రామ్ గోపాల్ వర్మకు ఏదైనా కాస్త నచ్చిందంటే దాని గురించి ఇచ్చే ఎలివేషన్లు మామూలుగా ఉండవు. మరీ అతిశయోక్తులు జోడించి పొగడ్డం ద్వారా జనాలకు అసలు నిజంగా ఇందులో విషయం ఉందా అనే సందేహాలు కలిగిస్తుంటారు. ఇక తన శిష్యుడు, తనకు అత్యంత సన్నిహితు పూరి జగన్నాథ్ ఏం చేసినా ఆహా ఓహో అనేయడం మామూలే. ఒకప్పుడు అయితే వర్మ మాటలను అందరూ పట్టించుకునేవాళ్లు కానీ.. గత కొన్నేళ్లలో ఆయన మాటలకు విలువే లేకుండా పోయింది.
గతంలో పూరి తీసిన లోఫర్ అనే అట్టర్ ఫ్లాప్ మూవీ గురించి వర్మ ఎంత గొప్పగా ట్వీట్లు వేశాడో గుర్తుండే ఉంటుంది. తన జీవితంలో అలాంటి మదర్ సెంటిమెంట్ మూవీనే చూడలేదని.. ఇంకా ఏవేవో కామెంట్లు చేశాడు. తీరా చూస్తే వర్మ మాటలకు, వాస్తవానికి పొంతనే లేకుండా పోయింది.
ఇప్పుడు మరోసారి తన శిష్యుడి సినిమా గురించి వర్మ ఊకదంపుడు ట్వీట్లు వేస్తుండటం గమనార్హం. ప్రస్తుతం విజయ్ దేవరకొండ హీరోగా పూరి తీస్తున్న లైగర్ సినిమాకు సంబంధించి రషెస్ ఏవో చూశాడట వర్మ. ఇక దాని గురించి పొగడ్తలు మామూలుగా లేవు. లైగర్ సినిమాలో విజయ్ దేవరకొండ స్క్రీన్ ప్రెజెన్స్ చూస్తే.. గత రెండు దశాబ్దాల్లో మరే స్టార్ హీరో స్క్రీన్ ప్రెజెన్స్ అలా లేదని అన్నాడు వర్మ.
ఇక ఇందులో కొన్ని సీన్లు చూస్తే.. విజయ్ సింహానికి, పులికి క్రాస్ చేస్తే వచ్చిన దానికంటే కూడా పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, రవితేజ, టైగర్ ష్రాఫ్‌లను క్రాస్ చేస్తే ఎలా ఉంటాడో అలా కనిపించాడని.. ఇలాంటి సినిమాను రూపొందించిన పూరికి, నిర్మించిన ఛార్మికి చాలా థ్యాంక్స్ అని ఒక రేంజిలో పొగిడేశాడు వర్మ. ఈ కామెంట్ల వల్ల సినిమాకు కలిగే ప్రయోజనం ఏమో కానీ… గత అనుభవాల దృష్ట్యా చేటే ఎక్కువేమో అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
This post was last modified on July 20, 2021 11:15 am
ఏపీలోని కూటమి సర్కారులో కీలక పాత్ర పోషిస్తున్న టీడీపీలో సీనియర్ నాయకుల వ్యవహారం కొన్నాళ్లుగా చర్చకు వస్తోంది. సీనియర్లు సహకరించడం…
కీలక నిర్ణయాన్ని తీసుకుంది రేవంత్ సర్కారు. హైదరాబాద్ మహానగరి విస్త్రతిని పెంచేస్తూ అంచనాల్ని సిద్ధం చేసింది. ఇప్పటివరకు హెచ్ఎండీఏ (హైదరాబాద్…
ఏపీ పర్యటనకు వచ్చిన కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా వద్ద ఏపీ సీఎం చంద్రబాబు…
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందన్నది చెప్పలేం. రాజకీయాలు రాజకీయాలే. ఇప్పుడు ఇలాంటి పరిణామమే ఎన్టీఆర్ జిల్లాలోనూ జరుగుతోంది. టీడీపీ ఎమ్మెల్యే…
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా శనివారం రాత్రి ఏపీ పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు ఏపీ…
అవును… టీడీపీ పట్ల తెలంగాణకు ఇప్పటికీ ఆశ చావలేదు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా తెలంగాణలో టీడీపీకి పెద్దగా…