మామూలుగానే ఆర్ఆర్ఆర్ మీద అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. ఇక రిలీజ్ దగ్గర పడేకొద్దీ అంచనాలు మరింత పెరిగిపోతున్నాయి. అందుక్కారణం రాజమౌళి అండ్ టీం అమలు చేస్తున్న ప్రమోషనల్ స్ట్రాటజీనే. ఇటీవలే ఎవ్వరూ ఊహించని విధంగా ఉన్నట్లుండి మేకింగ్ వీడియోను రిలీజ్ చేసి అభిమానులను ఉర్రూతలూగించింది ఆర్ఆర్ఆర్ టీం.
అది కళ్లు చెదిరే విధంగా ఉండి అందరి దృష్టినీ ఆకర్షించింది. ఇప్పుడిక ఒక భారీ ప్రమోషనల్ సాంగ్ కోసం సన్నాహాలు చేస్తోంది ఆర్ఆర్ఆర్ టీం. హీరోలతో పాటుగా చిత్ర బృందంలోని ముఖ్యులందరూ కనిపించే ఈ ప్రమోషనల్ సాంగ్ ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే నభూతో అనేట్లు ఉంటుందన్న వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. ఈ పాట కోసం సంగీత దర్శకుడు కీరవాణి.. తమిళ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ సాయం తీసుకుంటున్నట్లు ఇటీవల వార్తలొచ్చిన సంగతి తెలిసిందే.
ఈ ప్రమోషనల్ సాంగ్‌కు సంగీత పరంగా సాయం చేయడంతో పాటు ఇందులో అనిరుధ్ సైతం తళుక్కుమంటాడని ప్రచారం సాగింది. ఈ ప్రచారం నిజమే అని తేలింది. స్వయంగా కీరవాణే దీని గురించి అప్‌డేట్ ఇచ్చాడు. ఆయన చెన్నైకి వెళ్లి అనిరుధ్‌ను కలిసి ఈ పాట గురించి చర్చించి రావడం విశేషం.
ఈ సందర్భంగా అనిరుధ్ టాలెంట్, అతడి టీం గురించి ప్రశంసలు కురిపిస్తూ కీరవాణి ఒక ట్వీట్ కూడా వేశాడు. అనిరుధ్‌తో తన సెషన్ చాలా బాగా సాగిందనడం ద్వారా ప్రమోషనల్ సాంగ్ గురించి కీరవాణి హింట్ ఇచ్చాడు. ఇందుకు అనిరుధ్ స్పందిస్తూ.. ఆర్ఆర్ఆర్‌లో భాగం కావడం తనకెంతో ఆనందదాయకమని.. టీంకు తన ప్రేమాభిమానాలు అందజేస్తున్నానని ట్వీట్ చేశాడు.
యూత్, మాస్, ఫ్యాన్స్ పల్స్ బాగా తెలిసిన అనిరుధ్.. తన పాటలతో ఎలా అలరిస్తాడో తెలిసిందే. ఆర్ఆర్ఆర్ కోసం అంటే అతను ఓ రేంజిలో ఔట్‌పుట్ ఇస్తాడని ఆశించవచ్చు.
This post was last modified on July 26, 2021 8:23 am
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…
భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…