ్మాయి కథానాయికగా నటించింది. గత ఏడాది రిలీజ్ చేసిన ఈ సినిమా ఫస్ట్ లుక్, ఒక పాట ఘాటు ఘాటుగా ఉండి కుర్రాళ్ల దృష్టిని ఆకర్షించాయి. ఆ సినిమా షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది, రిలీజే తరువాయి అన్నారు. కానీ చూస్తుండగానే ఏడాది గడిచిపోయింది. ఈ సినిమా సంగతి అతీ గతీ లేదు.

ఈ మధ్యనే ఆకాశ్ ‘చోర్ బజార్’ అంటూ కొత్త సినిమా మొదలుపెట్టాడు. ‘జార్జిరెడ్డి’ ఫేమ్ జీవన్ రెడ్డి దర్శకుడు. ఈ సినిమా చకచకా షూటింగ్ జరుపుకుంటోంది. ఆకాశ్ పుట్టిన రోజు సందర్భంగా ఆసక్తికర ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ కూడా రిలీజ్ చేస్తున్నారు. అది చూస్తే పూరి మంచి ఫాంలో ఉండగా తీసిన సినిమాలు గుర్తుకొస్తున్నాయి.

ఈ సినిమా కాస్త ప్రామిసింగ్‌గానే కనిపిస్తోంది. చూస్తుంటే ఈ చిత్రమే ముందు ప్రేక్షకులను పలకరించేలా ఉంది. ‘రొమాంటిక్’ సంగతి ఏమైందో కూడా తెలియట్లేదు. ఔట్ పుట్ బాగా లేదని, ఆకాశ్ కెరీర్‌కు ప్రతికూలం అవుతుందని ఈ సినిమాను పక్కన పెట్టేశారనే సందేహాలు కూడా వ్యక్తమవుతుండటం గమనార్హం.

This post was last modified on July 28, 2021 9:51 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

53 minutes ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

1 hour ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

2 hours ago

బాబుకు కుప్పం ఎలానో… పవన్ కు పిఠాపురం అలా!

కుప్పం.. ఏపీ సీఎం చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం. గ‌త 40 సంవ‌త్స‌రాలుగా ఏక ఛ‌త్రాధిప‌త్యంగా చంద్ర‌బాబు ఇక్క‌డ విజ‌యం దక్కించుకుంటున్నారు.…

3 hours ago

ట్రెండీ కామెడీతో నవ్వించే మురారి

​సంక్రాంతి సినిమాల హడావుడి మరో లెవెల్ కు చేరుకుంది. ఇప్పటికే రాజాసాబ్ థియేటర్లలో సందడి చేస్తుండగా రేపు మెగాస్టార్ చిరంజీవి…

4 hours ago

సమంతలో పెళ్ళి తెచ్చిన కళ

ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర…

5 hours ago