వివాదాల వీరుడు విశ్వక్సేన్ ఈ మధ్యే కొత్త కాంట్రవర్శృలో చిక్కుకున్నాడు. జూనియర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భాన్ని పురస్కరించుకుని అతను మాస్ కా బాప్ పేరుతో ఒక ట్రిబ్యూట్ సాంగ్ చేసిన సంగతి తెలిసిందే. తన స్వీయ దర్శకత్వం, నిర్మాణంలో వచ్చిన ఫలక్ నుమా దాస్ కోసం సంగీత దర్శకుడు వివేక్ సాంగ్ కంపోజ్ చేసిన ఒక రాప్ సాంగ్‌ను వాడుకుని దానికి తన, ఎన్టీఆర్ విజువల్స్ జోడించి ట్రిబ్యూట్ ఇచ్చాడు విశ్వక్. ఐతే తన అనుమతి లేకుండా ఈ పాటను వాడుకున్నాడంటూ వివేక్ అభ్యంతరం వ్యక్తం చేయడంతో రగడ మొదలైంది. ఈ పాటను తొలగించాలంటూ వివేక్ యూట్యూబ్‌లో ఈ సాంగ్ లింక్ కింద కామెంట్ కూడా పెట్టాడు. అయినా విశ్వక్ తగ్గలేదు.
దీంతో వివేక్ మరింత సీరియస్ అయిపోయాడు. అతను విశ్వక్ మీద లీగల్ యాక్షన్‌కు కూడా రెడీ అయిపోయాడు. ఆల్రెడీ విశ్వక్‌కు నోటీసులు కూడా వెళ్లినట్లు సమాచారం. ఐతే విశ్వక్ మాత్రం ఈ పాట తాను ప్రొడ్యూస్ చేసిన సినిమా కోసం కంపోజ్ చేయించుకున్నది కావడంతో దానిపై సర్వహక్కులూ తనవే అంటున్నాడు. ‘‘ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ పాటపై మాకు హక్కులు ఉన్నాయి. ఫలక్‌నామా దాస్ కోసం మేం చేయించుకొన్నాం. దానిని ఎలా ఉపయోగించుకోవాలన్నది మా విచక్షణ మేరకు ఆధారపడి ఉంటుంది. ఆ పాటను ఎట్టి పరిస్థితుల్లోనూ తొలగించం. ఈ పాటకు సంబంధించి వివేక్ క్రెడిట్ ఇచ్చాం. ఆయన అనుమతి లేకుండా చేయడం నా తప్పే. అందుకు క్షమాపణలు కూడా చెబుతున్నాను’’ అని విశ్వక్ చెప్పాడు. మరి వివేక్ మొదలుపెట్టిన లీగల్ ఫైట్ ఎక్కడిదాకా వెళ్తుందో చూడాలి మరి.
This post was last modified on May 24, 2020 1:11 am
మే 30 విడుదల కావాల్సిన కింగ్ డమ్ విడుదల అధికారికంగా వాయిదా పడింది. పోస్ట్ పోన్ వార్త పాతదే అయినా…
ఏపీలో విపక్ష పార్టీ వైసీపీకి మంగళవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత ఓ భారీ ఎదురు దెబ్బ తగిలింది. వైసీపీ అదినేత,…
ఒక్కోసారి వివాదాలే సినిమాలకు పబ్లిసిటీ తెచ్చి పెడతాయి. తమిళ స్టార్ కమెడియన్ సంతానం హీరోగా నటించిన డెవిల్స్ డబుల్ నెక్స్ట్…
గుమ్మనూరు జయరాం… బడుగు వర్గాల నుంచి వచ్చి ఏకంగా మంత్రి స్థాయికి ఎదిగిన నేతగా ఓ రేంజి రికార్డు ఆయన…
ఏపార్టీలో అయినా.. అధినేత ఒక మెట్టు దిగి వస్తే.. కార్యకర్తలు, నాయకులు రెండు మెట్లుదిగి వచ్చి అధినే తకు అనుకూలంగా…
అమీర్ ఖాన్ గంపెడాశలు పెట్టుకున్న సితారే జమీన్ పర్ ట్రైలర్ విడుదలయ్యింది. రిలీజ్ డేట్ ఇంకా నెల రోజులకు పైగానే…