Movie News

అమేజాన్ ప్రైమ్‌లోకి మోస్ట్ అవైటెడ్ మూవీ


ఒక్కోసారి కొన్ని హాలీవుడ్ సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా అనూహ్యమైన క్రేజ్ వస్తుంటుంది. లోకల్ సూపర్ స్టార్ల సినిమాలకు దీటుగా అవి బంపర్ క్రేజ్ మధ్య రిలీజవుతుంటాయి. కలెక్షన్ల మోత మోగిస్తుంటాయి. రెండేళ్ల కిందట ‘ఎవెంజర్స్: ది ఎండ్ గేమ్’ ఇండియన్ బాక్సాఫీస్‌ను ఎలా షేక్ చేసిందో తెలిసిందే. దీని తర్వాత అంత క్రేజ్ సంపాదించుకుని భారతీయ బాక్సాఫీస్‌ను రూల్ చేసిన హాలీవుడ్ మూవీ ‘గాడ్జిల్లా వెర్సస్ కాంగ్’.

ఈ ఏడాది మార్చి 24న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రానికి భారతీయ ప్రేక్షకులు కూడా బ్రహ్మరథం పట్టారు. పెద్ద సిటీల్లోని మల్టీప్లెక్సుల్లో హౌస్ ఫుల్స్‌తో రన్ అయిందీ సినిమా. సింగిల్ స్క్రీన్లలో కూడా బాగానే ఆడింది. ‘గాడ్జిల్లా వెర్సస్ కాంగ్’ను థియేటర్లలో మిస్ అయిన వాళ్లు డిజిటల్ రిలీజ్ కోసం చాన్నాళ్ల నుంచి ఎదురు చూస్తున్నారు. ఐతే ఎట్టకేలకు ఆ చిత్రం ఓటీటీలోకి వస్తోంది.

స్ట్రీమింగ్ జెయింట్ అమేజాన్ ప్రైమ్ ఆగస్టు 14న ‘గాడ్జిల్లా వెర్సస్ కాంగ్’ను రిలీజ్ చేయబోతోంది. ఇంగ్లిష్‌తో పాటు తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఒకేసారి ఈ చిత్రాన్ని అందుబాటులోకి తెస్తోంది ప్రైమ్. ఇది ప్రైమ్ సబ్‌స్క్రైబర్లకు సూపర్ న్యూస్ అనడంలో సందేహం లేదు. ఐతే ఈ చిత్రంపై ఉన్న అంచనాల దృష్ట్యా పే పర్ వ్యూ పద్ధతిలో రిలీజ్ చేస్తారని ముందు ప్రచారం జరిగింది.

ఐతే థియేటర్లలో రిలీజైన ఐదు నెలల తర్వాత ఓటీటీలో రిలీజ్ చేస్తూ పెయిడ్ స్క్రీనింగ్ అంటే టూమచ్ అవుతుంది. ప్రైమ్ అనౌన్స్‌మెంట్లో మాత్రం పే పవర్ వ్యూ గురించి ప్రస్తావన ఏమీ లేదు. ఓవైపు గాడ్జిల్లా, మరోవైపు కింగ్ కాంగ్ సినిమాలు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నాయి. ఇవి రెండూ ఒకదాంతో ఒకటి తలపడ్డ సినిమా ‘గాడ్జిల్లా వెర్సస్ కాంగ్’ ప్రేక్షకుల్లో అమితాసక్తిని రేకెత్తించింది. ఇందులో ద్వితీయార్ధంలో యాక్షన్ ఘట్టాలు నభూతో నభవిష్యత్ అంటూ అందరూ కొనియాడారు. వెండితెరలపై గొప్పగా అలరించిన ఈ చిత్రం బుల్లితెర ప్రేక్షకులనూ మైమరిపిస్తుందనడంలో సందేహం లేదు.

This post was last modified on July 23, 2021 1:04 pm

Share

Recent Posts

చరణ్ కోసం అనిరుధ్ బెస్ట్ ఇవ్వాల్సిందే

పెద్ది తర్వాత మూడు నెలలకు పైగా రెస్ట్ మోడ్ లో ఉన్న రామ్ చరణ్ త్వరలో ఆర్సి 17 కోసం…

3 hours ago

ఇంకో వాయిదా అడగనున్న ఆదర్శం ?

అక్టోబర్ 9 నుంచి తప్పుకున్నాక ఆదర్శ కుటుంబం ఏకె 47 కొత్త విడుదల తేదీ కోసం దగ్గుబాటి అభిమానులు కళ్ళు…

3 hours ago

రణబాలికి కాంతార రంగు

ఒక కొత్త సినిమా ప్రోమో రాగానే దాన్ని గతంలో వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమాలతో పోల్చడం ఆడియన్స్ కు అలవాటే.…

4 hours ago

పవన్ పాలనకు చిరు కితాబు

తల్లిదండ్రులు పిల్లల్ని పొగిడితే ఆయుక్షీణం అంటారు. పవన్ కళ్యాణ్‌కు చిరంజీవి పేరుకు అన్నయ్యే కానీ.. ఆయనది తండ్రి స్థానమే. అందుకేనేమో…

6 hours ago

రామాయణ చుట్టూ పోటీ ఆంజనేయుళ్లు

నిర్మాతలు అదిగో ఇదిగో అనడమే తప్పించి ఫలానా డేటుకి రామాయణ పార్ట్ 1 రిలీజ్ అవుతుందని ఇప్పటికీ చెప్పకపోవడం మహా…

6 hours ago

పిల్లల స్కూలు విషయాలు సూర్యనే చూసుకుంటాడు

తమిళ నటుడు సూర్య పెద్ద స్టార్ హీరో అయినా.. ఏమాత్రం భేషజం లేని, ఉన్నత వ్యక్తిత్వం తనది. అభిమానులను అక్కున…

6 hours ago