ప్రముఖ సినీ నటుడు విజయ్ కుమార్ కూతురు వనితా విజయ్ కుమార్ పలు వివాదాస్పద అంశాలతో తరచూ వార్తల్లో నిలుస్తుంటుంది. తన తండ్రితో ఆస్తుల కోసం గొడవలు పడడం, మూడో పెళ్లి వంటి విషయాలతో వనితా మీడియాలో హాట్ టాపిక్ అయింది. ఆమె మూడో పెళ్లి కూడా పెటాకులైన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆమె షేర్ చేసిన ఓ ఫోటో ఇప్పుడు వైరల్ అవుతోంది. తమిళ పవర్ స్టార్ శ్రీనివాసన్ తో పూలదండలు మార్చుకుంటున్న స్టిల్ ను ఆమె తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది.
ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు, కొందరు సెలబ్రిటీలు శుభాకాంక్షలు చెబుతున్నారు. దీంతో ఆమెకి పెళ్లి జరిగిందంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. హీరోయిన్ గా సినిమాలు చేసిన ఈ బ్యూటీకి ఆ తరువాత అవకాశాలు తగ్గాయి. తమిళ బిగ్ బాస్ షోలో పాల్గొని తన పాపులారిటీ పెంచుకుంది. వీటికి తోడు తన పెళ్లిళ్ల వార్తలతో చర్చల్లో ఉంటోంది. ఇటీవల ఓ జ్యోతిష్యుడు వనితాకు నాల్గో పెళ్లి జరుగుతుందని.. ‘ఎస్’ అనే అక్షరం పేరుతో మొదలయ్యే వ్యక్తితో ఆమెకి పెళ్లి జరుగుతుందని చెప్పారు.
అంతేకాదు ఆమె రాజకీయాల్లోకి వెళ్తుందని కూడా చెప్పారు. ఈ విషయాలు బాగా వైరల్ అయ్యాయి. ఈ క్రమంలో ఆమె జ్యోతిష్యుడు చెప్పినట్లుగానే ‘ఎస్’ అనే అక్షరంతో మొదలయ్యే శ్రీనివాసన్ తో దండలు మార్చుకొని కనిపించడం చర్చనీయాంశంగా మారింది. ఎలాంటి వివరణ ఇవ్వకుండా కేవలం ఫోటో షేర్ చేసి ఊరుకుంది వనితా. అయితే ఇది నిజమైన పెళ్లి కాదని.. ప్రస్తుతం ఆమె నటిస్తోన్న ఓ సినిమాలో స్టిల్ అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మరి దీనిపై వనితా క్లారిటీ ఇస్తుందేమో చూడాలి!
This post was last modified on July 22, 2021 4:56 pm
తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…
ఏపీలో లేడీ డాన్లు పెరిగిపోయారు.. వారి తోక కట్ చేస్తానంటూ సీఎం చంద్రబాబు నాయుడు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఈరోజు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్‌షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…