2000 తర్వాత ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన అత్యుత్తమ దర్శకుల్లో రాజ్ కుమార్ హిరాని పేరు ముందు వరుసలో ఉంటుంది. మున్నాబాయ్ ఎంబీబీఎస్.. మున్నాబాయ్ లగేరహో.. 3 ఇడిటయ్స్.. పీకే.. సంజు.. ఇలా ఆయన తీసిన ప్రతి చిత్రం ఒక క్లాసిక్కే.
‘సంజు’ తర్వాత మున్నాబాయ్ సిరీస్‌లో మూడో సినిమా వస్తుందని ప్రచారం జరిగింది కానీ.. అది కార్యరూపం దాల్చలేదు. ఇంతలో వరుస డిజాస్టర్లతో సతమతం అవుతున్న షారుఖ్ ఖాన్‌తో సినిమాకు ఓకే చెప్పాడు హిరాని. ఈ మెగా కాంబినేషన్ అంచనాలు మామూలుగా లేవు.
సినిమాకు సినిమాకు మధ్య చాలా గ్యాప్ తీసుకున్న పక్కాగా స్క్రిప్టు సిద్ధం చేసుకునే హిరాని.. షారుఖ్ సినిమాకు కూడా చాలానే టైం తీసుకుంటున్నాడు. ‘జీరో’ తర్వాత తన రీఎంట్రీ మూవీ ‘పఠాన్’ పనిలో షారుఖ్ బిజీగా ఉండగా.. అది పూర్తి కాగానే, ఈ ఏడాది చివర్లో హిరాని సినిమాను పట్టాలెక్కిస్తాడని భావిస్తున్నారు.
ఈ సినిమాలో షారుఖ్‌తో పాటుగా నటించబోయే కాస్టింగ్ గురించి బాలీవుడ్లో వస్తున్న వార్తలు అభిమానులను ఎగ్జైట్ చేస్తున్నాయి. షారుఖ్‌తో ఎవర్ గ్రీన్ జోడీగా పేరున్న కాజోల్ ఇందులో కీలక పాత్ర పోషించనుందట. అలాగే యాక్టింగ్ పవర్ హౌస్‌లుగా పేరున్న మనోజ్ బాజ్‌పేయి, బొమన్ ఇరానీ, విద్యాబాలన్, తాప్సి.. ఈ నలుగురూ ఇందులో ముఖ్య పాత్రలు పోషించనున్నారట.
షారుఖ్‌తో మొదలుకుని ఈ ఆరుగురిలో ఎవరికి వాళ్లు గ్రేట్ ఆర్టిస్టులుగా పేరు తెచ్చుకున్నవాళ్లే. ప్రతి ఒక్కరికీ వ్యక్తిగతంగా మంచి ఇమేజ్ ఉంది. ఇంత మంది ఫేమస్ ఆర్టిస్లులతో కలిసి హిరాని లాంటి గ్రేట్ డైరెక్టర్ సినిమా చేయబోతుండటం ఉత్కంఠ రేకెత్తిస్తోంది. ఇంకా ఈ చిత్రానికి సాంకేతిక నిపుణులు ఎవరన్నది ఖరారవ్వలేదు. మంచి సందేశం ఉన్న కథల్ని వినోదాత్మకంగా చెప్పడంలో హిరానిది అందె వేసిన చేయి. మరి షారుఖ్‌తో కూడా తనదైన శైలిలో సినిమా తీసి అతడి బ్లాక్‌బస్టర్ కరవును తీరుస్తాడేమో చూడాలి.
This post was last modified on July 25, 2021 9:00 pm
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్‌కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…