కరోనా సెకండ్ వేవ్ బ్రేక్ తర్వాత థియేటర్లలోకి రాబోతున్న తొలి చిత్రం.. తిమ్మరసు. టాలెంటెడ్ యంగ్ హీరో సత్యదేవ్ ప్రధాన పాత్రలో ‘కిరాక్ పార్టీ’ దర్శకుడు శరణ్ కొప్పిశెట్టి రూపొందించిన చిత్రమిది. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ బేనర్ మీద మహేష్ కోనేరు ఈ చిత్రాన్ని నిర్మించాడు. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో చిత్ర బృందం ప్రమోషన్ల జోరు పెంచింది.
స్టార్ హీరోయిన్ సమంత చేతుల మీదుగా ఒక పాటను రిలీజ్ చేసింది. అది ఇన్‌స్టంట్‌గా జనాలకు నచ్చేస్తోంది. ఐతే అది రెగ్యులర్ పాటేమీ కాదు. ఈ పాట సినిమాలో కూడా ఉండదు. బాలీవుడ్ స్టయిల్లో చేసిన ప్రమోషనల్ సాంగ్ ఇది. దీని ఇంట్రో భలే ఫన్నీగా ఉండి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. హీరో హీరోయిన్లు సత్యదేవ్, ప్రియాంక జవాల్కర్‌లతో పాటు ఈ సినిమాలో కీలక పాత్రలు చేసిన బ్రహ్మాజీ, వైవా హర్ష కలిసి ఈ ఇంట్రోను వినోదాత్మకంగా మార్చారు.
బ్లాక్ సూట్లేసుకుని కళ్లజోళ్లు పెట్టుకుని కెమెరాను ఫేస్ చేస్తూ ప్రియాంక జవాల్కర్, బ్రహ్మాజీ, హర్ష నిలబడి ఉంటే.. వెనుక నుంచి సత్యదేవ్ వచ్చి.. ‘తిమ్మరసు’ సినిమాలో నిజానికి ఒక లవ్ సాంగ్ ఉందని.. కానీ లెంగ్త్ దృష్ట్యా దాన్ని తీసేశామని.. ఐతే ఈవిడ (ప్రియాంక) గోల భరించలేక ఈ ప్రమోషనల్ సాంగ్ చేశామని చెబుతూ.. లెట్స్ స్టార్ట్ అని పాటలోకి వెళ్లిపోయాడు సత్య. ఇక అక్కడ్నుంచి తిమ్మరసు గుణగణాలను వివరిస్తూ ఓ షో రీల్ నడుస్తుంటే మరోవైపు వీళ్ల హంగామా నడిచింది.
ప్రమోషన్లను ఏదో రెగ్యులర్‌గా లాగించేయకుండా ఇలా వెరైటీ ప్రమోషనల్ సాంగ్ చేయడం ద్వారా సినిమా కూడా కొంచెం భిన్నంగా ఉంటుందనే భరోసాను ఇచ్చింది చిత్ర బృందం. కరోనా-2 విరామం తర్వాత వస్తున్న తొలి చిత్రం కావడంతో ఇటు ఇండస్ట్రీ జనాలు, అటు ప్రేక్షకులు బాగానే ఆసక్తితో ఉన్నారీ సినిమా మీద. కాకపోతే ఇంకా రెండు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు పున:ప్రారంభం ఏ రోజు అన్నదే తేలట్లేదు.
This post was last modified on July 17, 2021 4:03 pm
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణల మధ్య సినిమాల పరంగా దశాబ్దాల నుంచి పోటీ నడుస్తోంది. వీరి అభిమానుల మధ్య ఉండే…
పెద్ద సినిమాలకు అర్ధరాత్రి అయినా, తెల్లవారుజామున అయినా స్పెషల్ షోలు వేసుకోవాలంటే సులువుగా అనుమతులు.. అలాగే రేట్లు ఎంత పెంచుకోవాలని…
మలయాళ లెజెండరీ ఆర్టిస్ట్ మోహన్ లాల్ ఎంత గొప్ప నటుడో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. నాలుగు దశాబ్దాల కెరీర్లో…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన ఇప్పుడు ఎంతగా చర్చనీయాంశం అవుతోందో తెలిసిందే. గత కొన్ని రోజుల నుంచి రెండు తెలుగు…
క్రిస్మస్ కి రావాలని ముందు డిసెంబర్ 20 ఆ తర్వాత 25 డేట్ లాక్ చేసుకుని ఆ మేరకు అధికారిక…
అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…