మెగాస్టార్ చిరంజీవి పదేళ్ల విరామం తర్వాత సినిమాల్లోకి పునరాగమనం చేయాలనుకున్నపుడు ఎంచుకున్నది రీమేక్‌నే. తర్వాత సైరా సినిమాలో నటించి, ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య చేస్తున్న చిరు.. మళ్లీ రీమేక్ బాట పట్టనున్నాడు. ఆయన కోసం తనయుడు రామ్ చరణ్ మలయాళ బ్లాక్ బస్టర్ లూసిఫర్ రీమేక్ హక్కులు తీసుకున్న సంగతి తెలిసిందే. సాహో ఫేమ్ సుజీత్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కనుంది.
ఐతే మలయాళం నుంచి ఉన్నదున్నట్లు దించేయకుండా తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లు మార్పులు చేర్పులు ఏవో చేస్తున్నట్లు చెబుతున్నారు. ఐతే మూల కథ, పాత్రలు మాత్రం మారే అవకాశం లేదు. అదనంగా కొన్ని పాత్రలు తోడు కావచ్చు.
లూసిఫర్ సినిమాలో ఒక ప్రాధాన్యమున్న లేడీ క్యారెక్టర్ ఉంటుంది. అక్కడ ఆ పాత్రను మంజు వారియర్ చేసింది. తెలుగులో ఆ పాత్రను విజయశాంతితో చేయించాలని అనుకుంటున్నట్లు వార్తలొస్తుండటం విశేషం. 13 ఏళ్ల విరామం తర్వాత విజయశాంతి సరిలేరు నీకెవ్వరు సినిమాలో నటించింది. తర్వాత సినిమాలకు సెలవు అంటూ వెళ్లిపోయింది. ఆమెను ఎవరూ అడగట్లేదా.. తనే సినిమాలు చేయట్లేదా అన్నది తెలియడం లేదు.
ఇలాంటి తరుణంలో చిరు, సుజీత్.. మంజు పాత్ర కోసం విజయశాంతిని అడుగుతున్నారని.. ఆమె ఓకే చెప్పే అవకాశముందని గుసగుసలు వినిపిస్తున్నాయి. సరిలేరు ఈవెంట్లోనే విజయశాంతితో చాలా ఆత్మీయంగా మాట్లాడారు చిరు. అప్పుడు వాళ్ల కెమిస్ట్రీ పట్ల ఆసక్తికర చర్చ జరిగింది. గతంలో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించిన ఈ జోడీ.. మళ్లీ తెరపై కనిపిస్తే ఆ కిక్కే వేరుగా ఉంటుందనడంలో సందేహం లేదు.
This post was last modified on May 24, 2020 10:16 am
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…