Movie News

హీరోను మించి హైలైట్ అయిన క్యారెక్టర్


సార్పట్ట-పరంపర.. ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశం అవుతున్న సినిమా. సూపర్ స్టార్ రజినీకాంత్‌తో కబాలి, కాలా లాంటి డిజాస్టర్ సినిమాలు తీసిన పా.రంజిత్ దర్శకత్వం వహించిన కొత్త చిత్రమిది. కెరీర్ ఆరంభంలో అట్టకత్తి, మద్రాస్ సినిమాలతో తనపై భారీగా అంచనాలు పెంచిన రంజిత్.. ఏకంగా రజినీకాంత్‌తో సినిమా చేసే అవకాశం దక్కించుకున్నాడు. అతను తీసిన ‘కబాలి’కి ఎంత హైప్ వచ్చిందో తెలిసిందే. కానీ ఆ సినిమా అంచనాలను అందుకోలేకపోయింది. కాలా పరిస్థితీ అంతే. దీంతో రంజిత్ మీద అందరికీ నమ్మకం పోయింది.

కానీ ఈసారి బాగా టైం తీసుకుని, ఎంతో కష్టపడి ‘సార్పట్ట’ సినిమా తీశాడు. ఆర్య ఇందులో బాక్సర్‌గా లీడ్ రోల్ చేశాడు. 70వ దశకంలో చెన్నైలో బాగా ఫేమస్ అయిన బాక్సింగ్ సంస్కృతి, వర్గ పోరు నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది. ఈ నెల 22న అమేజాన్ ప్రైమ్ ద్వారా నేరుగా రిలీజైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందనే వస్తోంది.

70ల నాటి పరిస్థితులను, అప్పటి బాక్సింగ్ సంస్కృతిని, అసమానతలను చాలా బాగా చూపించాడని రంజిత్‌పై ప్రశంసలు కురుస్తున్నాయి. థియేటర్లలో రిలీజైతే కమర్షియల్‌గా ఏమాత్రం విజయవంతం అయ్యేదన్నది సందేహమే కానీ.. చూసిన వాళ్లందరూ మంచి సినిమాగా ప్రశంసిస్తున్నారు. ఐతే ఈ చిత్రంలో హీరో ఆర్య పాత్రను మించి వేరే క్యారెక్టర్ ఒకటి హైలైట్‌గా నిలవడం, అదే సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశంగా మారడం విశేషం. ఆ పాత్రే.. డ్యాన్సింగ్ రోజ్. షబీర్ అనే నటుడు ఈ పాత్రలో నటించాడు.

హీరో బాక్సర్ అవతారమెత్తి.. విలన్‌తో పోరాడటానికి ముందు నన్ను ఓడించమంటూ ఈ డ్యాన్సింగ్ రోజ్ పాత్రధారి సవాలు విసురుతాడు. రింగ్‌లో డ్యాన్స్ చేస్తూ, చాలా స్టైల్‌గా కదులుతూ, చిత్రమైన పోజులు ఇస్తూ ప్రత్యర్థిని కన్ఫ్యూజ్ చేస్తూ పైచేయి సాధించే బాక్సర్ క్యారెక్టర్ ఇది. ఈ ఎపిసోడ్ సినిమాలో మేజర్ హైలైట్‌గా నిలిచింది. ఈ పాత్ర వెరైటీగా ఉండి ప్రేక్షకులను ఫిదా చేస్తోంది. సినిమా రిలీజైనప్పటి నుంచి డ్యాన్సింగ్ రోజ్.. డ్యాన్సింగ్ రోజ్ అంటూ జనాలు తెగ మాట్లాడేసుకుంటున్నారు. ‘సార్పట్ట’ తెలుగు వెర్షన్ చూసిన మన ప్రేక్షకులు కూడా దాని గురించే మాట్లాడుకుంటున్నారు. విశేషం ఏంటంటే.. ఇది ఒక నిజ జీవిత వ్యక్తి స్ఫూర్తితో తీర్చిదిద్దిన పాత్ర అట.

This post was last modified on July 24, 2021 3:00 pm

Share

Recent Posts

ముఖ్యమంత్రి పదవికి దీప్కే రాజీనామా

అదేంటి కాక్రోచ్ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే ఎప్పుడు ముఖ్యమంత్రి అయ్యాడని బిత్తర పోతున్నారా..? అప్పుడే ఆయన తన పదవికి రాజీనామా…

3 hours ago

కొండా సురేఖకు కేబినెట్ హోదా?

తెలంగాణా అధికార కాంగ్రెస్ పార్టీలో రాజకీయ పరిణామాలు రోజుకో రకంగా మారుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై కొండా సురేఖ…

4 hours ago

ఇరుముడి న‌టుడు… రోజుకు 40 వేలు

హీరో హీరోయిన్ల‌కు.. పెద్ద టెక్నీషియ‌న్ల‌కు అంటే సినిమాకు ఏక మొత్తంగా పారితోష‌కాలు ఇస్తారు. కానీ చిన్న చిన్న క్యారెక్ట‌ర్లు చేసేవాళ్ల‌కు…

5 hours ago

నాలుగు స్థంభాలాటలో విజేత ఎవరంట

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలు నలుగురు వంద రోజుల గ్యాప్ లో పరస్పరం తమ సినిమాలతో తలపడుతున్నారు. ఒకరు గాంధీ…

6 hours ago

కీర్తి సురేష్ ఇంత హాటైపోయిందేంటబ్బా..

మామూలుగా స్టార్ హీరోయిన్ల నుంచి కెరీర్ ఆరంభంలో గ్లామర్ మోతాదు ఎక్కువ ఉంటుంది. క్రమంగా గ్లామర్ పాత్రలు తగ్గించుకుని, పెర్ఫామెన్స్…

6 hours ago

ట్రైలర్ లేకుండా సినిమా… వాటి రిజల్ట్ తెలుసా?

నేచురల్ స్టార్ నాని కెరీర్లోనే అత్యధిక బడ్జెట్లో తెరకెక్కి, భారీ అంచనాలతో రాబోతున్న సినిమా.. ది ప్యారడైజ్. ఏకంగా రూ.200…

7 hours ago