వ్యాపారవేత్త, శిల్పా శెట్టి భర్త అయిన రాజ్ కుంద్రా పోర్న్ సినిమాలు నిర్మిస్తున్నాడన్న ఆరోపణలతో అరెస్ట్ కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఇంత పేరున్న వ్యక్తికి ఇదేం బుద్ధి అంటూ జనాలు ఆశ్చర్యపోయారు. లండన్ కేంద్రంగా నడిచే ఓ సంస్థ ద్వారా నిధులు అందుకుని ఔత్సాహిక మోడల్స్‌ను బలవంతం చేసి అశ్లీల చిత్రాలు తీసి, ఓ యాప్ ద్వారా రిలీజ్ చేసి కోట్లు గడిస్తున్నాడన్నది కుంద్రా మీద వచ్చిన ఆరోపణ.
ఈ కేసులో కుంద్రాకు వ్యతిరేకంగా బలమైన సాక్ష్యాలే ఉన్నట్లుగా వార్తలొస్తున్నాయి. ఐతే ఈ కేసు విషయంలో కుంద్రా వెర్షన్ ఏంటన్నది ఆసక్తికరం. అతడి లాయర్ కేసుకు సంబంధించి తమ వాదనను కోర్టులో వినిపించాడు కూడా. దాని ప్రకారం తాము తీసింది వెబ్ సిరీస్‌లే తప్ప పోర్న్ చిత్రాలు కాదన్నది కుంద్రా వాదన.
“ఈ మధ్యకాలంలో వస్తున్న వెబ్‌సిరీస్‌లను చూస్తే వాటిల్లో ఎక్కువగా ఇంటిమేట్ సీన్లు ఉంటున్నాయి. అదే మాదిరిగా ఇది కూడా ఓ వెబ్‌సిరీస్ మాత్రమే తప్ప పోర్న్ ఫిల్మ్ కాదు. మనకున్న సెక్షన్ల ప్రకారం.. ఇద్దరు వ్యక్తులు కెమెరా ముందు శృంగారం చేస్తున్నట్లు కనిపిస్తేనే దాన్ని పోర్న్ కింద వర్గీకరించాలి. అలా కాకుండా ఏ ఇతర అశ్లీల సన్నివేశాలను పోర్న్ కింద పరిగణించాల్సిన అవసరం లేదు” అని రాజ్‌కుంద్రా తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు.
మొత్తానికి తాము శృంగార పరమైన వీడియోలు తీస్తున్న సంగతి మాత్రం రాజ్ కుంద్రా అంగీకరిస్తున్నట్లే ఉంది. కాకపోతే అవి పోర్న్ కిందికి రావన్నది అతడి వాదన. మరి పోలీసులు, కోర్టు ఈ విషయంలో ఎలాంటి అభిప్రాయం వ్యక్తం చేస్తాయో చూడాలి.
ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో ముంబయి శివారులోని ‘మాద్ దీవి’లోని ఓ బంగ్లాలో పోర్న్ సినిమా షూటింగ్ జరుగుతున్నట్లు సమాచారం రావడంతో పోలీసులు దాడి చేశారు. అక్కడ ఇద్దరు వ్యక్తులు నగ్నంగా కనిపించారు. దీంతో అక్కడ ఉన్న 11 మందిని పోలీసులు అరెస్ట్ చేసి ఐదు నెలలపాటు దర్యాప్తు చేసి ‘పోర్న్ రాకెట్’ గుట్టుని బయటపెట్టారు. ఇందులో భాగంగానే ‘హాట్‌షాట్స్’ యాప్ నిర్వహిస్తున్న రాజ్‌కుంద్రాను అరెస్ట్ చేశారు.
This post was last modified on July 22, 2021 5:49 pm
ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో నాలుగు రోజుల పర్యటన నిమిత్తం వెళ్లిన.. ఆయ న సతీమణి నారా…
అర్ధమయ్యి కానట్టు, అసలు అర్థమే లేనట్టు, అర్థం చేసుకుంటే ఏదో ఉన్నట్టు అనిపించే ఒక వెరైటీ సినిమా తీసిన ఉపేంద్ర…
అల్లు అర్జున్-పుష్ప-2 వివాదంపై తాజాగా తెలంగాణ డీజీపీ జితేందర్ స్పందించారు. ఆయన సినిమా హీరో అంతే! అని అర్జున్ వ్యవహారంపై…
ప్రతిష్ఠాత్మక మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ) వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య డిసెంబర్ 26న ప్రారంభమయ్యే నాలుగో టెస్ట్ మ్యాచ్‌కు ముందు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో ప్రదర్శన సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో మహిళ చనిపోయిన ఘటనకు…
అండర్-19 ఆసియా కప్ టోర్నీలో భారత మహిళల జట్టు చరిత్ర సృష్టించింది. తొలిసారి టీ20 ఫార్మాట్లో జరిగిన ఈ టోర్నీ…